'దీపికా పదుకునే అంటే ఇష్టం' | 'I have always admired Salman Khan and wanted to be like him' | Sakshi
Sakshi News home page

'దీపికా పదుకునే అంటే ఇష్టం'

Published Mon, Jun 13 2016 9:43 AM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM

'దీపికా పదుకునే అంటే ఇష్టం' - Sakshi

'దీపికా పదుకునే అంటే ఇష్టం'

ముంబై: సల్మాన్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని ఫిట్నెస్ లెజెండ్, మాజీ మిస్టర్ ఇండియా ప్రతీక్ జైన్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి అతడిలా ఉండాలని తాపత్రయపడే వాడినని వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ ను ఆరాధిస్తూ పెరిగానని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ పై చిన్నతనం నుంచే మక్కువ పెంచుకున్నానని అన్నాడు. ఫీమేల్ సెలబ్రిటీల్లో దీపికా పదుకునే, మెగాన్ ఫ్యాక్స్ తనకు ఇష్టమని తెలిపాడు.

కఠినమైన డైట్ ఫాలో కావడం లేదని, సరైన తిండి మాత్రమే తింటానన్నాడు. మనం ఏం తింటున్నామనే దానిపైనే ఎక్కువగా దేహ దారుఢ్యం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇస్తానని, తన దేహమే దేవాలయమని పేర్కొన్నాడు. తన బాడీ షేప్ మారడానికి ఎన్నో ఏళ్లు, రోజులు, రాత్రులు కష్టపడ్డానని చెప్పాడు. రోజుకు ఒక గంట కేటాయిస్తే ఎవరైనా మంచి ఫిజిక్ సాధించగలరని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement