Sachin Tendulkar Daughter: Sara Enters Into Modelling World Video Viral - Sakshi
Sakshi News home page

Sara Tendulkar: మోడలింగ్‌లో అడుగుపెట్టిన సచిన్‌ తనయ.. వీడియో వైరల్‌

Published Tue, Dec 7 2021 11:00 AM | Last Updated on Tue, Dec 7 2021 11:55 AM

Sachin Tendulkar Daughter Sara Enters Into Modelling World Video Viral - Sakshi

Sachin Tendulkar Daughter Sara Enters Into Modelling World Video Viral: టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయ సారా టెండుల్కర్‌ మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. ప్రముఖ క్లాతింగ్‌ బ్రాండ్‌కు ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సారా తన సోషల్‌ మీడియా అకౌంట్లో షేర్‌ చేసింది. ఇందులో.. నటి బనితా సంధు, తానియా ష్రాఫ్‌తో కలిసి సారా టెండుల్కర్‌ తళుక్కుమంది. ఈ క్రమంలో అభిమానులు ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. మోడలింగ్‌ కెరీర్‌లో విజయవంతంగా కొనసాగాలంటూ విష్‌ చేస్తున్నారు.

కాగా సచిన్‌- అంజలి దంపతులకు సారా, అర్జున్‌ సంతానం అన్న సంగతి తెలిసిందే. అర్జున్‌ ఇప్పటికే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోగా.. సారా మోడల్‌గా తన ప్రయాణం ఆరంభించింది. ఇక అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్‌.. ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ద్వారా దేశవాళీ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ అర్జున్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  

ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా.. టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సరదాగా సంభాషించడంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఇద్దరూ ఈ విషయంపై మౌనం వహించడం.. ఇటీవలే గిల్‌ బ్రేకప్‌నకు సంబంధించి కోట్స్‌ షేర్‌ చేయడంతో రూమర్స్‌కు చెక్‌ పడింది. మరోవైపు.. సింగర్‌ కనికా కపూర్‌తో సారా నైట్‌డేట్‌కు వెళ్లడం.. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడేమో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్లు చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఏదో ఒక వార్తతో సారా పేరు నెటిజన్ల నోళ్లలో నానుతూ ఉంది.

చదవండి: Ind Vs Nz 2nd Test: ఫోర్‌​ కొట్టిన గిల్‌.. సచిన్‌ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే!  
IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement