అనంతపురం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం ఆలమూరులో అమ్మ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో అమ్మ డైరీని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆయన అభినందించారు.
సీఎం జగన్ పాదయాత్రలో పేర్కొన్న విధంగానే డెయిరీలకు ప్రోత్సాహకాలిచ్చారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ 99 శాతం హామీలను అమలు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు ప్రకటించారని అన్నారు. పది వేలకు పైగా ఉద్యోగులను రెగ్యులర్ చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు.
సీఎం జగన్ కృషి ఫలితమే..
మహిళల స్వయం ఉపాధి కోసమే అమ్మ డైరీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. పదివేల మంది మహిళలకు పాల వ్యాపారం ద్వారా లాభాలు పంచుతామని పేర్కొన్నారు. ఏపీకి అమూల్ సంస్థ రావటం వల్లే మిగిలిన కంపెనీలు పాడి రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాయని చెప్పారు. ఇదంతా సీఎం జగన్ కృషి ఫలితమే అని వివరించారు. లక్ష లీటర్లతో ప్రారంభించిన అమ్మడైరీని పది లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment