ముంబై: రియాలిటీ టీవీ స్టార్, హిందీ బిగ్‌బాస్-13 కంటెస్టెంట్ హిమాన్షీ ఖురానా గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్) సమస్య తీవ్రమైన నేపథ్యంలో త్వరలోనే సర్జరీ చేయించుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు వెల్లడించాయి. కాగా హిమాన్షీ కొన్నిరోజుల క్రితం తాను వీల్ చైర్‌లో కూర్చుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో అభిమానలంతా ఆమె కాలికి గాయమైందని ఆందోళన చెందారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. (చదవండి: 4 రోజుల్లో కంగన వెళ్లిపోతున్నారు: బీఎంసీ )
ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన హిమాన్షీ సన్నిహితులు.. నెలసరిలో అధిక రక్తస్రావం మూలాన ఆమె ఆరోగ్యం క్షీణించిందని, అందుకే తను వీల్‌చైర్‌ను ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘‘తను నడిచే పరిస్థితుల్లో లేదు. కానీ ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ చేయాల్సి ఉంది. దానిని రద్దు చేసే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హిమాన్షీ అలా వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ అయిపోగానే తను సర్జరీ చేయించుకుంటుంది’’ అంటూ వివరణ ఇచ్చారు. ( (చదవండి: రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ...)
కాగా పీసీఓఎస్ కారణంగా బరువు అధికంగా పెరిగినందు వల్ల సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన ప్రతిసారీ తాను ట్రోలింగ్ బారిన పడ్డానని హిమాన్షీ గతంలో వెల్లడించారు. ‘‘పీసీఓస్ వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. పీసీఓస్ కారణంగా నాకు తరచుగా బీపీ డౌన్ అవుతుంది. అందుకే ప్రతీ మూడు గంటలకొకసారైనా ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తాను. అయితే అందరు స్త్రీలల్లో ఇదే తరహా అనారోగ్య సమస్యలు తలెత్తకపోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటే దీనిని అధిగమించవచ్చు’’ అని చెప్పుకొచ్చారు.
అండాశయంలో నీటితిత్తులు (పీసీఓఎస్)
ప్రస్తుతం చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత అనే సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి. దీనినే పీసీఓడి (పీసీ) లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. వారసత్వంగా, జన్యువులలో ఏదైనా తేడా వచ్చినప్పుడు దీని బారిన పడవచ్చు. లేదా మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన హార్మోన్ల మీద దాని ప్రభావం చూపి పీసీఓడి సమస్య తలెత్తవచ్చు. కాగా.. ఒక్కొక్కసారి ఈ పీసీఓడీ సమస్యకు సరైనరీతిలో చికిత్స తీసుకోకపోతే, హైపోథైరాయిడిజమ్ సమస్యకు కూడా దారితీస్తుంది. అంతేకాకుండా, సంతానం కలిగిన, పుట్టబోయే పిల్లలలో జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు
1) నెలసరుల సమస్యలు
2)సంతానలేమి
3) మగవాళ్ళల్లో ఉండవలసిన ఎండ్రోజన్ హార్మోన్లు స్త్రీలలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి అవాంఛిత రోమాలు, నెలసరులు తరచుగా వస్తూండడం జరుగుతుంది.
4)బరువు అతిగా పెరగటం
Comments
Please login to add a commentAdd a comment