College Girls
-
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్‌లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024 -
ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి
‘పక్కింట్లో సుజాత నాతో కాలేజ్కొచ్చేది ఇప్పుడు ఎక్కడుందో’ ‘డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్‌లో చూశాను సంధ్యను. మళ్లీ కాంటాక్ట్ లేదు’ ‘పెళ్లయ్యాక రెండుమూడుసార్లు మాట్లాడింది మాలతి. చూసి ఎన్నాళ్లయ్యిందో’స్త్రీల మధ్య ఏర్పడే గాఢమైన స్నేహాలు ఎప్పుడో ఒకసారి తెగిపోవడమే జరుగుతుంది. ఫ్రెండ్షిప్ డే నాడు స్త్రీలు తమ ఆత్మీయ స్నేహితురాళ్లను తలుచుకోవడమే తప్ప కలుసుకునే వీలెక్కడ? కాని నాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి కదా.చిన్నప్పుడు ఆడపిల్లలు జట్టు కడతారు. అరుగుల మీద ఆటలాడతారు. స్కూల్ నుంచి రాగానే గబగబా స్నానాలు ముగించి కూడబలుక్కుని ట్యూషన్లకు నడుస్తారు. ఆదివారం వస్తే కలిసి పూలు కోసుకుంటారు. రేడియోలో ΄ాటలు... దూరదర్శన్‌లో చిత్రహార్లు ...స్నేహితురాలి కుటుంబంతో సినిమా కు వెళ్లడం లేదా తన కుటుంబంతో స్నేహితురాలిని తీసుకెళ్లడం... ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత కబుర్లు.. రహస్యాలు... వెంటబెట్టుకెళ్లి చేసే బట్టల సెలక్షన్లు... జామెట్రీ బాక్స్‌లో దాచిన చిరుతిండ్ల పంపకాలు... ఇవన్నీ గొప్ప ఆనందాలు... శాశ్వతం అనిపిస్తాయి. కాని కుదరదు. చాలామందికి ఆ స్నేహం అసంపూర్ణమే.వివాహం ఒక పునరావాసంపెళ్లయ్యాక స్త్రీ భర్త ఇంటికి చేరుతుంది. భర్తది అదే ఇల్లు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా. కాని అమ్మాయికి పెళ్లికి ముందు ఒక ఇల్లు. పెళ్లి తర్వాత ఒక ఇల్లు. పుట్టింటి వాళ్లు తమ కూతురి స్నేహాలను ప్రోంత్సహిస్తారు. ఆమె స్నేహితురాళ్లను తమ ఇంటి ఆడపిల్లల్లా చూస్తారు. వారికి ఎప్పుడూ స్వాగతం ఉంటుంది. కాని పెళ్లి అమ్మాయిని ‘పరాయి ఇంటి’కి చేరుస్తుంది. ఆ పరాయి ఇంట్లోకి పెళ్లికూతురి స్నేహితురాలు స్వతంత్రించి వెళ్లలేదు. అందుకు భర్త అనుమతి అత్తామామల అనుమతి కావాలి. అది అంత సులభం కాదు.కుటుంబమే ముఖ్యంస్త్రీ ఇంటి పట్టున ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా కుటుంబం మొదటి ప్రాధాన్యం అవుతుంది. పిల్లలు పుట్టాక స్త్రీ అన్నీప్రాధాన్యాలనూ వెనక్కు నెట్టి పిల్లల బాధ్యత ప్రథమంగా తీసుకుంటుంది. ఆమెకు సమయం చిక్కదు. ఆమె తన స్నేహితురాళ్లతో ఫోన్ మాట్లాడటం ఒకోసారి అభ్యంతరకరం కూడా కావచ్చు. ‘ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. కాని ఎప్పుడు చెప్పుకోవడం. ఎన్నోసార్లు కలవాలని ఉంటుంది. కాని ఎలా కలవడం?’అతడిలా ప్రయాణం కట్టడంభర్తకు విసుగు కలిగితే తన స్నేహితులను తీసుకొని అలా ఒక టూర్‌కు వెళతాడు. భార్య అలా తన స్నేహితురాళ్లతో వెళ్లలేదు. సామాజిక భద్రత సంగతి ఒక కారణమే అయినా అసలు అలాంటి వీలు కూడా ఉండదు చాలాసార్లు. తన స్నేహితులు వస్తే భార్యను పరిచయం చేసి వారికి టీలు కాఫీలు భోజనాలు భార్య చేత ఏర్పాటు చేయించే భర్త ‘నీ స్నేహితురాళ్లను నువ్వూ ఆహ్వానించుకోవచ్చు’ అని అనడం చాలా తక్కువగా జరుగుతుంది. విచిత్రమేమంటే మధ్య వయసు దాటాకే స్త్రీలు తమ పాత స్నేహితురాళ్లను కలిసే అనుమతి ΄÷ందుతారు. లేదా పిల్లల ద్వారా స్నేహాన్ని పునరుద్ధరించుకుంటారు.స్నేహం అవసరంప్రతి మనిషికీ స్నేహం అవసరం. భర్త, పిల్లలు, బంధువులు ఎందరు ఉన్నా ప్రతి స్త్రీకి తన చిన్ననాటి, కాలేజీ నాటి, ఊరి స్నేహితురాళ్లు తప్పక అవసరమే. వారితో పంచుకునే విషయాలు. వారి ద్వారా ΄పోందే ఓదార్పు, వారి నుంచి పోందే సలహాలు, వెళ్లబోసుకోవడాలు... ఇవన్నీ స్త్రీలు అలసిపోకుండా చూస్తాయి. కాని దురదృష్టవశాత్తు మన దేశంలో స్నేహమంటే పురుషుల స్నేహమే. స్నేహగాథలన్నీ వారివే. కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండే స్త్రీ కూడా తన పాత స్నేహితురాలు కనిపిస్తే నవ్వే నవ్వు, కార్చే ఆనందబాష్పాలు పూర్తిగా ప్రత్యేకం. ఆ నవ్వు ఆనందబాష్పాలు వారికి దక్కాలని ఈ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా కోరుకుందాం. -
College Annual Day Photos: ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
కాలేజీ అమ్మాయిలా లంబసింగి హీరోయిన్ దివి.. ఫోటోలు
-
ప్రపంచంలోనే ‘పిన్న’ బిలియనీర్‌గా లివియా
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లుకూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియా తాత వెర్నెర్ రికార్డో వొయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు. ఫోర్బ్స్ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదలచేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల(1.1 బిలియర్ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయసు్కరాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడంబరంగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. -
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యార్థుల సందడి (ఫోటోలు)
-
బాత్రూంలో తోటి విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ.. ముగ్గురు అమ్మాయిలపై కేసు
యశవంతపుర: ఉడుపి పట్టణంలోని మహిళా నర్సింగ్ కాలేజీ బాత్రూమ్లో ఓ వర్గానికి చెందిన విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీశారంటూ వారం రోజులుగా కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివాసం ఉంటున్న ఉడుపి వాసి, సమాజ సేవకురాలు రశ్మి సమంత్ ట్వీట్ చేసి మరో వర్గానికి చెందిన ముగ్గురు యువతులు వీడియో తీశారంటూ పెట్టిన పోస్టు సంచలనం కలిగించింది. దీంతో ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఉడుపి ఎస్పీ అక్షయ్ మశ్చింద్రను వివరణ కోరగా సోషల్ మీడియాలో మరో రకమైన వీడియో చూపించారని, అందులో వాయిస్ ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు తెలిపారు. సుమోటా కేసుగా నమోదు చేసినట్లు చెప్పారు. చర్యలు తీసుకుంటున్నాం: బాత్రూమ్లో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రాజ్యోతి నర్సింగ్ కళాశాల డైరెక్టర్ రశ్మీ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కారకులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య -
నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..
