
కోల్‌కతా: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్ కుమార్(32)గా గుర్తించారు. వేధింపులకు పాల్పడటమే కాకుండా సారాను కిడ్నాప్ చేస్తానని నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. సచిన్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు.
తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని సచిన్ ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సచిన్ ఇంటిలోని లాండ్ నంబర్‌కు 20 సార్లు ఫోన్ చేసి సారా గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డిసెంబర్ 2న చివరిసారిగా ఫోన్ చేశాడని, డిసెంబర్ 5న బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
టెలిఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. నిందితుడి మానసికస్థితి సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడిని ముంబైకి తీసుకొచ్చి, కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, సచిన్ ఫోన్ నంబర్ అతడికెలా తెలిసింది, నిందితుడి మానసిక పరిస్థితి నిజంగానే సరిగా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment