
మోడీయే మన భావి ప్రధాని: సారా టెండూల్కర్
సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు ఇచ్చింది ఎవరు.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టింది ఎవరు.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. కానీ ఆయన గారాల కూతురు సారా టెండూల్కర్ మాత్రం, భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవిలో ఎవరిని చూడాలనుకుంటోందో తెలుసా.. నరేంద్ర మోడీని!!
అవును.. ఇది అక్షరాలా నిజం నరేంద్రమోడీకి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, ఆయనే మన భావి ప్రధానమంత్రి అవ్వబోతున్నారని స్వయంగా సారా టెండూల్కర్ ఇటవల ట్విట్టర్లో కామెంట్ పెట్టారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం బాగానే చక్కర్లు కొడుతోంది. టెండూల్కర్ కుమార్తె కావడం, ఆమె నరేంద్రమోడీ ప్రధాని అవుతారని చెప్పడంతో చాలామంది ఆసక్తిగా ఆమె కామెంట్ల కోసం ట్విట్టర్ను గాలించారు. అయితే సారా టెండూల్కర్ పేరుతో చాలా ఖాతాలు ఉండటంతో ఏది సరైన ఖాతాయో పట్టుకోడానికే చాలా సమయం పడుతోంది. @Imsara_st అనేది సారా టెండూల్కర్ అసలైన ట్విట్టర్ ఖాతా.
So as per the survey last night I must say @narendramodi has got a huge fan base and he is going to be our future prime minister!
— Sara Tendulkar (@Imsara_st) January 26, 2014