బరువు తగ్గడం అంత ఈజీకాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. స్మార్ట్‌గా ఉండాలనే బలమైన కోరిక బరవు తగ్గించుకునేలా చేస్తుంది. అయితే కొందరూ ఆ క్రమంలో విజయం సాధిస్తే, చాలమంది మాత్రం మధ్యలోనే డైట్‌ని వదిలేసి బరువు తగ్గలేకపోతున్నాను అని బాధపడతుంటారు. కానీ ఇక్కడొక యూట్యూబర్ అందరికీ తాను జంక్ ఫుడ్ తినే వ్యక్తిగా ఫోజులిస్తూ..సడెన్‌గా తన వ్యూవర్స్‌కి గట్టి షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు ఫుడ్ బాగా లాగిస్తూ లావుగా కనిపించిన వ్యక్తి సడెన్‌గా ఇంతలా సన్నగా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఏంటా వెయట్ లాస్ సీక్రెట్ అని అందరూ చర్చించుకుంటున్నారు కూడా. అయితే మనోడు సీక్రెట్ వింటే కంగుతింటారు. అదేక్రమంలో అతని డెడికేషన్‌కి ఫిదా అవ్వుతారు కూడా.
యూట్యూబర్ నికోలస్ పెర్రీ నికోకాడో అవకాడోగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. అప్పడి వరకు అతడి పాలోవర్లు వీడియోల్లో భారీ స్థూలకాయుడిగా చూశారు. పైగా ఆయా వీడియోల్లో జంక్ ఫుడ్‌ని ఇష్టంగా లాగిస్తున్నట్లు ఉంటాయి. అలాంటిది ఒకరోజు సడెన్‌గా పెర్రీ తన ఛానెల్‌లో టూ స్టెప్స్ ఎహెడ్ పేరుతో ఓ వీడియో వదిలాడు. అందులో తాను 185 కిలోలు బరవు ఉండేవాడనని, ఈ రెండేళ్లలో దాదాపు 250 పౌండ్లు(అంటే 113 కిలోలు) తగ్గినట్లు వెల్లడించాడు.
అదెలా నిన్న మొన్నటి వీడియోల్లో మనోడు లావుగానే కనిపించాడు సడెన్‌గా ఇలా స్మార్ట్‌గా గుర్తుపట్టని విధంగా ఎలా మారిపోయాడంటూ ఆశ్చర్యపోయారు ఫాలోవర్లు. అయితే ఈ యూట్యూబర్ తన ఫిట్‌స్‌పై పూర్తి ఫోకస్ పెట్టేందుకు రెండేళ్ల క్రితమే రికార్డు చేసిన వీడియోలను కొద్ది మార్పులతో షేర్ చేసేవాడనని అన్నాడు. అలా తన డైట్, బాడీపై దృష్టిపెట్టి బరువు తగ్గే వ్యాయామాలు, వర్కౌట్‌లు చేసినట్లు చెప్పుకొచ్చాడు. బరువు తగ్గడం కోసం రెండేళ్ల నుంచి కంటెంట్ రూపొందించకుండా దూరంగా ఉన్నట్లు తెలిపాడు.
తాను తినే ఫుడ్ నుంచి చేసే వర్కౌట్‌ల వరకు ప్రతి దానిపై పూర్తి శ్రద్ధపెట్టానని చెప్పుకొచ్చాడు పెర్రీ. ఆ క్రమంలో ప్రజలు నన్ను బహిరంగంగా గుర్తుపట్టకుండా ఉండేలా గుండు గీయించుకుని జాగ్రత్త పడినట్లు తెలిపాడు. అందుకు తన తోటి యూట్యూబర్‌లకు సాయం చేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఆయా వీడియోల్లో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు కనిపించినా..తాను మాత్రం కంట్రోల్‌లోనే ఆహారం తీసుకున్నట్లు వివరించాడు.
ఇక్కడ యూట్యూబర్ జంక్ ఫుడ్ తినే వ్యక్తిగా చూపిస్తూ..ప్రేక్షకులను బురిడికొట్టించినా..తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి అంతలా అన్ని కిలోలు తగ్గడం మాత్రం అందరికీ ప్రేరణ అనే చెప్పొచ్చు. అలాగే యూట్యూబ్ వీడియోల్లో చెప్పే ప్రతి విషయం ఎంత వరకు నిజం అనేది ప్రజలు గ్రహించాలనే విషయం..ఈ యూట్యూబర్ ఉదంతమే చెబుతోంది కదూ..!
(చదవండి: ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే? విద్యా బాలన్ నుంచి సన్యా మల్హోత్రా వరకు...)
Comments
Please login to add a commentAdd a comment