
కాబోయే వధూవరులు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌లకు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. అందమైన జంట విషయంలో 'LBW' అంటే వేరే అర్థం ఉందంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు.
కాగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబానీల స్వస్థలం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముందుస్తు పెళ్లి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
మార్చి 1-3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వ్యాపార దిగ్గజాలు సహా సినీ, క్రీడా ప్రముఖులంతా విచ్చేశారు. సచిన్ టెండుల్కర్ సైతం సతీమణి అంజలి, కుమార్తె సారాతో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో పాలు పంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో.. ‘‘అనంత్, రాధిక విషయంలో ‘LBW’ అంటే ప్రేమ(Love), ఆశీర్వాదాలు(Blessings), అభినందనలు(Wishes). అందమైన జంటకు శుభాకాంక్షలు’’ అని సచిన్ టెండుల్కర్ కాబోయే జంట ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి విషెస్ తెలిపాడు.
అన్నట్లు క్రికెట్ పరిభాషలో.. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్. బ్యాటర్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బౌలర్ సంధించే బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల ముందే అతడికి దొరికి పోయి పెవిలియన్ చేరాల్సిందే!
స్పెషల్ అట్రాక్షన్‌గా సారా
అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ముఖ్యంగా ఎరుపు వర్ణం లెహంగాలో ముద్ద మందారంలా చక్కగా కనిపించింది. ఆ ఫొటోలను సారా ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే!
The 'LBW' here stands for Love, Blessings, and Wishes for Anant and Radhika!
— Sachin Tendulkar (@sachin_rt) March 4, 2024
Best wishes to the beautiful couple. pic.twitter.com/L14RvNefXH