బిలాల్‌ ఈజ్‌ బ్యాక్‌ | Mammootty is back as the iconic Bilal | Sakshi
Sakshi News home page

బిలాల్‌ ఈజ్‌ బ్యాక్‌

Published Mon, Nov 20 2017 12:32 AM | Last Updated on Mon, Nov 20 2017 12:32 AM

Mammootty is back as the iconic Bilal - Sakshi

బిలాల్‌ జాన్‌ కృషింగల్‌ పెద్ద గ్యాంగ్‌స్టర్‌. నలుగురి అన్నదమ్ముల్లో పెద్దవాడు. అందరూ అతన్ని బిగ్‌ బి అని పిలుస్తారు. ఈ బిగ్‌ బి మదర్‌ని ఎవరో మర్డర్‌ చేస్తారు. హంతకులను కనిపెట్టి, వారిని అంతం చేస్తారు బిగ్‌ బి అండ్‌ బ్రదర్స్‌. ఇది ఆల్మోస్ట్‌ పది సంవత్సరాల క్రితం అమల్‌ నీరద్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘బిగ్‌ బి’ సినిమా కథ. ఈ సినిమాలో బిలాల్‌ క్యారెక్టర్‌ని మమ్ముట్టి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందిస్తున్నారు నీరద్‌. ‘బిలాల్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

‘హీ ఈజ్‌ కమింగ్‌ బ్యాక్‌’ అంటూ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమా పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంటే.. బిలాల్‌ ఈజ్‌ బ్యాక్‌ అన్నమాట. ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న ఫొటో అదే. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేసి సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా కెమెరామెన్‌ శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌ దర్శకుడిగా మారి ‘స్ట్రీట్‌లైట్స్‌’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంతేకాదు...  ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నారని మాలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement