ఇషాన్ కిషన్- శిఖర్ ధావన్
Ishan Kishan- Shikhar Dhawan: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో తుపాన్ ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీ సాధించిన చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్.. ఒక్క దెబ్బతో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీనే.. ద్విశతకంగా మార్చడమే గాక మరిన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ 24 ఏళ్ల జార్ఖండ్ డైనమైట్.
వాళ్లకు సవాల్
తద్వారా ఓపెనింగ్ స్థానానికి తను సరిగ్గా సరిపోతాననే సంకేతం ఇచ్చి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఉనికిని ప్రశ్నార్థకం చేశాడు. దీంతో పాటుగా ఇతర వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లకు గట్టి సవాల్ విసిరాడు.
ఇషాన్ సంగతి ఇలా ఉంటే.. శుబ్‌మన్ గిల్ సహా దేశవాళీ టోర్నీల్లో ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ధావన్‌ను ఆడించాల్సిన పనిలేదు!
టీమిండియా గనుక ఒకవేళ వన్డేల్లో మూడు వందల పైచిలుకు పరుగులు చేయాలంటే శిఖర్ ధావన్‌కు జట్టులో చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు మాజీ వికెట్ కీపర్ సబా కరీం న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎవరిని ఆడించాలి.. ఎవరిని పక్కన పెట్టాలి అన్న విషయం మేనేజ్‌మెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
అయితే, వన్డేల్లో జట్టు టార్గెట్ 275- 300 సరిపోతుంది అనుకుంటే వాళ్లకు శిఖర్ ధావన్ లాంటి ఆటగాడితో అవసరం ఉంటుంది. ఈ సిరీస్‌లో అతడు పరుగులు చేయలేదు. అయినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వాలని భావిస్తే.. టార్గెట్ 275-300 వరకే ఆశించాలని గుర్తుపెట్టుకోవాలి.
అలా అనుకుంటేనే ధావన్‌కు వరల్డ్‌కప్ జట్టులోనూ చోటు దక్కుతుంది. ఒకవేళ జట్టు 325- 350 వరకు స్కోరు చేయాలని కోరుకుంటే ధావన్‌ను పక్కనపెట్టొచ్చు’’’ అని తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
వాళ్లంతా ఉన్నారు కదా!
ఇక యువ ఓపెనర్ల పేర్లను ప్రస్తావిస్తూ.. ‘‘జట్టు నుంచి ఏం ఆశిస్తున్నారన్న విషయంపై సెలక్టర్లు, మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు స్పష్టత ఉండాలి. శిఖర్ ధావన్ నుంచి 130- 140 స్ట్రైక్‌రేటుతో గనుక భారీగా పరుగులు ఆశిస్తే అది ఎప్పటికీ జరుగదు.
నిజానికి మనం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంకాస్త వెనుకబడే ఉన్నాం. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’’ అని మాజీ సెలక్టర్ సబా కరీం బీసీసీఐకి సూచించాడు.
చదవండి: Cristiano Ronaldo: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం! పోస్ట్ వైరల్
Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!
Comments
Please login to add a commentAdd a comment