వెళ్లు.. ప్రపంచాన్ని జయించు: సచిన్‌ భావోద్వేగం | Sachin Tendulkar gets nostalgic on daughter Saras graduation | Sakshi
Sakshi News home page

వెళ్లు.. ప్రపంచాన్ని జయించు: సచిన్‌ భావోద్వేగం

Published Sat, Sep 8 2018 11:25 AM | Last Updated on Sat, Sep 8 2018 6:21 PM

Sachin Tendulkar gets nostalgic on daughter Saras graduation - Sakshi

ముంబై: కూతురు సారా గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్న క్షణాన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్‌ తరువాత కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సచిన్‌.. శుక్రవారం లండన్‌లో సారా పట్టాను అందుకున్న తరుణంలో ట్విటర్‌లో తన అనుభూతిని పంచుకున్నాడు. ‘నిన్నమొన్ననే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు మాకు గర్వంగా ఉంది. వెళ్లు...ప్రపంచాన్ని జయించు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

సారా స్నాతకోత్సవ కార్యక్రమానికి సచిన్‌ భార్య అంజలితో హాజరయ్యాడు. ముంబై ధీరుభాయ్‌ అంబాని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన సారా లండన్‌ యూనివర్సిటీ కళాశాలలో మెడిసన్‌ పూర్తిచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement