బెంగళూరు: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలతో ఇద్దరి ప్రాణాలను కాపాడారు వైద్యులు. ఒకరికి లివర్, మరొకరికి కిడ్నీ సకాలంలో అందించి వారికి పునర్జన్మనిచ్చారు. కర్ణాటక ఉడుపి జిల్లా మణిపాల్‌లో ఈ ఘటన జిరిగింది.
జిల్లాలోని ఉప్పండాకు చెందిన 44 ఏళ్ల శిల్పా మాధవ్ ఫిబ్రవరి 25న రోడ్డుప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వెద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె బతికే అవకాశాలు లేకపోవడంతో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు అనుమతి ఇచ్చారు.
అనంతరం కస్తుర్బా ఆస్పత్రి వైద్యులు శిల్పా మాధవ్ లివర్‌ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగికి అందించి అతని ప్రాణాలు కాపాడారు. అలాగే కిడ్నీని మంగళూరులోని ఆస్పత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీతో పాటు శిల్పా కళ్ల కార్నియాలు, చర్మాన్ని కసుర్బా ఆస్పత్రిలో భద్రపరిచారు వైద్యులు. వీటిని కూడా అవసరమైన వారికి అందిస్తామని చెప్పారు.
చదవండి: బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆట
Comments
Please login to add a commentAdd a comment