సాక్షి, అన్నమయ్య: నర్సింగ్ చదువుతున్న అమ్మాయిల వెంటపడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలకు దిశ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, పోకిరీలు.. దిశ పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. మరొకసారి అమ్మాయిల వెంటపడి, వేధింపులకు గురిచేయమని ఇద్దరు యువకులు పోలీసులకు లేఖ రాసి ఇచ్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరులో నర్సింగ్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు శనివారం కాలేజ్‌కు వెళ్తున్నారు. ఇద్దరు యువకులు అమ్మాయిలను అనుసరించి వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధిత యువతులు దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ టీమ్ విద్యార్థినుల ఉన్న లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న సురేష్, చంద్ర శేఖర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కమారు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేయమని యువకులు లిఖితపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. ఇక, దిశ యాప్‌ను కొన్ని రోజుల కిందటే డౌన్లోడ్ చేసుకున్నట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. దిశ SOSకు కాల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు చాలా బాగుందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
వామ్మో ఇదేం ఫైటింగ్.. రోడ్డుపై తన్నుకున్న కాలేజీ అమ్మాయిలు
ఇటీవలి కాలంలో కాలేజీ విద్యార్థులు నడిరోడ్లపై తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. చిన్న చిన్న కారణాలు, లవ్ వ్యవహారాల్లో స్టూడెంట్స్ దెబ్బలాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీంతో, నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. నాసిక్‌లో ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాసుల అనంతరం క్యాంటీన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో క్యాంటీన్లో కూర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో, అక్కడే వాదనకు దిగి వ్యవహారం తిట్లు, తన్నుకునే వరకు వెళ్లింది. ఇంతలో క్యాంటీన్ సిబ్బంది వారిని వారించి అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. नाशिकच्या महाविद्यालयात तरुणींमध्ये तुफान हाणामारी. एकमेकींच्या झिंज्या उपटल्या#Nashik #Girl #Fight #CollegeStudent pic.twitter.com/m6NGKPoDup — India Darpan Live (@IndiaDarpanLive) November 18, 2022 అనంతరం, బయటకు వచ్చిన నలుగురు అమ్మాయిలు మరోసారి వాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన విద్యార్థినిలు తాము రోడ్డుపై ఉన్నామనే విషయం మరిచిపోయి దారుణంగా బూతులు తిట్టుకున్నారు. జట్టు పట్టుకుని భౌతిక దాడులు చేసుకున్నారు. తిట్టుకుంటూ ఒకరినొకరు తన్నుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వారిని వారించినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దాడులు చేసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
సెక్స్ రాకెట్: వీడియోలు తీసి.. బ్లాక్మెయిల్ చేసి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం సెక్స్ రాకెట్ కుంభకోణం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12మంది బ్యూరోక్రాట్లు, 8మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వెల్లడించింది. వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రదారి అయిన శ్వేతా జైన్‌ను ప్రస్తుతం సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ హనీట్రాప్‌లోకి కాలేజీ విద్యార్థినులను ఎలా భాగం చేస్తున్నారు.. ఆనక వారితో చేయించే అకృత్యాలు, తద్వారా తాము పొందే లాభాల గురించి శ్వేతా జైన్ సిట్ ముందు వెల్లడించింది. ఆ వివరాలు.. శ్వేతా జైన్ భర్త స్వాప్నిల్ జైన్ ఓ ఎన్జీవోను ప్రారంభించాడు. ముందుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకుంటుంది. ఆ ఇళ్లలో ఉన్న చదువుకునే, యుక్త వయసు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తాను, చదువుకునేందుకు సాయం చేస్తామంటూ మాయమాటలు చెప్తుంది. ఆడంబర జీవితం, డబ్బు రుచి చూపి.. అందుకు ఆ కుటుంబం ఒప్పుకుంటే.. ఆ తర్వాత శ్వేతా జైన్ రంగంలోకి దిగుతుంది. నెమ్మదిగా సదరు యువతులకు ఆడంబరమైన జీవితాన్ని రుచి చూపిస్తుంది. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి.. తాను చెప్పినట్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపెడుతుంది. ఆ తర్వాత వారిని నెమ్మదిగా తన సెక్స్ రాకెట్ కోసం వాడుకుంటుంది. అలా కాలేజీకి వెళ్లే యువతులను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఎర వేస్తుంది. ఆ అధికారులు, నాయకుల కోరిక మేరకు సదరు యువతులను వారి వెంట టూర్లకు, ఫైవ్‌స్టార్ హోటళ్లకు పంపేది. అనంతరం వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియో తీసేది. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి సదరు అధికారులను, నాయకులను బ్లాక్మెయిల్ చేసి భారీ కాంట్రాక్టులు, ఎన్జీవోకు అధిక మొత్తంలో విరాళాల రూపంలో డబ్బు సంపాదించేది. ఒక్కసారి శ్వేతా జైన్ చేతిలో పడిన యువతులు ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం కష్టం. శ్వేత చేస్తున్న అక్రమాల గురించి పోలీసులకు గానీ, మీడియాకు గానీ చెప్పాలని చూస్తే.. వారి వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించేది. దాంతో యువతులు కూడా కామ్‌గా ఉండేవారు. ఇలా సాగుతున్న శ్వేతా జైన్ అక్రమాలకు ఓ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. తీగ లాగడంతో డొంక అంతా కదిలింది. గొప్ప కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. ఈ క్రమంలో మౌనిక అనే భాదితురాలు మాట్లాడుతూ.. ‘ఇంటర్ పూర్తయ్యాక నేను ఉన్నత విద్య అభ్యసించాలని ఆశించాను. కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఈ క్రమంలో శ్వేతా జైన్ భర్త నా తండ్రిని కలిసి.. తన ఎన్జీవో ద్వారా నేను చదువుకోడానికి సాయం చేస్తానని చెప్పాడు. మంచి పేరున్న కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. నన్ను భోపాల్ పంపిచాల్సిందిగా కోరాడు. మా నాన్న అంగీకరించడంతో నన్ను భోపాల్ తీసుకెళ్లారు. అక్కడ నన్ను ఓ పాష్ హోటల్లో ఉంచారు. తిరగడానికి బీఎండబ్ల్యూ కార్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి ప్లాన్‌ను నాకు వివరించారు. ఎంతో డబ్బు వస్తుందని.. ఫలితంగా నా కుటుంబ ఆర్థిక అవసరాలు అన్ని తీరతాయని నన్ను ప్రలోభాలకు గురి చేశారు. పైగా నన్ను మంచి కాలేజీలో చేర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శ్వేతా జైన్ నన్ను సెక్రటేరియట్ వద్దకు తీసుకెళ్లి పెద్ద పెద్ద అధికారులను నాకు పరిచయం చేసింది. వారి ద్వారా నాకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మించింది. అలా నన్ను దీనిలో ఇరికించింది’ అంటూ మౌనిక వాపోయింది. చదవండి: సెక్స్ రాకెట్; మాజీ సీఎం సహా ప్రముఖుల పేర్లు! రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరింపు... ‘ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 30న శ్వేతా, ఆమె సహాయకులు ఆర్తి దయాల్, రూప నన్ను ఓ పాష్ హోటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం వారు నన్ను ప్రభుత్వ ఇంజనీర్ హర్భజన్ సింగ్ దగ్గరకు పంపించారు. హోటల్ గదిలో మేం శృంగారంలో పాల్గొంటుండగా ఆర్తి దయాల్ వీడియో తీశాడు. తర్వాత దాన్ని హర్భజన్‌కు చూపించి తనకు రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా శ్వేత బ్లాక్మెయిల్ చేసింది. కానీ ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్తే.. వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని శ్వేత నన్ను బెదిరించింది. దాంతో నేను మౌనంగా ఉన్నాను. శ్వేత దగ్గర నాలాంటి కాలేజీ యువతులు ఓ రెండు డజన్ల మంది ఉండగా.. కాల్ గర్ల్స్ 40 మంది దాకా ఉంటార’ని మౌనిక సిట్ ముందు వెల్లడించింది. కాగా ఈ సెక్స్ రాకెట్లో మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్ రాకెట్ చాలా సంవత్సరాలుగా సాగుతోందని, బ్లాక్ మెయిల్‌కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
కాలేజీకి చీరలోనే రావాలి
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. కాలేజీలో చదివే అమ్మాయిలు జీన్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ లాంటి దుస్తులు ధరించి కాలేజీకి రావొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. సంప్రదాయ దుస్తులు సల్వార్-కమీజ్, చీరలో మాత్రమే కాలేజీకి హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్ అన్ని ప్రభుత్వ కాలేజీలకు లేఖలు పంపింది. కళాశాలల ప్రిన్సిపాల్స్.. బాలుర, బాలి కల దుస్తుల రంగు (డ్రెస్ కోడ్ కలర్)ను నిర్ణయించి ఈ నెల 12నాటికి తుది నివేదికను పంపాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నంత కాలం డ్రెస్ కోడ్ వర్తిస్తుంది. అయితే బోధనా సిబ్బందికి డ్రెస్ కోడ్‌పై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, టీచర్లు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తిరోగమ చర్య అని, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పి తమ హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ హిస్టరీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రపంచం ఒక అడుగు ముందుకు సాగితే, భారత్ రెండు అడుగులు వెనక్కి వేస్తోందంటూ అభిప్రాయపడ్డారు. కనోరియా కాలేజీకి చెందిన విద్యార్థిని అంజలీ మాట్లాడుతూ.. ‘మాకు ఇప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లి తర్వాత మేము జీన్స్, టీ షర్ట్స్ ధరించే చాన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మాకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చిన డ్రెస్ ధరించొద్దు అనడం విచారకరమని’ అన్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అబ్బాయిలను కుర్తా పైజామా వేసుకురావాలని ఎందుకు బలవంతం చేయడం లేదు? స్త్రీ, పురుషులు సమానం అనే ప్రభుత్వం స్త్రీలపై మాత్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ‘బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. వీరు డాక్లర్లు, ఇంజనీర్లను కోరుకోవడం లేదు. బాబాలను తయారు చేయాలని చూస్తోంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఆరోపించారు. కాగా డ్రెస్ కోడ్ అమలును ప్రభుత్వం సమర్థించుకుంది. క్యాంపస్‌లో క్రమశిక్షణ పెంపొందించడం కోసమే డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నామని పేర్కొంది. కళాశాల ప్రిన్సిపల్, నిర్వాహకులు కాలేజీ సంఘాలతో చర్చలు జరిపి, వారు ఏకాభిప్రాయానికి వచ్చాకే డ్రెస్ కోడ్ అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
కాలేజీ గాళ్స్ క్రేజీ డ్యాన్స్:కోట్ల వ్యూస్
-
కాలేజీ గాళ్స్ క్రేజీ డ్యాన్స్:కోట్ల వ్యూస్
భువనేశ్వర్: ఇంటర్నెట్ లో ఒడిశా అమ్మాయిలు చేసిన డాన్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రముఖనటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా ముకాబులా పాటతో మొదలైన ఈ కాలేజీ గర్స్ డాన్స్ ఫెరఫామెన్స్ వివిధ పాపులర్ బాలీవుడ్ పాటలకు వరకు సాగింది. ఒకరితో మొదలైనా.. చిరవకి సామూహికంగా స్టెప్పులేశారు. నెటిజన్ల క్రేజ్‌తో ఈ వీడియో యూ ట్యూబ్‌ను క్రాష్ చేస్తోంది. సుమారు నాలుగు నెలలక్రితం జనవరి 2, 2017న పోస్ట్ చేసిన ఈ వీడియోపై ఇప్పటికీ క్రేజ్ తగ్గ లేదు. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ దీనికే నిదర్శనం.. 12కోట్ల, 6లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది. మరి ఆ సందడి ఏంటో ఒకసారి మీరు కూడా తిలకించండి.. -
ఫిట్‌గా ఉంటేనే హిట్!
వెండితెరపై మెరుపు తీగల్లా కనిపించే కథానాయికల శరీరాకృతి అంటే కాలేజ్ గాళ్స్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. అలా ఉండాలంటే కడుపు మాడ్చుకోవాలేమో అనుకుంటుంటారు. ఈ విషయమై శ్రుతీహాసన్ కొన్ని చిట్కాలు చెప్పారు. తన ఫిట్నెస్ రహస్యాలు వివరించారు. ♦ డైట్ * ఒకప్పుడు నాకు ఏం తినాలో... ఏది తినకూడదో తెలిసేది కాదు. అందుకని ఏది పడితే అది తినేసేదాన్ని. ఉదయం అల్పాహారం తీసుకునేదాన్ని కాదు. అది ఎంత పెద్ద తప్పో ఆ తర్వాత తెలిసింది. కడుపు నిండా అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా చాలా హుషారుగా పని చేసుకోగలుగుతాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏమీ తినకుండా ఏకంగా లంచ్ లాగించేసే ఆరోగ్యం పాడవుతుంది. * బ్రేక్‌ఫాస్ట్‌కి ఫ్రూట్స్, ఎగ్స్, గుడ్డు, ఓట్స్ అప్పుడప్పుడు ఇడ్లీలు తీసుకుంటాను. * రోజు మొత్తంలో రెండు, మూడుసార్లయినాపండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగుతాను. * లంచ్, డిన్నర్‌కి ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్... రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఆహారం తీసుకుంటాను. ఆరోగ్యంగా ఉండటానికి ఈ రెండూ అవసరం. * నాకు నెయ్యి అంటే మహా ప్రీతి. సాంబార్ అంటే చాలా ఇష్టం. బంగాళ దుంపల వేపుడు, మసాలా కర్రీ ఇష్టం. ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. అయినప్పటికీ తింటాను. నచ్చినవన్నీ తినాలి. బాగా వర్కవుట్స్ చేయాలన్నది నా సిద్ధాంతం. ♦ వర్కవుట్స్ * మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఒంటి తీరుకు ఎలాంటి వ్యాయామాలు నప్పుతాయో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా వర్కవుట్స్ చేయాలి. * గంటలు గంటలు జిమ్‌లో స్పెండ్ చేయడం నాకిష్టం ఉండదు. కేవలం ట్రెడ్మిల్ చేయడం కోసమే జిమ్‌కి వెళతాను. ఎంత పరుగు తీస్తే ఎంత ఫిట్‌గా ఉంటామో తెలుసుకుని రన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ట్రెడ్మిల్ మీద రన్ చేయడం ఇష్టం. * కార్డియో ఎక్సర్సైజులు చేయడం చాలా మంచిది. ఇంట్లో చేసుకోదగ్గ కార్డియో ఎక్సర్సైజులు కూడా ఉంటాయి. * ఫిట్‌గా ఉండటానికి కారణంగా నిలిచేవాటిల్లో డ్యాన్స్ ఒకటి. ఏదో సరదా కోసం కాకుండా ఫిట్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ చేస్తే ఉపయోగం ఉంటుంది. వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి రోజూ మినిమమ్ 45 నిమిషాలు డ్యాన్స్ చేస్తాను. * వాకింగ్, స్విమ్మింగ్ వంటివి బెస్ట్. ఈత కొట్టడం వల్ల శరీరంలో అన్ని భాగాలూ కదులుతాయి కాబట్టి చాలా మంచిది. * ఓవరాల్‌గా నేను చెప్పేది ఒకటే. మనం లైఫ్‌లో హిట్ కావాలంటే ఫిట్‌గా ఉండాలి.