టీమిండియాకు సపోర్టుగా సారా (PC: X)
ICC ODI WC 2023- Ind Vs Ban: వన్డే వరల్డ్‌కప్-2023.. గురువారం.. పుణెలో టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది.. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) శుభారంభం అందించారు. ఈ జంటను విడదీసిన భారత బౌలర్లు మిడిలార్డర్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(38) తన భుజాల మీద వేసుకున్నాడు. మరో ఎండ్‌లో తౌహీద్ హృదోయ్ కూడా తన వంతు పోరాటం చేస్తున్నాడు. అయితే, 38వ ఓవర్ రెండో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో హృదోయ్ ఇచ్చిన క్యాచ్‌ను టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఒడిసిపట్టాడు.
సింపుల్ క్యాచ్ అందుకున్న గిల్
మిడ్‌వికెట్ మీదుగా హృదోయ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను గిల్ అందుకోగానే.. కెమెరాలన్నీ స్టేడియంలో ఓ అమ్మాయి వైపునకు తిరిగాయి. ఆమె మరెవరో కాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ గారాల కుమార్తె సారా టెండుల్కర్.
కాగా గిల్, సారా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్న క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వాటిని బలపరుస్తూ తామిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు ఈ జంట ఎన్నోసార్లు సంకేతాలు కూడా ఇచ్చింది.
గిల్- సారా బ్రేకప్ కూడా అంటూ
అయితే, దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ పెట్టిన పోస్టుతో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుబ్‌మన్ గిల్ కనిపించడంతో ఆమెతో అతడి పేరును లింక్ చేసేశారు.
అయినప్పటికీ సారా టెండుల్కర్ ఎక్కడ కనిపించినా గిల్ ఇష్టసఖిగా పేర్కొంటూ ఆమె ఫొటోలను వైరల్ చేయడం నెటిజన్లకు పరిపాటిగా మారింది. తాజాగా టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్స్ సైతం గిల్ క్యాచ్ అందుకోగానే కెమెరాను మరోసారి సారా వైపునకు ఫోకస్ చేయడం గమనార్హం.
టీమిండియాకు సపోర్టుగా సారా
ఈ నేపథ్యంలో.. ‘‘వదినమ్మ సూపర్’’ అంటూ గిల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా.. ‘‘కెమెరామెన్‌కు కూడా.. మీలాగే ఏం పనీపాటా లేనట్లుంది. సారా టీమిండియాకు సపోర్టుగా వచ్చింది’’ అంటూ సచిన్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.
మరికొంతమందేమో.. ‘‘కెమెరాపర్సన్‌కి పబ్లిక్ పల్స్ బాగా తెలుసు.. అందుకే సారాను స్పెషల్‌గా చూపిస్తున్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 256 పరుగులు స్కోరు చేసింది.
చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన
Shubman Gill took a catch and cameraman show sara tendulkar 👀👀 #INDvsBAN pic.twitter.com/6dkKn3x634
— Jashan (@Jashan1705) October 19, 2023
Sara Tendulkar in the stands. pic.twitter.com/H0N5KWToiA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023
Sara Tendulkar is in the house😀#INDvBAN #indiavsbangladesh #Saratendulkar #ShubmanGill pic.twitter.com/HolLVxNIpK
— Nikhil 🇮🇳 (@niks9326) October 19, 2023
Sara Tendulkar clapping after Shubman Gill's two sixes. pic.twitter.com/cGKHDUyyX4
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023
Comments
Please login to add a commentAdd a comment