Sara Tendulkar Birthday Wishes Brother Arjun With Special Gift Viral - Sakshi
Sakshi News home page

తమ్ముడికి సారా టెండూల్కర్‌ అదిరిపోయే గిఫ్ట్‌

Published Fri, Sep 24 2021 6:14 PM | Last Updated on Fri, Sep 24 2021 7:24 PM

Sara Tendulkar Birthday Wishes Brother Arjun With Special Gift Viral  - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఈరోజు(సెప్టెంబర్‌ 24న) 22వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌ తన తమ్ముడికి అదిరిపోయే బర్త్‌డే గిప్ట్‌ ఇచ్చింది.  తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిన్ననాటి అర్జున్‌ వీడియోనూ షేర్‌ చేసింది. ఆ వీడియోలో చిన్ననాటి అర్జున్‌తో పాటు పక్కన సారా అతన్ని ఆడిస్తూ కనిపించింది. '' నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. ఈరోజుతో 22వ పడిలోకి అడుగుపెడతున్నాడు.. లవ్‌ యూ బ్రదర్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. వీడియోకు లవ్‌ సింబల్స్‌ను ఎమోజీ రూపంలో పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

చదవండి: పొలార్డ్‌కే దంకీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్‌ చూసుకుంటా


కాగా అర్జున్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో పాల్గొంటున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్‌ కనీస  మద్దతు ధర రూ. 20 లక్షలకు అర్జున్‌ను కొనుగోలు చేసింది. కాగా అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌లో ఆడడం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ముంబై ఇండియన్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అనుకున్నంత విధంగా రాణించడం లేదు. ఇప్పటికే 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై ఇండియన్స్‌ 4 విజయాలు.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.  ముంబై ఇండియన్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 26న ఆర్‌సీబీతో ఆడనుంది.

చదవండి: టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement