Sara Ali Khan Opens Up On Marrying A Cricketer Amid Dating Rumours - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: క్రికెటర్‌తో పెళ్లి.. ఓపెన్‌గానే చెప్పేసిన సారా అలీ ఖాన్!

Published Thu, Jun 8 2023 9:33 AM | Last Updated on Thu, Jun 8 2023 9:59 AM

Sara Ali Khan Opens Up About Marrying A Cricketer Amid Dating Rumours - Sakshi

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విక్కీ కౌశల్‌తో జంటగా నటించిన చిత్రం జరా హాట్కే జరా బచ్కే. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సారా అలీ ఖాన్ టీమిండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!)

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సారాను మీరు క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనికి తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. తనకు వారు ఎలాంటి వృత్తిలో ఉన్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోనని ఓపెన్‌గానే చెప్పేసింది. వారు నటుడు, క్రికెటర్, వ్యాపారవేత్త, డాక్టరైనా సరేనని చెప్పుకొచ్చింది. తన మేధోస్థాయికి సరిపోయే వ్యక్తిగా ఉంటే చాలని ఆమె పేర్కొంది. కాగా.. గతంలో తన అమ్మమ్మ, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్.. మాజీ భారత క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 

సారా, శుభ్‌మాన్‌ డేటింగ్ రూమర్స్

కాగా.. గతంలో సారా, శుభ్‌మాన్ డేటింగ్‌ డిన్నర్ డేట్‌లో ఒకే రెస్టారెంట్‌లో కనిపిచండంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరిద్దరు విడిపోయినట్లు వైరలైంది. సారా ప్రస్తుతం కరణ్ జోహార్  ఏ వతన్ మేరే వతన్‌లో కనిపించనుంది. ఇది ఓటీటీలో విడుదల కానుంది. హోమీ అదాజానియా మూవీ 'మర్డర్ ముబారక్', ఆదిత్య రాయ్ కపూర్ సరసన అనురాగ్ బసు చిత్రం 'మెట్రో...ఇన్ డినో'లో కూడా సారా నటిస్తోంది.

(ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement