ఫిట్‌నెస్ అండ్ బాడీబిల్డింగ్.. | Fitness and bodybuilding .. | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్ అండ్ బాడీబిల్డింగ్..

Published Mon, Aug 15 2016 12:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

ఫిట్‌నెస్ అండ్ బాడీబిల్డింగ్.. - Sakshi

ఫిట్‌నెస్ అండ్ బాడీబిల్డింగ్..

appకహానీ...


ప్రస్తుతం ప్రముఖులు, సినీ తారలు నాజూకైన శరీరాకృతి కోసం పర్సనల్ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. దీని కోసం వారు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చిస్తారు. వీరిలా ఆ స్థాయిలో మనం పర్సనల్ ట్రైన ర్లను ఏర్పాటు చేసుకోలేం కదా..!! కాకపోతే మంచి శరీరాకృతిని పొందటానికి మనకూ కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ‘ఫిట్‌నెస్ అండ్ బాడీబిల్డింగ్’ అనే హెల్త్, ఫిట్‌నెస్ యాప్. దీన్ని మనం మన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్   నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 
ప్రత్యేకతలు...

యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
ప్రతి వర్క్‌ఔట్‌కు సంబంధించిన వీడియోను చూడొచ్చు. దాని ప్రకారం మనం వర్క్ ఔట్ చేయొచ్చు.
ఏ వర్క్‌ఔట్‌తో ఏ ఏ భాగాలు ప్రభావితం అవుతాయో వివరించారు.
ప్రతి ఎక్సర్‌సైజ్‌కు సంబంధించి బొమ్మలతో కూడిన వివరణలు ఇచ్చారు.
చేసిన వ్యాయామాలను సేవ్ చేసుకొని, వాటి వివరాలు చూసుకోవచ్చు.
బిల్ట్ ఇన్ టైమర్, క్యాలెండర్ ఫీచర్లు ఉన్నాయి.వర్క్‌ఔట్లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి మనకు నచ్చిన ఫొటోను పెట్టుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement