
సచిన్ కూతురితో హీరో ఫొటో
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియా చక్కెర్లు కొడుతోంది. 19 ఏళ్ల సారా టెండూల్కర్ సాధారణంగా ఫేజ్ త్రీ సర్కిల్ లో కనిపించదు. చాలా మంది సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా ప్రచారానికి దూరంగా ఉంటుంది. అలాంటిది రణవీర్ సింగ్ తో కలిసి ఆమె ఫొటో దిగింది. గుబురు గెడ్డం, మీసాలతో ఉన్న రణవీర్ నవ్వుతూ సారాతో ఫొటో దిగాడు. సోషల్ మీడియా చక్కెర్లు కొడుతున్న ఈ ఫొటోను అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
కాగా, బాలీవుడ్ లో హీరోయిన్ గా సారా తెరంగ్రేటం చేయనుందని రెండేళ్ల క్రితం ఊహాగానాలు వచ్చాయి. షాహిద్ కపూర్ సరసన ఆమె నటించనుందని అప్పట్లో రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని సచిన్ టెండూల్కర్ ట్విటర్ ద్వారా తెలిపాడు. సారా చదువుకుంటోందని, సినిమాల్లోకి వస్తుందన్న వార్తలు నిరాధారమని పేర్కొన్నాడు.
తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమాతో టెండూల్కర్ తెరగ్రేటం చేస్తుండడం విశేషం. లండన్ ను చెందిన జేమ్స్ ఇరస్కీన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 26న విడుదలకానుంది.