సెన్సేషనల్‌ మూవీ సీక్వెల్‌ వచ‍్చేస్తోంది | Mammootty Big B Movie Sequel First Look Out | Sakshi
Sakshi News home page

సెన్సేషనల్‌ మూవీ సీక్వెల్‌ వచ‍్చేస్తోంది

Published Fri, Nov 17 2017 5:44 PM | Last Updated on Fri, Nov 17 2017 5:44 PM

Mammootty Big B Movie Sequel First Look Out - Sakshi

సాక్షి, సినిమా : మళయాళ మెగాస్టార్‌ మమ్మూటీ నటించిన బిగ్‌ బీ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌. ఎందుకంటే సినిమాకు థియేటర్లో అంతంత మాత్రమే స్పందన లభించినప్పటికీ.. ఆ చిత్ర డీవీడీలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి కేరళలో ఓ రికార్డు క్రియేట్‌ చేసింది. ఎంతలా అంటే బెంగళూర్‌ డేస్‌, ప్రేమమ్‌ లాంటి యూత్‌ఫుల్‌ హిట్లు, బడాస్టార్ల సినిమాలు కూడా ఇప్పటిదాకా ఆ మార్క్‌ను అందుకోలేకపోయాయి. 

అలాంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ ప్రకటించేశారు. 2007లో విడుదలైన బిగ్‌ బీ చిత్రానికి దర్శకుడు అమల్‌ నీరద్‌ ఈ సీక్వెల్‌ బాధ్యతలను స్వీకరించాడు. కమింగ్‌ సూన్‌.. బ్లడీ సూన్‌ అంటూ ఓ సందేశంతో తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశాడు. హాలీవుడ్‌ చిత్రం ఫోర్‌ బ్రదర్స్‌గా వచ్చిన బిగ్‌ బీ చిత్రం మమ్ముకా(మమ్మూట్టీ  ముద్దుపేరు) కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ చిత్రంగా చెప్పుకుంటారు. అందులో హీరో పాత్ర పేరు బిలాల్‌. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌కు బిలాల్‌ టైటిల్‌నే ఫిక్స్‌ చేసేశారు. వచ్చే ఏడాది ద్వితియార్థంలో బిలాల్ విడుదల కానుంది. 

ఇదిలా ఉంటే మమ్మూట్టీ మరో చిత్రం స్ట్రీట్‌ లైట్స్‌ కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానుంది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నప్పటికీ... రజనీకాంత్‌ 2.ఓ చిత్రం వాయిదా పడటంతో రిబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ద్విభాషా‌(తమిళంలో కూడా) చిత్రంగా ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్‌ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన స్ట్రీట్‌ లైట్స్‌ లో మమ్మూటీ పోలీసాఫీసర్‌ రోల్‌ పోషించారు. సినిమాటోగ్రఫర్‌ శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌ ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మమ్మూట్టీ సొంత బ్యానర్‌ ప్లే హౌజ్ మోషన్‌ పిక్చర్స్‌ లో స్ట్రీట్‌ లైట్స్‌ తెరకెక్కుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement