ఫిట్‌గా ఉంటేనే హిట్! | Shruti Haasan Fitness secrets! | Sakshi
Sakshi News home page

ఫిట్‌గా ఉంటేనే హిట్!

Published Mon, Nov 2 2015 11:02 PM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

ఫిట్‌గా ఉంటేనే హిట్! - Sakshi

ఫిట్‌గా ఉంటేనే హిట్!

వెండితెరపై మెరుపు తీగల్లా కనిపించే కథానాయికల శరీరాకృతి
అంటే కాలేజ్ గాళ్స్‌కి చాలా క్రేజ్ ఉంటుంది.  
అలా ఉండాలంటే కడుపు మాడ్చుకోవాలేమో అనుకుంటుంటారు.
ఈ విషయమై శ్రుతీహాసన్ కొన్ని చిట్కాలు చెప్పారు.
తన ఫిట్‌నెస్ రహస్యాలు వివరించారు.

 
♦  డైట్
* ఒకప్పుడు నాకు ఏం తినాలో... ఏది తినకూడదో తెలిసేది కాదు. అందుకని ఏది పడితే అది తినేసేదాన్ని. ఉదయం అల్పాహారం తీసుకునేదాన్ని కాదు. అది ఎంత పెద్ద తప్పో ఆ తర్వాత తెలిసింది. కడుపు నిండా అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా చాలా హుషారుగా పని చేసుకోగలుగుతాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏమీ తినకుండా ఏకంగా లంచ్ లాగించేసే ఆరోగ్యం పాడవుతుంది.
* బ్రేక్‌ఫాస్ట్‌కి ఫ్రూట్స్, ఎగ్స్, గుడ్డు, ఓట్స్ అప్పుడప్పుడు ఇడ్లీలు తీసుకుంటాను.
* రోజు మొత్తంలో రెండు, మూడుసార్లయినాపండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగుతాను.
* లంచ్, డిన్నర్‌కి ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్... రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఆహారం తీసుకుంటాను. ఆరోగ్యంగా ఉండటానికి ఈ రెండూ అవసరం.
* నాకు నెయ్యి అంటే మహా ప్రీతి. సాంబార్ అంటే చాలా ఇష్టం. బంగాళ దుంపల వేపుడు, మసాలా కర్రీ ఇష్టం. ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. అయినప్పటికీ తింటాను. నచ్చినవన్నీ తినాలి. బాగా వర్కవుట్స్ చేయాలన్నది నా సిద్ధాంతం.
 
♦  వర్కవుట్స్
* మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఒంటి తీరుకు ఎలాంటి వ్యాయామాలు నప్పుతాయో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా వర్కవుట్స్ చేయాలి.
* గంటలు గంటలు జిమ్‌లో స్పెండ్ చేయడం నాకిష్టం ఉండదు. కేవలం ట్రెడ్‌మిల్ చేయడం కోసమే జిమ్‌కి వెళతాను. ఎంత పరుగు తీస్తే ఎంత ఫిట్‌గా ఉంటామో తెలుసుకుని రన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ట్రెడ్‌మిల్ మీద రన్ చేయడం ఇష్టం.
* కార్డియో ఎక్సర్‌సైజులు చేయడం చాలా మంచిది. ఇంట్లో చేసుకోదగ్గ కార్డియో ఎక్సర్‌సైజులు కూడా ఉంటాయి.
* ఫిట్‌గా ఉండటానికి కారణంగా నిలిచేవాటిల్లో డ్యాన్స్ ఒకటి. ఏదో సరదా కోసం కాకుండా ఫిట్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ చేస్తే ఉపయోగం ఉంటుంది. వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి రోజూ మినిమమ్ 45 నిమిషాలు డ్యాన్స్ చేస్తాను.
* వాకింగ్, స్విమ్మింగ్ వంటివి బెస్ట్. ఈత కొట్టడం వల్ల శరీరంలో అన్ని భాగాలూ కదులుతాయి కాబట్టి చాలా మంచిది.
* ఓవరాల్‌గా నేను చెప్పేది ఒకటే. మనం లైఫ్‌లో హిట్ కావాలంటే ఫిట్‌గా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement