స్టాక్ మార్కెట్లో కూడా ఆయన సూపర్ స్టారే
ముంబై: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, వాటి ద్వారా లాభాలు అంటే కత్తిమీద సామే. అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్టాక్ మార్కెట్లో స్థిరమైన పెట్టుబడుల ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించి మరోసాగి బిగ్ బిగా అవతరించారు. ఎంచుకున్న షేర్లలో పెట్టుబడులపై అయిదురెట్ల లాభాలను సాధించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా ఫినోటెక్స్ కెమికల్స్ షేర్ పెట్టుబడుల ద్వారా 5 రెట్ల లాభాలను గడించారు. న్యూల్యాండ్ ల్యాబ్స్ లో మూడు రెట్ల ఆదాయాన్ని సాధించారు.
మరోవైపు 2013 లో ఐపీవో లో పది రూపాయలకు సొంతం చేసుకున్న జస్ట్ డయల్ షేరును బిగ్ బీ ఇటీవల ఈ షేర్ ను రూ 1,150 స్థాయిలో అమ్మడం ద్వారా భారీ లాభాలను సాధించారు. న్యూ లాండ్స్, ఫినోటెక్స్ కెమికల్స్ 3 కోట్ల పెట్టుబడులకు గాను 14.49 కోట్టు, జస్ట్ డయల్ లో రూ.0.06 కోట్లకు గాను 7.22కోట్లను, ఉజాస్ ఎనర్జీ లో సుమారు నాలుగు కోట్ల పెట్టుబడులకు గాను ఎనిమిది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించారు. జస్ట్ డయల్ ప్రస్తుతం రూ.474.80 వద్ద ఉండగా, ఫినోటెక్స్ బీఎస్ సీలో 1.12 శాతం నష్టపోవడం గమనార్హం.
అయితే ప్రస్తుతం అమితాబ్ పోర్ట్ ఫోలియో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. స్టాంపీడ్ క్యాపిటల్ లో సుమారు 24.34 కోట్లు, ఫినోటెక్స్ కెమికల్1.75 కోట్ల మార్కెట్ల వాల్యూ వుండగా, బిర్లా పసిఫిక్ మెడ్ స్పాలో దాదాపు వంద కోట్ల నష్టం, నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ లో సుమారు నాలుగుకోట్ల నష్టంతోనూ ఉన్నాయి. కాగా న్యూల్యాండ్ ల్యాబ్స్ , ఫినోటెక్స్ కెమికల్, బిర్లా పసిఫిక్ మెడ్ స్పా తదితర కంపెనీల్లో గత కొన్నాళ్లుగా బిగ్ బి పెట్టుబడులు కొనసాగుతున్నాయి.