Bilal
-
వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’
సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్‌తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్ గోరెజెన్. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్ వాయించే బిలాల్‌కు ఈ క్రేజ్ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే. టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్ పొల్క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) పిల్లి తెచ్చిన లక్ లెవాన్ పొల్క్కా ఒక ఫిన్లాండ్ పాపులర్ సాంగ్. ఆ సాంగ్‌ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్ వాయించాడు బిలాల్. అయితే ఆ వీడియోకు జపాన్ వైబింగ్ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్‌కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్ ఎన్నో ఫేమస్ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్క్ తున్క్ తున్’ ఆల్బమ్స్, లేటెస్ట్గా త్రీ ఇడియెట్స్లో ‘ఆల్ ఈజ్ వెల్’తో ఇండియన్స్‌ను బిలాల్ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్‌ను సైతం తన స్టయిల్లో కంపోజ్ చేశాడతను. ఇక పాపులర్ పాప్ సాంగ్స్‌తో పాటు టీవీ సిరీస్‌ల థీమ్ సాంగ్‌లను నోటితో హమ్మింగ్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తాడు బిలాల్. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) దేవుడంటే కోపం లేదు బిలాల్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్‌ను అడిగాడు. దానికి బిలాల్ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని చప్పట్లతో బిలాల్ పట్ల గౌరవం ప్రదర్శించారు. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) -
బిలాల్ ఈజ్ బ్యాక్
బిలాల్ జాన్ కృషింగల్ పెద్ద గ్యాంగ్‌స్టర్. నలుగురి అన్నదమ్ముల్లో పెద్దవాడు. అందరూ అతన్ని బిగ్ బి అని పిలుస్తారు. ఈ బిగ్ బి మదర్ని ఎవరో మర్డర్ చేస్తారు. హంతకులను కనిపెట్టి, వారిని అంతం చేస్తారు బిగ్ బి అండ్ బ్రదర్స్. ఇది ఆల్మోస్ట్ పది సంవత్సరాల క్రితం అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘బిగ్ బి’ సినిమా కథ. ఈ సినిమాలో బిలాల్ క్యారెక్టర్ని మమ్ముట్టి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు నీరద్. ‘బిలాల్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘హీ ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే.. బిలాల్ ఈజ్ బ్యాక్ అన్నమాట. ఇన్సెట్లో మీరు చూస్తున్న ఫొటో అదే. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా కెమెరామెన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ దర్శకుడిగా మారి ‘స్ట్రీట్‌లైట్స్’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంతేకాదు... ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్ టాక్. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి
అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూమకుంట వద్ద బుధవారం మధ్యాహ్నం కారు ఢీకొని ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తూమకుంట పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు ముఖేశ్, బిలాల్ బైక్‌పై వెళుతూ డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయారు. అదే సమయంలో వచ్చిన కారు వారిని ఢీకొనగా ఇద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెందారు. హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న యాక్టివా: విద్యార్థి మృతి
గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీప్కాన్ వంతెన సమీపంలో వేగంగా వెళ్తున్న యాక్టివా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన యాక్టివా నడుపుతున్న బిలాల్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
బీజేపీలో లుకలుకలు
బొబ్బిలి : నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలయ్యూయి. కేంద్రంలో ఒంటిచేత్తో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయూల్సిన నాయకులు అంతర్గత విభేదాలతో రోడెక్కుతున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు పార్టీలోని ఒక వర్గానికి నచ్చకపోవడంతో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ఆ పార్టీ జిల్లా నాయకులకు తెలిసినా.. సరిదిద్దడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.బొబ్బిలిలో బీజేపీని పూర్వం నుం చి నడిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయి తే ఇటీవల పట్టణానికి చెందిన కొంతమంది ఇతర పార్టీ ల నాయకులు బీజేపీలో చేరడంతో వారికే ప్రాధాన్యమివ్వడంతో విభేదాలు పొడచూపాయి. ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ పెద్దింటి జగన్మోహన్రావు ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. విశాఖ ఎంపీ హరిబాబుతో సాన్నిహిత్యం ఉండడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికే పూర్వం నుంచి ఉన్నవారంతా పెద్దిం టి నాయకత్వంలో ముందుకు వచ్చి పని చేయడం మొ దలు పెట్టారు. అయితే బీజేపీలో బొబ్బిలి మున్సిపాలి టీకి కౌన్సిలరుగా పోటీ చేసిన మువ్వల శ్రీనివాసరావు మరో వర్గంతో కార్యక్రమాలు చేయడంతో విభేదాలు రాజుకున్నాయి. ఇటీవల పెద్దింటి పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, రైల్వే, పోస్టల్ శాఖల సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అధినాయకత్వం, మంత్రులకు దృష్టికి తీసుకువెళ్తున్నారు.ఇవి నచ్చని ము వ్వల ఇటీవల ఆయనతో బాహాటంగానే వాదనకు దిగా రు. దీంతో వీరి మధ్య విభేదాలు మరింత రాజుకున్నా రుు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నాయకులు టీడీపీకి సహకరించింది అంతంత మాత్రమే. పె ద్దింటి విశాఖ ఎంపీకి మద్దతుగా ప్రచారం చేస్తే, ము వ్వల బృందం నెల్లిమర్ల వెళ్లి అక్కడ నాయకుల తరఫున ప్రచారం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు అంతగా ప్రాధాన్యమివ్వలేదని, పట్టించుకోలేదని, జెండాలు ఇచ్చినా.. ఎక్కడ కట్టడం లేదంటూ వారిలో వారే కుమ్మలాటలాడుకున్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే ఆది వారం పట్టణంలోని వెలమవారి వీధిలో మువ్వల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పెద్దింటితో పాటు ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు డాక్టరు రెడ్డి సత్యారావుతో పాటు నాయకులు ఎవరూ హాజరుకాలేదు. సీమాంధ్ర కమిటీ అధ్యక్షుడు పాకల పాటి సన్యాసిరాజుతో పాటు జిల్లా నాయకత్వం ఇక్కడకు వచ్చిన అనుకున్నంత స్థాయిలో ప్రారంభోత్సవ వేడుక జరగకపోవడంతో జిల్లా నాయ కత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతంత మాత్రంగా ఉన్న పార్టీలోనే ఒకరిని ఒకరు కలుపుకొని వెళ్లలేని పరిస్థితి ఉంటే మరి రాబోయే కాలంలో పార్టీ పరిస్థితి ఏమిటన్న పరిస్థితి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా నాయకులు స్పందించి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు. -
పోలీస్ కస్టడీకి ఫకృద్దీన్, బిలాల్
సేలం, న్యూస్‌లైన్: బీజేపీ నేత, ఆడిటర్ రమేష్ హత్యకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పోలీస్ ఫకృద్దీన్, బిబాల్ మాలిక్‌లను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి విజయలక్ష్మి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. వేలూరు జైలులో ఉన్న తీవ్రవాదులు ఫకృద్దీన్, బిలాల్ మాలిక్‌లను పోలీ సులు ఆడిటర్ రమేష్ హత్య కేసులో బుధవారం అరెస్టు చేశారు. వారిని గురువారం సేలం జ్యుడీషియల్ మేజి స్ట్రేట్ నంబర్ 4 కోర్టులో హాజరు పరి చారు. ఈ కేసుపై న్యాయమూర్తి విజయలక్ష్మి విచారణ జరిపారు. ఫకృద్దీన్, బిబాల్‌లను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారిని సే లం సూరమంగళంలో ఉన్న మహిళా పో లీసు స్టేషన్లో ఉంచి విచారణ చేయాలని, మూడు రోజులకు ఒక వారి న్యాయవాది పుగళేంది, జాహీర్ అహ్మద్‌లను అర గంట కలుసుకోవచ్చునని తెలిపారు. అనంతరం వారిద్దరినీ పోలీ సులు బయటకు తీసుకు వస్తుండగా సేలంలోని పత్రికలు, టీవీ చానళ్ల విలేకర్లు, ఫొటో గ్రాఫర్లు ఫకృద్దీన్, బిబాల్‌లను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిం చారు. విలేకర్లను,ఫొటో గ్రాఫర్లను పో లీసులు తోసేశారు. దీంతో కెప్టన్ టీవీ రిపోర్టన్ నారాయణన్, దినమలర్ వెబ్ టీవీ రిపోర్టర్ జ్యోతి కింద పడి గాయపడ్డారు. దీంతో విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ముందుఉన్న ఏర్కాడు మెయిన్ రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న సేలం సిటీ డెప్యూటీ కమిషనర్ ఏజీ బాబు ఏర్కాడు సెంటర్‌కు చేరుకుని విలేకర్లతో చర్చలు జరిపారు. అనంతరం విలేకర్లు అక్కడ నుంచి న్యా యమూర్తి మోహన్‌దాస్‌ను కలుసుకుని పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
‘తీవ్ర’ తనిఖీలు
= పుత్తూరు ఘటనతో అప్రమత్తమైన పోలీసులు = జిల్లా అంతటా విస్తృత తనిఖీలు = కొత్త వారు వస్తేసమాచారమివ్వాలని విజ్ఞప్తి = ఆందోళనలో ప్రజలు సాక్షి, తిరుపతి/పుత్తూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వారం కిందట తీవ్రవాదులు ప ట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వారం కిందట పుత్తూరు పట్టణంలోని గేట్పుత్తూరులో అల్ ఉమా తీవ్రవాదులు బిలాల్, ఇ స్మాయిల్ పట్టుబడిన సంగతి తెలిసిందే. వీరు ఆరు నెలలుగా పుత్తూరులో ఉంటూ తమ కార్యకలాపాలు సాగించారు. ఇంకో విశేషం ఏం టంటే బిలాల్ భార్యాబిడ్డలతో పాటు ఇక్కడ ఉండగా, వీరిని ఇక్కడికి తీసుకొచ్చిన ఫక్రుద్దీన్ ఏడాదిన్నర పాటు పుత్తూరులోనే ఉన్నాడు. వీరంతా పోలీసులకు పట్టుబడడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టుబడిన తీవ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారం భించారు. రెండు రోజుల క్రితం పుంగనూరులోని నక్కబండ ప్రాంతాన్ని తనిఖీ చేసిన వి షయం విదితమే. అక్కడ ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఇద్దరిని అ రెస్టు చేసినట్లు తెలుస్తోంది. చింతపండు మాటున మారణాయుధాలు తీవ్రవాది ఇస్మాయిల్ చింతపండు వ్యాపారం చేస్తూ, అందులో మారణాయుధాలను రవాణా చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి ఆ యుధాలను, పేలుడు పదార్థాలను తీసుకొచ్చి వాటిని చింతపండు బాక్సుల్లో పెట్టి చెన్నైకు రవాణా చేసినట్లు ఇస్మాయిల్ వెల్లడించాడని స మాచారం. ఈ చింతపండును జిల్లాలోని కు ప్పం, మదనపల్లె, పలమనేరు, పీలేరు, పుంగనూరు నుంచి సేకరించామని, దీనికిగాను తమకు ఏజెంట్లు ఉన్నారని ఇస్మాయిల్ విచారణలో తెలి పినట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతాల్లో సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. సరిహద్దులో ఉండడంతోనే పుత్తూరులో.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఉండడంతోనే పుత్తూరును తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతానికి అల్ఉమా తీవ్రవాదులకు తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పథకం ప్రకారం తమ టార్గెట్‌లో ఉన్న పలువురు బీజేపీ అగ్రనేతలను మట్టుబెట్టడం, హిందూ దేవాలయాలు, తిరుమల వంటి చోట్ల విధ్వం సం సృష్టించడానికి పుత్తూరును స్థావరం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్టు సమాచారం. దీం తో అప్రమత్తమైన పోలీసులు జిల్లాలో అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆందోళనలో ప్రజలు దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తీవ్రవాదులు తమ టార్గెట్‌గా చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి తోడు ఆరు నెలలుగా ఇద్దరు తీవ్రవాదులు పుత్తూరులో అద్దె ఇంటిలో ఉండడం జిల్లా వాసులను మరింత కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పుంగనూరులో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్ట డం వీరి ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రస్తుతం ఏ కొత్త ముఖం కనిపించినా జిల్లావాసులు అనుమానించే పరిస్థితి నెలకొంది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పక్కాగా సమాచారం లేదు జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప క్కాగా సమాచారం లేదు. అయి నా నిర్లక్ష్యం చేయడం లేదు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొత్తవారు వస్తే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరుతున్నాం. లాడ్జీలలో గదులిస్తే పక్కాగా సమాచారం తీసుకోవాలని ఆదేశించాం. పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాం. -కాంతిరాణాటాటా, ఎస్పీ మా జాగ్రత్తలో మేమున్నాం తిరుమల, తిరుపతికి ప్రమాదముందని ప్రత్యేకంగా సమాచా రం లేదు. తిరుపతికి రోజూ 50 వేలమంది కి పైగా భక్తులు వ స్తుంటారు. మా జాగ్రత్తలో మేమున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం. -రాజశేఖర్ బాబు, ఎస్పీ, తిరుపతి అర్బన్