Wazir
-
700 ఖాతాల నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కారణాలతో 700 పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు క్రిప్టో ఎక్సే్చంజీ వజీర్ఎక్స్ వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం అకౌంట్లను యూజర్ల అభ్యర్ధనల మేరకు నిలిపివేసినట్లు వివరించింది. 3వ పారదర్శకత నివేదికను విడుదల చేసిన సందర్భంగా వజీర్ఎక్స్ ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం సమీక్షాకాలంలో దాదాపు 1 కోటి లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో ఈడీ, సీబీఐ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్‌బీఐ వంటి విదేశీ ఏజెన్సీల నుండి 828 అభ్యర్ధనలు వచ్చాయి. వీటిలో 764 దేశీ దర్యాప్తు సంస్థల నుంచి రాగా మిగతావి విదేశీ ఏజెన్సీల నుంచి వచ్చినట్లు వివరించింది. ఎక్కువగా అక్రమంగా నిధుల బదలాయింపులు, క్రిప్టో స్కాములు, చీటింగ్, ఫోర్జరీ లాంటి నేరాలపై ఫిర్యాదులు అందినట్లు వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, అలాగే మోసాలను నివారించేందుకు నియంత్రణ సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని వజీర్ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి తెలిపారు. -
అభిమానుల వల్లే మేం ఈ స్థానంలో ఉన్నాం!
న్యూఢిల్లీ: ప్రతి ఆదివారం ముంబైలోని ఆయన బంగ్లా ముందు వేలమంది అభిమానులు గుమిగూడుతారు. ట్విట్టర్లో ఒక భారతీయ నటుడిగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఆయన. ఆయన రాసే 'బ్లాగ్'ను క్రమంతప్పకుండా చదివే పాఠకులు ఉన్నారు. అయినా 73 ఏళ్ల ఆ బాలీవుడ్ లెజండ్ ఇప్పటికీ తన అభిమానుల పట్ల కృతజ్ఞాత భావంతోనే ఉన్నారు. అభిమానులు ఒక నటుడి కెరీర్లో కీలకమైన భాగమని, వారి వల్ల తాము ఈ స్థాయిలో ఉన్నామని వినమ్రంగా చెబుతారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. నాలుగు దశాబ్దాల తన సినిమా ప్రస్థానంలో అమితాబ్ బచ్చన్ ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. విమాన ప్రయాణంలో తనను చూసో, తనతో సెల్ఫీలు దిగో అభిమానులు ఎంతోగానో సంతోష పడుతుంటారని ఆయన చాలాసార్లు ట్విట్టర్లో పంచుకున్నారు. అయితే, భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న అమితాబ్ మాత్రం ఇందులో తన ప్రత్యేకతేమీ లేదంటున్నారు. ఒక నటుడిగా, సెలబ్రిటీగా సాధారణంగానే తనకు ప్రేక్షకాభిమానం లభిస్తుందని, అది నటుడి కెరీర్లో భాగమని తెలిపారు. 'సెలబ్రిటీగా ఉన్న ఎవరికైనా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. అభిమానులు నటుడి కెరీర్లో కీలకభాగం. వారి వల్ల మేం ఈ స్థాయికి ఎదిగాం. వారి పట్ల శ్రద్ధ చూపడం లేదా, వారి దృష్టిని తమ వైపు తిప్పుకోవడం సమర్థనీయమే' అని అమితాబ్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమితాబ్ నటించిన 'వజీర్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు 'టీఈ3ఎన్' సినిమాతో కూడా ఈ ఏడాది ఆయన ప్రేక్షకులను పలుకరించనున్నారు. -
'ప్రమోషన్స్ కోసం పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేను'
ముంబై: సినిమాల ప్రమోషన్స్ కోసం ఇప్పుడు నటీనటులు పడరానిపాట్లు పడటం చూస్తున్నదే. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్రదేశాల్లో సినీ బృందమంతా చేరి స్టెప్పులు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. కానీ అలాంటి ట్రెండ్ ను తాను అనుసరించబోనని చెప్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత విధూవినోద్ చోప్రా. సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దాయనతో పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేనని ఆయన స్పష్టం చేశారు. 'ఈ రోజుల్లో సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏ మాల్కో వెళ్లి డ్యాన్స్ చేయాలన్నది ట్రెండ్‌గా మారింది. లేకపోతే సినిమా విడుదలవుతున్న సంగతి ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. అయితే, మా సినిమా ప్రమోషన్ కోసం ఇలా అమితాబ్‌తో చేయించడం వికృతంగా ఉంటుంది. కేవలం ప్రమోషన్ కోసం నేను అమితాబ్‌తో పబ్లిగ్గా డ్యాన్స్ చేయించలేను' అని ఆయన తెలిపారు. అమితాబ్, ఫర్హాన్ అఖ్తర్ కలిసి నటిస్తున్న 'వజీర్' సినిమాను విధూ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నామని, ఈ సినిమాలోని 15 నిమిషాల నిడివి దృశ్యాలను విడుదలకు ముందే జర్నలిస్టులకు చూపించడం ద్వారా ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని ఆయన చెప్పారు. గతంలో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' వంటి ప్రముఖ సినిమాలను నిర్మించిన ఆయన 'వజీర్' చిత్రం కూడా ప్రేక్షకులకు చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
'యువ నటులను నేనెప్పుడూ బెదరగొట్టలేదు'
ముంబై: నాలుగు దశాబ్దాల తిరుగులేని సినీ కెరీర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్. అయినా తన సహ యువనటులను తానెప్పుడూ భయపెట్టలేదని ఆయన చెప్పారు. ' ఏ యువనటుడిని నేను బెదరగొట్టలేదు. నిజానికి వారే బాగా నటిస్తున్నారు. నేనే వారి ముందు తప్పులు చేస్తున్నారు. నిజానికిది చెడ్డ విషయం' అని అమితాబ్ సోమవారం ముంబైలో జరిగిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో పేర్కొన్నారు. 'పీకూ'లో తనతో కలిసి నటించిన దీపికా పదుకోణ్, 'బాజీరావు మస్తానీ'లో రణ్వీర్ సింగ్ నటనను అమితాబ్ ప్రశంసల్లో ముంచెత్తారు. 'వాళ్లు ఎంతోమంచి నటులు, ప్రతిభావంతులు. నిజానికి వారు తమ తొలి చిత్రాల్లోనే ఎంతోబాగా నటించారు. వాళ్లిద్దరిలో ఎవరు ఎంచుకుంటారంటే నేను చెప్పలేను. 'బాజీరావు మస్తానీ'లో దీపికా, రణ్వీర్ ఏ పొరపాటుకు తావివ్వకుండా గొప్పగా నటించారు' అని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా, అలియాభట్,కంగనా రనౌత్ వంటి తదితర నటులంతా ఎంతో అద్భుతంగా నటిస్తున్నారని కొనియాడారు. 73 ఏళ్ల అమితాబ్ బచ్చన్ 'టీఈ3ఎన్' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విద్యాబాలన్ తో కలిసి నటిస్తున్నారు. అలాగే ఫర్హాన్ అఖ్తర్ తో కలిసి 'వజీర్'లో కనిపించనున్నారు. -
నాకు గాడ్‌ఫాదర్ లేరు.. నేనో ఔట్‌సైడర్‌ని!
ముంబై: బాలీవుడ్లో తానో ఔట్సైడర్ననే భావన కలుగుతున్నదని 'వజీర్' హీరోయిన్ అదితిరావు హైదరి పేర్కొంది. ఇప్పటివరకు 'ఢిల్లీ 6', 'యే సాలి హై జిందగి', 'రాక్‌స్టార్' వంటి సినిమాల్లో నటించిన అతిది రావు తాను హిందీ చిత్రసీమలో చాలా విషయాల్లో ఇమడలేకపోతున్నానని తెలిపింది. 'కొన్ని విషయాల్లో నేను ఔట్సైడర్నేమోనన్న భావన కలుగుతోంది. ఉదాహరణకు సోషల్ మీడియాలో చాలామంది మద్దతు వ్యవస్థ ఉంది. కానీ నాకు లేదు. నేను ఏదైనా సోషల్ మీడియాలో పెడితే కొందరే మద్దతు తెలుపుతారు. అది సహజంగా వచ్చింది కాబట్టి నాకు ఆనందం కలిగిస్తుంది. కానీ చాలామందికి వాళ్ల స్నేహితులు, కజిన్స్, ఆంకుళ్లు, ఆంటీలు ఇలా అందరూ ముందుకొస్తుంటారు. అంతేకాకుండా వాళ్లు తమకు తెలిసినవాళ్లకు మెసేజ్‌లు పెట్టి మరీ కామెంట్లు, మద్దతు సంపాదించుకుంటారు. కానీ నేను అవన్ని పట్టించుకోను. ఇలాంటి విషయాలు గొప్పవేం కాకపోయిన ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇమేజ్ కోసం అలా చేయడం ముఖ్యమని చాలామంది భావిస్తున్నారు' అని అదితి వివరించింది. తనకు సినిమా పరిశ్రమలో మద్దతుగా గాడ్ఫాదర్లు ఎవరూ లేరని ఆమె పేర్కొంది. 'నాకు మద్దతుగా పెద్ద నిర్మాణ సంస్థగానీ, దర్శకుడుగానీ, హీరోగానీ లేరు. నేను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. బయటి ప్రపంచం నుంచి వచ్చిన నాకు చిత్రపరిశ్రమలో ఎవరూ తెలిసిన వారు లేరు. ఇతరుల కంటే నేను ముందు అని చెప్పుకోవాలని గానీ, ఇతరులకు వెన్నుపోటు పొడవాలనిగానీ నాకు ఎలాంటి ఆలోచన లేదు. ప్రతిరోజూ సంఘర్షణే నాకు. నా నచ్చిన సినిమాలు చేయడానికి ఈ రోజువరకు నేను పోరాడుతూనే ఉన్నాను' అని అదితి తెలిపింది. -
వోడ్కా తాగుతూ.. బిగ్ బీతో చెస్ ఆట!
వోడ్కా తాగుతూ.. చెస్ ఆడటం కొత్త పద్ధతి కదా! ఈ కొత్త చదరంగం ఆటను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి.. చెస్ ఆడుతూ మధ్యమధ్యలో వోడ్కా సిప్ చేయనున్నారు. అయితే ఇది నిజజీవితంలో కాదు. 'వజీర్' అనే సినిమా కోసం. త్వరలో రాబోతున్న ఈ చిత్రంలో ఈ చిత్రమైన చదరంగం ఆట ఉండనుంది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్ సీరియస్‌గా చెస్ ఆడుతూ.. ఎదుటివారి బంటును బలిగొన్న ప్రతిసారి వోడ్కాను గుటుక వేసే సీన్ ఈ సినిమాలో ఉండనుందట. ఈ విషయాన్ని 'వజీర్' చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. చెస్ ఆటను సరికొత్తరీతిలో ఆసక్తికరంగా ఈ సనివేశంలో చూపించనున్నాం. ఇందులో అమితాబ్-ఫర్హాన్ చెస్ ఆడుతూ కనిపిస్తారని 'వజీర్' ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధవారం విడుదలైన 'వజీర్' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ ప్రకారం ఫర్హాన్ భద్రతా దళాల్లో చేరి.. అమితాబ్ సాయంతో విలన్ నీల్ నితిన్ ముఖేష్‌ను ఎదుర్కోవడం ఈ సినిమా కథగా కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వజీర్' సినిమాలో జాన్ అబ్రహం, అదితిరావ్ హైదరి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫర్హాన్ ఏటీఎస్ అధికారిగా, అమితాబ్ వైకల్యమున్నా.. పదునైన మేధస్సు ఉన్న వ్యక్తిగా, అదితిరావు ఫర్హాన్ ప్రేమికురాలిగా కనిపించనున్నారు. -
కోలీవుడ్‌పై అతిథిరావ్ కన్ను
తమిళంలో పరిచయం అయిన తొలి రోజుల్లో అంతగా పట్టించుకోని హీరోయిన్లు ఆ తరువాత రీ ఎంట్రీ అయి ఓహో అని వెలగడం చాలామంది నటీమణుల విషయంలో జరిగింది. అలాంటి వారి లిస్టులో ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్లుగా ప్రకాశిస్తున్న అనుష్క, కాజల్ అగర్వాల్, సమంత లాంటి వారు ఉన్నారు. కాగా నటి అతిథిరావ్కు కోలీవుడ్‌లో మొదట్లో గుర్తింపు లేకపోయింది. 2007లో శృంగారం అనే చిత్రంలో దేవదాసిగా నటించారు. ఆ తరువాత ఆమె తమిళ సినిమాలలో కనిపించలేదు. అయితే బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏకంగా బిగ్‌బీ అమితాబ్‌తో వజీర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అక్కడ అతిథిరావ్కు గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ ఉంది. లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అవురదేవరాస్ తదితర హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇప్పుడు సడన్‌గా మళ్లీ కోలీవుడ్‌పై కన్ను పడింది. తమిళంలో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారట. ఇక్కడ అవకాశాల వేట కోసం ఒక మేనేజర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఆమె తమిళ చిత్రానికి సంబంధించిన వివరాలు వెలువడనుండనట్లు సమాచారం.