
ఇటీవలి కాలంలో కాలేజీ విద్యార్థులు నడిరోడ్లపై తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. చిన్న చిన్న కారణాలు, లవ్ వ్యవహారాల్లో స్టూడెంట్స్ దెబ్బలాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీంతో, నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. నాసిక్‌లో ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాసుల అనంతరం క్యాంటీన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో క్యాంటీన్‌లో కూర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో, అక్కడే వాదనకు దిగి వ్యవహారం తిట్లు, తన్నుకునే వరకు వెళ్లింది. ఇంతలో క్యాంటీన్ సిబ్బంది వారిని వారించి అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు.
नाशिकच्या महाविद्यालयात तरुणींमध्ये तुफान हाणामारी. एकमेकींच्या झिंज्या उपटल्या#Nashik #Girl #Fight #CollegeStudent pic.twitter.com/m6NGKPoDup
— India Darpan Live (@IndiaDarpanLive) November 18, 2022
అనంతరం, బయటకు వచ్చిన నలుగురు అమ్మాయిలు మరోసారి వాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన విద్యార్థినిలు తాము రోడ్డుపై ఉన్నామనే విషయం మరిచిపోయి దారుణంగా బూతులు తిట్టుకున్నారు. జట్టు పట్టుకుని భౌతిక దాడులు చేసుకున్నారు. తిట్టుకుంటూ ఒకరినొకరు తన్నుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వారిని వారించినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దాడులు చేసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.