Udupi College Washroom Video: FIR Against Students, College - Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో తోటి విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ.. ముగ్గురు అమ్మాయిలపై కేసు

Published Wed, Jul 26 2023 9:18 PM | Last Updated on Thu, Jul 27 2023 11:19 AM

Udupi College Washroom Video: Fir Against Students - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర: ఉడుపి పట్టణంలోని మహిళా నర్సింగ్‌ కాలేజీ బాత్‌రూమ్‌లో ఓ వర్గానికి చెందిన విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీశారంటూ వారం రోజులుగా కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివాసం ఉంటున్న ఉడుపి వాసి, సమాజ సేవకురాలు రశ్మి సమంత్‌ ట్వీట్‌ చేసి మరో వర్గానికి చెందిన ముగ్గురు యువతులు వీడియో తీశారంటూ పెట్టిన పోస్టు సంచలనం కలిగించింది.

దీంతో ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఉడుపి ఎస్పీ అక్షయ్‌ మశ్చింద్రను వివరణ కోరగా సోషల్‌ మీడియాలో మరో రకమైన వీడియో చూపించారని, అందులో వాయిస్‌ ఎడిట్‌ చేసి వైరల్‌ చేసినట్లు తెలిపారు. సుమోటా కేసుగా నమోదు చేసినట్లు చెప్పారు.

చర్యలు తీసుకుంటున్నాం:
బాత్‌రూమ్‌లో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రాజ్యోతి నర్సింగ్‌ కళాశాల డైరెక్టర్‌ రశ్మీ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కారకులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు.
చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement