సాక్షి, ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ముంబై వీధుల్లో సందడి చేశారు. తన స్నేహితురాలితో కలిసి ఓ కాఫీ షాపుకు వచ్చిన సారా ఫోటోలను ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ క్లిక్‌మనిపించారు. ఇందులో సారా వైట్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ క్యాజువల్ వేర్‌లో కనిపించారు. ఇప్పటికే సారాకు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్న సారాకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన అప్‌డేట్స్‌ని పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు.
1995 మే 24ను అంజలి మెహతాను పెళ్లాడిన సచిన్ టెండూల్కర్.. 1997 లో టీమిండియా కెప్టెన్‌గా సహారా కప్‌ను గెలుచుకున్నాడు. దీనికి గుర్తుగా తన కుమార్తెకు సారా అని పేరు పెట్టినట్లు స్వయంగా సచిన్ ఓ సందర్భంలో చెప్పాడు. కాగా సారా టెండూల్కర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమవుతోందని అప్పట్లో టాక్ వినపించింది. అయితే తండ్రి సచిన్ మాత్రం ఆ వార్తలను ఖండించారు. ప్రస్తుతానికి సారా చదవు మీదే దృష్టి పెట్టిందని, ఇప్పుడు సినిమాల ఆలోచన లేదని వివరణ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన సారా..ప్రస్తుతం లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. (మరోసారి వార్తల్లో శుభ్‌మన్, సారా టెండూల్కర్)
Comments
Please login to add a commentAdd a comment