కోలీవుడ్‌పై అతిథిరావ్ కన్ను | Athithi rao eye on the Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌పై అతిథిరావ్ కన్ను

Published Thu, Sep 17 2015 4:26 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

కోలీవుడ్‌పై అతిథిరావ్ కన్ను - Sakshi

కోలీవుడ్‌పై అతిథిరావ్ కన్ను

తమిళంలో పరిచయం అయిన తొలి రోజుల్లో అంతగా పట్టించుకోని హీరోయిన్లు ఆ తరువాత రీ ఎంట్రీ అయి ఓహో అని వెలగడం చాలామంది నటీమణుల విషయంలో జరిగింది. అలాంటి వారి లిస్టులో ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్లుగా ప్రకాశిస్తున్న అనుష్క, కాజల్ అగర్వాల్, సమంత లాంటి వారు ఉన్నారు. కాగా నటి అతిథిరావ్‌కు కోలీవుడ్‌లో మొదట్లో గుర్తింపు లేకపోయింది. 2007లో శృంగారం అనే చిత్రంలో దేవదాసిగా నటించారు. ఆ తరువాత ఆమె తమిళ సినిమాలలో కనిపించలేదు.
 
 అయితే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏకంగా బిగ్‌బీ అమితాబ్‌తో వజీర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అక్కడ అతిథిరావ్‌కు గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ ఉంది. లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అవురదేవరాస్ తదితర హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇప్పుడు సడన్‌గా మళ్లీ కోలీవుడ్‌పై కన్ను పడింది. తమిళంలో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారట. ఇక్కడ అవకాశాల వేట కోసం ఒక మేనేజర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఆమె తమిళ చిత్రానికి సంబంధించిన వివరాలు వెలువడనుండనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement