రెడీ.. ఒన్..టూ..త్రీ..గో!
► రెండో రోజు కొనసాగిన కానిస్టేబుల్ ఫిట్‌నెస్ పరీక్షలు
►1000 మందికి గాను 818 మంది హాజరు
►నేడు హాజరుకానున్న 1,200 మంది
►425 మంది మహిళా అభ్యర్థులు.. 800 మంది పురుషులకు ఆదివారం
ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ల సెలక్షన్‌సలో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగారుు. మొదటి రోజు సాయంత్రం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోరుున సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని కేంద్ర సర్వర్‌లో లోపాన్ని సవరించటంతో తర్వాత ఇబ్బంది లేకుండా చేశారు. మొదటి రోజు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ పోలీస్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీస్ కానిస్టేబుళ్లు, జైలు వార్డెన్లకు ఎంపికకు సంబంధించి 1000 మంది హాజరుకావాల్సి ఉండగా 818 మంది హాజరయ్యారు. దేహదారుఢ్యపరీక్షలో భాగంగా ఎత్తు, ఛాతీ కొలతల్లో 136 మంది అనర్హత పొందారు.
మొత్తం 682 మంది తదుపరి పరీక్షలకు అర్హత పొందారు. వారిలో 1,600 మీటర్ల పరుగు పందెంలో 62 మంది అనర్హత పొందారు. మిగతా ఈవెంట్లు రాత్రి కూడా కొనసాగారుు. మూడో రోజు శనివారం 1,200 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. ఆదివారం పురుషులతో పాటు మహిళా అభ్యర్థుల ఎంపిక కూడా జరగనుంది. పురుష అభ్యర్థులు 800 మంది, మహిళా అభ్యర్థులు 425 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.