
మోహన్‌లాల్(Mohanlal), మమ్ముట్టి(Mammootty) హీరోలుగా మలయాళంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్ నయనతార(Nayanthara) నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో జరుగు తోంది.
ఈ మూవీ షూటింగ్‌లో నయనతార జాయిన్ అయ్యారని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఢిల్లీలో జరుగనుందని, ఈ షెడ్యూల్‌తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు గతంలో ‘తస్కరవీరన్ (2005), రప్పకల్ (2005), భాస్కర్ ది రాస్కెల్ (2015), పుతియ నియమం (2016)’ వంటి చిత్రాల్లో మమ్ముట్టి–నయనతార స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment