బీజేపీలో లుకలుకలు
బొబ్బిలి : నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలయ్యూయి. కేంద్రంలో ఒంటిచేత్తో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయూల్సిన నాయకులు అంతర్గత విభేదాలతో రోడెక్కుతున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు పార్టీలోని ఒక వర్గానికి నచ్చకపోవడంతో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ఆ పార్టీ జిల్లా నాయకులకు తెలిసినా.. సరిదిద్దడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.బొబ్బిలిలో బీజేపీని పూర్వం నుం చి నడిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయి తే ఇటీవల పట్టణానికి చెందిన కొంతమంది ఇతర పార్టీ ల నాయకులు బీజేపీలో చేరడంతో వారికే ప్రాధాన్యమివ్వడంతో విభేదాలు పొడచూపాయి. ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ పెద్దింటి జగన్‌మోహన్‌రావు ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.
విశాఖ ఎంపీ హరిబాబుతో సాన్నిహిత్యం ఉండడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికే పూర్వం నుంచి ఉన్నవారంతా పెద్దిం టి నాయకత్వంలో ముందుకు వచ్చి పని చేయడం మొ దలు పెట్టారు. అయితే బీజేపీలో బొబ్బిలి మున్సిపాలి టీకి కౌన్సిలరుగా పోటీ చేసిన మువ్వల శ్రీనివాసరావు మరో వర్గంతో కార్యక్రమాలు చేయడంతో విభేదాలు రాజుకున్నాయి. ఇటీవల పెద్దింటి పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, రైల్వే, పోస్టల్ శాఖల సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అధినాయకత్వం, మంత్రులకు దృష్టికి తీసుకువెళ్తున్నారు.ఇవి నచ్చని ము వ్వల ఇటీవల ఆయనతో బాహాటంగానే వాదనకు దిగా రు. దీంతో వీరి మధ్య విభేదాలు మరింత రాజుకున్నా రుు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నాయకులు టీడీపీకి సహకరించింది అంతంత మాత్రమే.
పె ద్దింటి విశాఖ ఎంపీకి మద్దతుగా ప్రచారం చేస్తే, ము వ్వల బృందం నెల్లిమర్ల వెళ్లి అక్కడ నాయకుల తరఫున ప్రచారం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు అంతగా ప్రాధాన్యమివ్వలేదని, పట్టించుకోలేదని, జెండాలు ఇచ్చినా.. ఎక్కడ కట్టడం లేదంటూ వారిలో వారే కుమ్మలాటలాడుకున్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే ఆది వారం పట్టణంలోని వెలమవారి వీధిలో మువ్వల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పెద్దింటితో పాటు ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు డాక్టరు రెడ్డి సత్యారావుతో పాటు నాయకులు ఎవరూ హాజరుకాలేదు.
సీమాంధ్ర కమిటీ అధ్యక్షుడు పాకల పాటి సన్యాసిరాజుతో పాటు జిల్లా నాయకత్వం ఇక్కడకు వచ్చిన అనుకున్నంత స్థాయిలో ప్రారంభోత్సవ వేడుక జరగకపోవడంతో జిల్లా నాయ కత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతంత మాత్రంగా ఉన్న పార్టీలోనే ఒకరిని ఒకరు కలుపుకొని వెళ్లలేని పరిస్థితి ఉంటే మరి రాబోయే కాలంలో పార్టీ పరిస్థితి ఏమిటన్న పరిస్థితి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా నాయకులు స్పందించి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు.