Watch: Sachin Tendulkar Takes Chai Break During Road Trip, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sachin Road Trip: సచిన్‌ టెండూల్కర్‌ కేరాఫ్‌ 'సింప్లిసిటీ'

Published Thu, Nov 3 2022 6:28 PM | Last Updated on Fri, Nov 4 2022 1:27 PM

Sachin Tendulkar Takes Chai Break During Road-Trip Viral Video - Sakshi

టీమిండియా క్రికెట్‌ దిగ్గజం.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆటలో ఎంత సింప్లిసిటీ చూపించాడో బయట కూడా అదే హుందాతనం ప్రదర్శిస్తాడు. మాస్టర్‌ ఏ ప్లేస్‌కు వెళ్లినా సరే అక్కడున్న వారితో సరదాగా గడుపుతూ వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. 

తాజాగా రోడ్ సైడ్ టీని ఎంజాయ్ చేశాడు సచిన్‌ టెండూల్కర్‌. తన కుమారుడు అర్జున్‌తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్‌ వాలాతో ముచ్చటించారు. అక్కడున్న వారితో సెల్ఫీలు తీసుకుంటూ.. సందడి చేశారు. అనంతరం అక్కడ చాయ్‌తాగి ఆ రుచిని ఎంజాయ్‌ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘రోడ్‌ ట్రిప్‌లో చాయ్‌ బ్రేక్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ రంజీ సీజన్ లో ముంబయి జట్టును వీడి గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో రంజీ ట్రోఫీ గ్రూప్ దశలో అర్జున్‌కు ముంబై జట్టులో స్థానం దక్కింది. అయితే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. నాకౌట్ దశకు వచ్చేసరికి అర్జున్‌ను జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ గోవాకు తరలి వెళ్లాడు.

సచిన్‌పై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ప్రశంసల జల్లు కురిపించారు.''ఆ టీ అమ్మే వ్యక్తి కచ్చితంగా ప్రత్యేకమైన వ్యక్తి. అతని దగ్గరికి దేవుడే టీ కోసం వచ్చాడు'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌‌లో సచిన్‌కు 36 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సచిన్ తన వంట నైపుణ్యంతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. విభన్నమైన వంటలు చేసి.. ఆ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేయడం బాగా వైరల్‌ అయింది.

చదవండి: ప్రొటీస్‌ పరాజయం.. స్పష్టంగా కనిపించిన మిల్లర్‌ లోటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement