Kambampati Hari babu
-
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జెడ్ఎన్పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్ఎన్పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది. #WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf — ANI (@ANI) December 8, 2023 నవంబర్ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. -
బాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ ఇప్పుడు ఆ కాంగ్రెస్‌తో జత కట్టేందుకు తహతహలాడుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ టీడీపీని కాంగ్రెస్ వైపు దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న ఆరాటాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని హరిబాబు చెప్పారు. బాబు తీరుతో పైనున్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. కర్ణాటకలో జరిగిన కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో బాబు అసలు స్వరూపం బయట పడిందని తెలిపారు. 1996 నాటి రాజకీయ పరిస్థితులు పునరావృత మవుతు న్నాయని, ఆనాడు కాంగ్రెస్‌తో జతకట్టి యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతు పలికిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపో లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చాం.. విభజన హామీల్లో 85 శాతం అమలు చేశామని హరిబాబు చెప్పారు. రైల్వే జోన్‌తోపాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గిరాజు పోర్టు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గిరిజన విశ్వవిద్యాలయం మాత్రమే మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్యాకేజీని ఆహ్వానించిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. పోటులో తవ్వకాలు, జెనీవాలో వేలం వేయడం వంటి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందేనన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో నియమించిన ధార్మిక మండలి పదేళ్లు పనిచేసిందని.. చంద్రబాబు హయాంలో ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. -
ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ
విశాఖపట్నం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఖండించారు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేదిలా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, శాంతి భద్రతలు కాపాడాల్సినది టీడీపీయేనని, అలాంటి పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం బాగోలేదని వ్యాఖ్యానించారు. ఈ విధమైన అరాచకానికి పాల్పడడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దానికి దర్పణం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కంభంపాటి డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్ నినాదాలు చేస్తూ..అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేసిన సంగతి తెల్సిందే. -
హరిబాబు రాజీనామా..చేశారా.. చేయించారా?
జాతీయ పార్టీకి మూడేళ్లకుపైగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు.. ఒక దశలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన్ను ఊరించింది.. టీడీపీ, బీజేపీ పొత్తు పెటాకులైన తర్వాత సీను మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని టీడీపీ సర్కారుపై అస్త్రశస్త్రాలు సంధించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కేంద్రంపై టీడీపీ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పలు వేదికలపై తిప్పికొట్టడానికి ప్రయత్నించిన ఎంపీ హరిబాబు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతో ప్రత్యేక బుక్లెట్ కూడా ఆవిష్కరించారు. అంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చర్చోపచర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలోని టీడీపీ సర్కారు పట్ల ఆయన మెతక వైఖరితో ఉన్నారని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. అందుకనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. ఈ క్రమంలో హరిబాబు విమర్శలకు వగచి తనంత తానుగా రాజీనామా చేశారా?.. అధిష్టానం చేయించిందా?? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. హరిబాబు రాజీనామా స్వచ్ఛందంగానే చేశారా? లేక చేయమని ఒత్తిడి చేశారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మిత్రపక్షంతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారని ఓ వాదన విన్పిస్తుండగా, తనపై పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి రాజీనామా చేసి ఉంటారని మరో వాదన బలంగా విన్పిస్తోంది.ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్‌కు బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి ఉండేవారు. రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోయిన తర్వాత 13 జిల్లాలకు పార్టీ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడైన కంభంపాటి హరిబాబుకు అప్పగించారు. 2014 జనవరిలో బా«ధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో సైతం ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై హరిబాబును మార్చాల్సిందేనంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు పార్టీ అధిష్టానంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పేరు ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి హరిబాబుకు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో రాజధాని నుంచి వచ్చిన పిలుపుతో హరిబాబు ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. కాగా తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీ మంత్రులు కూడా రాజీనామాలు చేయడంతో కేంద్ర కేబినెట్లో ఏపీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. సొంత పార్టీలోనే విమర్శల సెగ ఆది నుంచి సౌమ్యునిగా ముద్ర పడిన హరిబాబు ఏనాడు విపక్షాలపై కూడా ఘాటైన విమర్శలు చేసిన పాపాన పోలేదు. నాలుగేళ్ల కాపురం తెగతెంపులు చేసుకోవడంతో టీడీపీపైన, ఆ పార్టీ పెద్దలపై సొంత పార్టీ నేతలు ఓ వైపు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే హరిబాబు మాత్రం కొద్దికాలం మౌనముద్ర వహించారు. దీంతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తన సహజశైలికి భిన్నంగా ఇప్పుడిప్పుడే టీడీపీ పెద్దలపై విమర్శలు చేయడం మొదలు పెట్టినప్పటికీ హరిబాబుపై పార్టీలో విమర్శలు మాత్రం తగ్గలేదు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తక్షణమే అధ్యక్ష మార్పు చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదన ఆయన వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎంపీ హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. ఆ లేఖను గుట్టుచప్పుడు కాకుండా పార్టీ అధినేత అమిత్‌షాకు పంపడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజీనామా చేస్తే తాను ఫలానా కారణంగా రాజీనామా చేస్తున్నానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత ఎవరైనా సమర్పిస్తారు. కానీ హరిబాబు సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అ«ధ్యక్షునికి పంపగా.. ఆ విషయాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం పార్టీని కుదుపేస్తోంది. ఆ తర్వాత తన రాజీనామా విషయాన్ని హరిబాబు ధ్రువీకరించారు. కొలిక్కి రాకుండానే.. సాధారణంగా కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఖరారైన తర్వాత పాత అధ్యక్షునితో రాజీనామా చేయిస్తారు. పాత అధ్యక్షుడి నుంచి కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ జరుగుతోంది. కానీ ఇక్కడ కొత్త అధ్యక్షుడెవరనేది కొలిక్కి రాకుండా హరిబాబు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ పెద్దలు చేస్తున్న విమర్శలను హరిబాబు సమర్ధ వంతంగా తిప్పికొట్టలేక పోతున్నారని తక్షణమే ఆయన్ని తప్పించాలంటూ పార్టీ అధినాయకత్వంపై ఆయన వ్యతిరేక వర్గీయులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెంది తనంతట తానుగా రాజీనామా చేసి ఉంటారని పార్టీలో ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షత పదవి మార్పు అనివార్యంగా మారిన నేపథ్యంలో అధిష్టానమే గౌరప్రదంగా తప్పుకోమని సూచించి ఉండవచ్చునని ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. రాజకీయ కోణం లేదన్న విష్ణుకుమార్‌రాజు ఆది నుంచి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు ఈ వ్యవహారంపై ఆచీతూచి స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయకోణం ఏమీ లేదంటూ ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ కోణం లేనప్పుడు ఎందుకు రహస్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టిపారేశారు. కొత్త అధ్యక్షుడు కావాలంటే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాలి కదా? అని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర వ్యాఖ్యానించారు. హరిబాబుకు కచ్చితంగా కేబినెట్లో స్థానం లభిస్తుందన్న విశ్వాసం తమకుందని ఈ ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రేసులో ఉన్న సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, పురందేశ్వరిలతో పాటు తాజాగా విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
బాబూ.. నీ పరపతేమిటో తేలిపోయింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. టీడీపీ పరపతి పూర్తిగా క్షీణించినట్లు తన ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబే బహిర్గతం చేసుకున్నారని వ్యాఖ్యానించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మంగళవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా వైఎస్సార్సీపీకి, బీజేపీకీ ఎలాంటి సంబంధమూ లేదని కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు బీజేపీ దగ్గరవుతోంది కాబట్టి తాము ఎన్డీఏ నుంచి విడిపోయామని టీడీపీ పేర్కొనటం అసంబద్ధమైన ఆరోపణ అన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ, వైఎస్సార్సీపీ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ఆడిన రాజకీయ క్రీడలో, రాజకీయ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ విడిపోవాలని పెట్టుకున్న లక్ష్య సాధనలో వైఎస్సార్ సీపీ విజయం సాధించిందన్నారు. వైఎస్సార్ సీపీని టీడీపీ అనుసరించింది.. టీడీపీకి ఎజెండాను నిర్దేశించింది వైఎస్సార్సీపీనే అని కంభంపాటి పేర్కొన్నారు. ‘మీ (టీడీపీ) మంత్రులు కేంద్రం నుంచి వైదొలగాలన్న డిమాండ్‌కు అనుగుణంగా మీరు రాజీనామా చేశారు. మంత్రులు రాజీనామా చేయడమే కాదు ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. మీరు బయటకు వచ్చారు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం మీరు పెడతారా లేదా అని వైఎస్సార్సీపీ టీడీపీ మెడపై కత్తిపెట్టింది. టీడీపీ.. వైఎస్సార్సీపీని అనుసరించింది. వైఎస్సార్సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది. అంతేకానీ బీజేపీ.. వైఎస్సార్సీపీకి దగ్గరవ్వలేదు’ అని కంభంపాటి చెప్పారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నది ప్రత్యేక హోదా కోసం కాదని కంభంపాటి చెప్పారు. బీజేపీ వైఎస్సార్సీపీకి దగ్గరవుతోందన్న ఒక భ్రమతో తెగదెంపులు చేసుకున్న విషయం ఈరోజు స్పష్టం అవుతోందని తెలిపారు. ప్రతిపక్షాల భయానికి లోనై రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను కాలదన్న వద్దని సూచించారు. ఆ ఆరోపణలు అసంబద్ధం ప్రధాని కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఎంపీ వాడుకుంటున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణ అసంబద్ధమైనదని కంభంపాటి తెలిపారు. ప్రధాని తన కార్యాలయాన్ని వేరొకరు వాడుకునేందుకు ఇస్తారని భావిస్తే అంతకంటే అమాయకులు ఎవరూ ఉండరని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ రాష్ట్రానికీ చేయనంత సాయాన్ని ఏపీకి అందచేశామన్నారు. ఒక్క ప్రత్యేక హోదా తప్పితే మిగిలినవన్నీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. నిధులను వాడుకోలేని దుస్థితి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరిగా వాడుకోని దుస్థితి టీడీపీ సర్కారుదని నరసింహారావు విమర్శించారు. ‘ప్రజలు చింతిస్తున్నారు. అమరావతి అంటే.. అమ్మో అవినీతి అనే భయం కలుగుతోంది. రూ. 1,000 కోట్లు డ్రైనేజీకి ఇస్తే రూ. 200 కోట్లు మాత్రమే వాడుకున్నారు. కట్టిన భవనాలు ఎక్కడున్నాయో అని చర్చించుకుంటున్నారు. ఇస్తామన్న నిధులు తీసుకోకుండా రాజకీయం చేయటం తగదు..’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. ఏ రాష్ట్రంపైనా తమకు కక్ష లేదన్నారు. లెక్కలు చెప్పలేకపోవటం పారదర్శకతా? నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని టీడీపీ చెప్పడంలో వాస్తవం లేదని జీవీఎల్ తెలిపారు. ‘బురదజల్లే రాజకీయాలు సరికాదు. మొత్తం నాటకంలో ఇదొక భాగం. చేసిన ఖర్చుకు లెక్కలు చెప్పాలని అడిగాం. ఇచ్చిన రూ.990 కోట్లకు సరైన వివరాలు లేవు. డబ్బంతా ఎటు పోయిందన్న వివరాలు ఇవ్వలేనప్పుడు పారదర్శకత పాలన ఎలా అవుతుంది. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వ్యాఖ్యలు నాటకాన్ని రంజింపజేయడానికి చేసిన వ్యాఖ్యలే’ అని చెప్పారు. టీడీపీ బలహీనపడినట్లు మీరే తేల్చారు ఇప్పటివరకు ఏపీ వేదికగా ఉన్న రాజకీయ డ్రామాలను ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు హస్తినకు తెచ్చారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ పరపతి ఎంత క్షీణించిందో ఈరోజు జరిగిన పరిణామాలను చూసి చెప్పవచ్చన్నారు. చంద్రబాబు చిన్నాచితక స్థాయి నేతలను కలిసి తమ వాదనలను వినిపించినట్లు చెబుతున్నారన్నారు. ఏ ఒక్క పెద్ద పార్టీ నేతా వారిని ఆలకించిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు కలిసిన నేతల్లో శరద్‌పవార్ మినహా చెప్పుకోదగ్గ వారు ఎవరూ లేరన్నారు. ‘టీడీపీకి పరపతి లేదు. 20 ఏళ్ల క్రితం చక్రం తిప్పినా ఇప్పుడు వినేవాళ్లు లేరు. మీ పార్టీ బలహీనపడిన తీరును మీయాత్ర ద్వారా మీరే తేటతెల్లం చేశారు..’ అని నరసింహారావు వ్యాఖ్యానించారు. -
‘ఆయనకు మంత్రి పదవి రాకపోవడంపై నో కామెంట్’
విజయవాడ: విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి రాని అంశంపై తాను స్పందించదలచుకోలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో 175 నియోజకవర్గల్లో పార్టీని, గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులతో పెట్టే పథకాలకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో ఉత్తరాంధ్రకు మురళీధర్ రావు, మధ్యఆంధ్రకు మంత్రి ఆర్కే సింగ్, రాయలసీమకి వినోద్ థావడేలు పార్టీ బలోప బాధ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్‌లో అమిత్ షా విజయవాడ పర్యటన ఉంటుందన్నారు. పర్యటన సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు. మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా దివాస్ జరపనున్నామని తెలిపారు. కాకినాడలో బీజేపీపై టీడీపీ రెబెల్స్, నంద్యాలో జెండాలు లేకుండా ప్రచారం చేయించడంపై పార్టీలో చర్చించామని తెలిపారు. కంచె ఐలయ్య వ్యాక్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, కంచె ఐలయ్యపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
ఎంపీ హరి.. మౌనంతో సరి!
► విశాఖ భూకుంభకోణాలపై స్పందించని నేత ► నగర పరువు మంటగలుస్తున్నా సరే.. ► మిత్రపక్ష పెద్దల రక్షణకే కట్టుబడ్డారని ఆరోపణలు ► ప్రజాప్రతినిధిగా బాధితుల కష్టాలు పట్టించుకోలేదని విమర్శలు ► సహచర బీజేపీ నేత గర్జిస్తున్నా.. ఈయనది మాత్రం మౌనముద్రే ‘విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తున్నాం.. ఎన్నో ప్రాజెక్టులు తెస్తున్నాం.. అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులతో ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం’.. అని సందు దొరికినప్పుడల్లా సోది చెబుతుంటారు.. మన ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారైన హరిబాబు.. పనిలో పనిగా సీఎం చంద్రబాబును, టీడీపీ జిల్లా నేతలను కీర్తించడం ఎన్నడూ మరిచిపోలేదు.. మరి అదే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా పేరుతో ఫలహారం చేసేసిన భారీ కుంభకోణం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది.. బ్రాండ్ ఇమేజ్ సంగతేమోగానీ.. విశాఖ పరువును మంటగలిపేసినా.. స్థానిక ఎంపీగా హరిబాబు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని అంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: భూ రికార్డులను తారుమారు చేసి.. గల్లంతు చేసి.. దర్జాగా కబ్జాలపర్వం సాగించిన బడా భూ చోరుల ఆగడాల వల్ల విశాఖ పరువు జాతీయస్థాయిలో దెబ్బతింటోందని విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ పెద్దల భూదాహానికి విశాఖ బ్రాండ్ ఇమేజ్ కొట్టుకుపోతున్నా.. స్థానిక ఎంపీగా హరిబాబు మాత్రం నోరు మెదపడం లేదు. సహచర పార్టీ నేత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విశాఖ భూ దందాలపై సమయం దొరికినప్పుడల్లా గొంతెత్తుతున్నారు. అధికార టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. ఆధారాలతో సహా ముదపాక భూముల కుంభకోణంలో టీడీపీ నేతల పాత్రను బట్టబయలు చేశారు. విశాఖ రూరల్, భీమిలితో సహా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లోనే ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఓ పక్క ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో రూ.2,200 కోట్ల విలువైన భూములకు చెందిన 1బీ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురికాగా...లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యమ బాటలో విపక్షాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి జాతీయస్థాయి ఉద్యమానికి నడుం బిగించాయి. ఇప్పటికే ముదుపాకలో ఆక్రమణకు గురైన భూముల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ పార్టీకి చెందిన వారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనంటూ మంత్రి గంటా ఏకంగా అయ్యన్నపై సీఎంకే ఫిర్యాదు చేశారు. ఇలా రోజురోజుకు ఈ భూ కబ్జాల దుమారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. కుంభకోణాల్లో అత్యధిక శాతం తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే జరుగుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా హరిబాబు వీసమెత్తయినా స్పందించ లేదు. ఆయన తీరుపై విశాఖవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ పెద్దలున్నందున సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తుంటే జాతీయ స్థాయిలో పరపతి కలిగిన హరిబాబు మాత్రం ఆ దిశగా తానూ ప్రయత్నిస్తానన్న పాపాన పోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం కబ్జాకోరుల పాలై మానసిక క్షోభకు గురవుతున్నా పట్టించుకోని వ్యక్తినా.. ఎంపీనా తాము ఎంపీగా ఎన్నుకున్నది అని వారు ఆవేదన చెందుతున్నారు. ‘విశాఖకు అది చేశాం..ఇది చేశాం.. అని లేని గొప్పలు చెప్పుకోవడం కాకుండా తమ కష్టాలపై స్పందించరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భూ కుంభకోణంపై ఎంపీ హరిబాబు నోరు విప్పి బాధితులకు అండగా నిలుస్తానని భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిత్రపక్ష పెద్దలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మిన్నకుండిపోతే మాత్రం సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని భూ కబ్జాల బాధితులు హెచ్చరిస్తున్నారు. -
ఎంపీ హరి.. మౌనంతో సరి!
♦ విశాఖ భూకుంభకోణాలపై స్పందించని నేత ♦ నగర పరువు మంటగలుస్తున్నా సరే.. ♦ మిత్రపక్ష పెద్దల రక్షణకే ♦ కట్టుబడ్డారని ఆరోపణలు ♦ ప్రజాప్రతినిధిగా బాధితుల కష్టాలు పట్టించుకోలేదని విమర్శలు ♦ సహచర బీజేపీ నేత గర్జిస్తున్నా.. ♦ ఈయనది మాత్రం మౌనముద్రే ‘విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తున్నాం.. ఎన్నో ప్రాజెక్టులు తెస్తున్నాం.. అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులతో ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం’.. అని సందు దొరికినప్పుడల్లా సోది చెబుతుంటారు.. మన ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారైన హరిబాబు.. పనిలో పనిగా సీఎం చంద్రబాబును, టీడీపీ జిల్లా నేతలను కీర్తించడం ఎన్నడూ మరిచిపోలేదు.. మరి అదే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా పేరుతో ఫలహారం చేసేసిన భారీ కుంభకోణం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది.. బ్రాండ్ ఇమేజ్ సంగతేమోగానీ.. విశాఖ పరువును మంటగలిపేసినా.. స్థానిక ఎంపీగా హరిబాబు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని అంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : భూ రికార్డులను తారుమారు చేసి.. గల్లంతు చేసి.. దర్జాగా కబ్జాలపర్వం సాగించిన బడా భూ చోరుల ఆగడాల వల్ల విశాఖ పరువు జాతీయస్థాయిలో దెబ్బతింటోందని విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ పెద్దల భూదాహానికి విశాఖ బ్రాండ్ ఇమేజ్ కొట్టుకుపోతున్నా.. స్థానిక ఎంపీగా హరిబాబు మాత్రం నోరు మెదపడం లేదు. సహచర పార్టీ నేత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విశాఖ భూ దందాలపై సమయం దొరికినప్పుడల్లా గొంతెత్తుతున్నారు. అధికార టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. ఆధారాలతో సహా ముదపాక భూముల కుంభకోణంలో టీడీపీ నేతల పాత్రను బట్టబయలు చేశారు. విశాఖ రూరల్, భీమిలితో సహా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లోనే ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఓ పక్క ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో రూ.2,200 కోట్ల విలువైన భూములకు చెందిన 1బీ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురికాగా...లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యమ బాటలో విపక్షాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి జాతీయస్థాయి ఉద్యమానికి నడుం బిగించాయి. ఇప్పటికే ముదుపాకలో ఆక్రమణకు గురైన భూముల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ పార్టీకి చెందిన వారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనంటూ మంత్రి గంటా ఏకంగా అయ్యన్నపై సీఎంకే ఫిర్యాదు చేశారు. ఇలా రోజురోజుకు ఈ భూ కబ్జాల దుమారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. కుంభకోణాల్లో అత్యధిక శాతం తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే జరుగుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా హరిబాబు వీసమెత్తయినా స్పందించ లేదు. ఆయన తీరుపై విశాఖవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ పెద్దలున్నందున సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తుంటే జాతీయ స్థాయిలో పరపతి కలిగిన హరిబాబు మాత్రం ఆ దిశగా తానూ ప్రయత్నిస్తానన్న పాపాన పోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం కబ్జాకోరుల పాలై మానసిక క్షోభకు గురవుతున్నా పట్టించుకోని వ్యక్తినా.. ఎంపీనా తాము ఎంపీగా ఎన్నుకున్నది అని వారు ఆవేదన చెందుతున్నారు. ‘విశాఖకు అది చేశాం..ఇది చేశాం.. అని లేని గొప్పలు చెప్పుకోవడం కాకుండా తమ కష్టాలపై స్పందించరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భూ కుంభకోణంపై ఎంపీ హరిబాబు నోరు విప్పి బాధితులకు అండగా నిలుస్తానని భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిత్రపక్ష పెద్దలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మిన్నకుండిపోతే మాత్రం సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని భూ కబ్జాల బాధితులు హెచ్చరిస్తున్నారు. -
విశాఖలో ప్రధాని మోదీ 20 కిలోమీటర్ల రోడ్‌షో
జూలై 15, 16 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే నెల 15న విశాఖ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. నగరంలోని ఐఎన్ఎస్ డేగా (నావీ ఎయిర్‌పోర్టు) నుంచి సమావేశాలు జరుగనున్న వేదిక వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో సాగనుంది. రోడ్‌షో రూట్ మ్యాప్‌తో పాటు సమావేశాల నిర్వహణ, వేదిక ఖరారుపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు అధ్యక్షతన విశాఖలో భేటీ అయ్యింది. జూలై 15, 16 తేదీల్లో విశాఖ వేదికగా జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 14న విశాఖకు రానున్నారు. 15న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారు. 14న అమిత్‌షా, 15న నరేంద్ర మోదీ రోడ్‌షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. కాగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, 40 మందికి పైగా కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలంతా విశాఖ రానున్నారు. -
విశాఖ విమానాశ్రయంలో ఖాకీల దాష్టీకం
-
విశాఖ విమానాశ్రయంలో ఖాకీల దాష్టీకం
- రైల్వేజోన్‌పై ఎంపీ హరిబాబు వైఖరికి అఖిలపక్షం నిరసన - వైఎస్సార్సీపీ, వామపక్షాల నేతలను ఈడ్చేసిన పోలీసులు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ, వామపక్షాల నేతల పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు. విశాఖకు రైల్వే జోన్ విషయంలో ఎంపీ కె.హరిబాబు తీరుపై నిరసన తెలియజేయడానికి వైఎస్సార్సీపీ, సీపీఐ, ప్రజాసంఘాల నేతృత్వంలో అఖిలపక్ష నేతలు ఆదివారం సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లారు. ఢి ల్లీ నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఎంపీ హరిబాబు వచ్చారు. అంతకుముందే అక్కడకు అఖిలపక్ష నాయకులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా ఎయిర్‌పోర్టు బయట మోహరించారు. హరిబాబు రాకముందే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ , సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు తదితరులను పోలీసులు వ్యాన్ల వద్దకు లాక్కెళ్లారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి ఏజే స్టాలిన్, డీవైఎఫ్ఐ కార్యదర్శి వై.రాంబాబు తదితరులను అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఎంపీ హరిబాబును మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల ఘెరావ్ చేశారు. ఆయన కారును వైఎస్సార్సీపీ నాయకుడు జాన్‌వెస్లీ తదితరులు అడ్డుకున్నారు. రైల్వే జోన్ విశాఖకు దక్కకుండా అడ్డుపడడం తగదని గట్టిగా నిలదీశారు. అక్కడే ఉన్న మరికొందరు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత విమానాశ్రయంలోకి వస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డగించారు. ఇంతలో ఎంపీ హరిబాబును పోలీసులు అక్కడ నుంచి కారులో పంపించివేశారు. దాదాపు రెండు గంటలపాటు విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేసి ఐదో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో విషయం తెలుసుకున్న పలువురు అక్కడికి చేరుకోవడంతో మరో రెండుగంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. ఎట్టకేలకు రాత్రి 9 గంటల ప్రాంతంలో వీరందరినీ బెయిల్‌పై విడుదల చేశారు. -
'పవన్ కల్యాణ్ మాటల్లో వాస్తవం లేదు'
ఢిల్లీ : జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ మాటల్లో వాస్తవం లేదని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పొట్టలో పొడవలేదని...పొట్ట నింపుతోందన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్‌తో యువత కడుపు నింపుతామని చెప్పారు. ప్రత్యేక ఆంధ్రా ఉద్యమానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని హరిబాబు విమర్శించారు. మరో నేత కావూరి సాంబశివరావు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు మించి ఏపీకి సాయం చేసిందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లు రాబోతున్నాయని కావూరి తెలిపారు. -
అటవీ భూములు డీనోటిఫై
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అనంతపురం సెంట్రల్/ న్యూటౌన్: కొత్తగా ఏర్పడే రాష్ట్రాల రాజధాని నిర్మాణానికి అటవీభూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. సోమవారం ఆయన అనంతపురంలోని డీఆర్డీఏ అభ్యుదయ హాల్లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విదేశీబ్యాంకుల్లో ఉన్న నల్లధనం ఇప్పటి వరకూ రూ.5 వేల కోట్లు వెలికితీశామని తెలిపారు. వెంకయ్యను అడగండి..: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా! ఇక ఆ విషయం గురించి మాట్లాడవద్దు’ అని జవదేకర్ అన్నారు. హోదా విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. చట్టంలో లేనిదానిపై మాట్లాడవద్దని సూచించారు. ప్రత్యేకహోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును అడగాలని సూచించారు. పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని ప్రస్తావించగా.. అదీ వెంకయ్యనే అడగాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అంతకుముందు అనంతపురంలోని లలితకళాపరిషత్తులో జరిగిన ‘వికాస్‌పర్వ్’ విజయోత్సవ సభలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ కేంద్రం చలవే: హరిబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి 24 గంటలూ కరెంటు ఉందంటే కేంద్రం అందిస్తున్న సహకారమే కారణమని తెలిపారు. -
'కేంద్ర నిధులను సద్వినియోగం చేయండి'
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సద్వినియోగం చేసి ప్రాజెక్టులు పూర్తిచేస్తే మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు చేపట్టిన వికాస్పర్వ్పై బుధవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో హరిబాబు మాట్లాడారు. ఈ ప్రచారం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి, నెల్లూరులో కేంద్ర మంత్రులు పర్యటించి కేంద్రం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల ఆగిన బిల్లులు, అవి చట్టరూపం దాల్చకపోవడంతో అభివృద్ధికి కలుగుతున్న అడ్డంకులను కూడా ఈ కేంద్ర మంత్రులు తెలియ జేస్తారని చెప్పారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్ వంటి 4 ప్రధాన అంశాలపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని హరిబాబు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనం కంటే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా కేంద్రం వ్యవహారిస్తుందన్నారు. నీతి అయోగ్ సూచించిన రూ.2,500 కోట్లలో ఇప్పటివరకు రూ.1,950 కోట్లను నూతన రాజధానికి అందించినట్లు హరిబాబు వెల్లడించారు. నీతి అయోగ్ అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010. 45 కోట్లని, జాతీయ ప్రాజెక్ట్ అయినందున ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉందన్నారు. కానీ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కృషి ఫలితంగా కేంద్రం వంద శాతం భరించేందుకు నిర్ణయించిందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇప్పటివరకు మొత్తం రూ.850 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైల్వే జోన్ కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వికాస్‌పర్వ్ కార్యక్రమం పూర్తి కాగానే రైల్వే మంత్రిని కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, కొచ్చర్లకోట లక్ష్మీపతిరాజా తదితరులు పాల్గొన్నారు. -
పార్టీశ్రేణులకు న్యాయం చేస్తా
♦ సమస్యలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తా ♦ ఆయనతోనే చంద్రబాబుతో మాట్లాడిద్దాం.. ♦ విశాఖపట్నం సదస్సులో అన్నీ చర్చిద్దాం ♦ బీజేపీ నాయకులకు కంభంపాటి హరిబాబు హామీ సాక్షి, విజయవాడ : నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీశ్రేణులకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు హామీ ఇచ్చారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన కంభంపాటి హరిబాబును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నగరానికి చెందిన సుమారు 50 మంది నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జరిగిన అంతర్గత సమావేశంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని సదరు నేతలు ఏకరువు పెట్టారు. హరిబాబును గట్టిగా నిలదీశారు. దీనికి స్పందించిన ఆయన రాష్ట్రంలో బీజేపీ శ్రేణులకు జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తామని, చంద్రబాబుతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు. పదవులు భర్తీ అయ్యాక ఏం చేద్దాం? టీడీపీ మహానాడులోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని, పార్టీ నాయకులు కూడా ఎవరికి వారు పదవులు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారని బీజేపీ స్థానిక నేతలు హరిబాబుకు వివరించారు. పదవులన్నీ భర్తీ అయ్యాక చంద్రబాబుతో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. పదవుల కోసం చంద్రబాబును నిలదీయాలని, దీనికి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నేతలు సహకరించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో కొన్ని కీలకమైన పదవులతో పాటు ప్రతి కమిటీలోనూ కనీసం రెండు పదవులు బీజేపీ నేతలకు, కార్యకర్తలకు దక్కేలా పట్టుబట్టాలని వారు హరిబాబుకు సూచించారు. బీజేపీకి ప్రాధాన్యత లేకుండా వేసే కమిటీల విషయంలో టీడీపీ అధిష్టానాన్ని నిలదీయాలని వారు సూచించారు. హరిబాబు హామీల వర్షం బీజేపీ నాయకులు అడిగిన ప్రశ్నలపై రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. తమకు పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేయడానికి ప్రయత్నిస్తే ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అక్కడ టీడీపీ నేతలకు పదవులు దక్కకుండా చేస్తామంటూ హామీ ఇచ్చారు. బీజేపీ నేతలకు పదవులు ఇచ్చేందుకు అవసరమైతే ప్రత్యేక జీవోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసేలా చూద్దామని చెప్పినట్టు సమాచారం. ఇటీవల బెంగళూరులో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ బీజేపీ శ్రేణులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించామని తెలిపారు. ఈనెల 12న వైజాగ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో రాష్ట్రంలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించడంతోపాటు వారి మనోభావాలను కూడా తెలుసుకుని దానికి తగినట్టుగా తీర్మానాలు చేస్తామని హరిబాబు హామీ ఇచ్చారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి పార్టీ నేతలకు, శ్రేణులకు న్యాయం జరిగేలా చూస్తారన్నారు. హరిబాబుతో చర్చించిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లూరు శ్రీమన్నారాయణ తదితరులున్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగేదెప్పుడు? ఏళ్ల తరబడి జెండాలు మోస్తున్న వారు పార్టీలో ఉన్నారని, వారికి ఏం న్యాయం జరిగిందని పలువురు నేతలు హరిబాబును ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వం కోసం శ్రేణుల వద్దకు వెళితే.. కేంద్రంలో అధికారంలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నా పార్టీ కార్యకర్తలకు ఏం ఒరుగుతోందని ప్రశ్నిస్తున్నారని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామంటూ పలువురు నేతలు హరిబాబుకు వివరించారు. 30 ఏళ్లుగా ఈ పార్టీలో ఉన్నారని, ఏ ఇతర పార్టీలో ఉన్నా ఎంతో కొంత ప్రయోజనం ఉండేదని కార్యకర్తలు తమ వద్ద ఆక్రోశిస్తున్నారని తెలిపారు. -
ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహం సరికాదు:మొయిలీ
ఏపీ, తెలంగాణలపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరిబాబు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండడంపై కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ, తెలంగాణలకు అదనపు పెట్టుబడి అలవెన్స్, డిప్రిసియేషన్ అలవెన్స్‌లను ప్రకటించడం స్వాగతించదగిన పరిణామమే. దీని పర్యవసనాలేంటో ప్రభుత్వానికి తెలుసా? ఈ కారణంగా కేరళ, కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాలకు దక్కాల్సిన పెట్టుబడులన్నీ ఆ రెండు రాష్ట్రాలకే వెళ్తాయి. ఒక పద్ధతి ఉండాలి. ఇతర రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు. వ్యతిరేకించడం తగదు: బీజేపీ ఎంపీ హరిబాబు ఏపీకి కేంద్రం పారిశ్రామిక రాయితీలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ వ్యతిరేకించడం తగదని, ఈ చర్యలు కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదని ఓవైపు కోటి సంతకాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టగా, మరోవైపు మొయిలీ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు. -
'ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు'
విజయవాడ : ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుందని విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. ఇంటర్ మార్కులు ఆధారంగానే ఎంసెట్ అడ్మిషన్లు జరపాలని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఒకవేళ ఏపీలో ఎంసెట్ నిర్వహించినా అడ్మిషన్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని హరిబాబు సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ వ్యవహారాన్ని గాలికొదిలేసింది. ఎంసెట్ ఉమ్మడిగా నిర్ణయించాలా..? లేక ప్రత్యేకంగా నిర్వహించాలా...? అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఉమ్మడి ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వంలోనూ చర్చించడమూ లేదు. ప్రత్యేకంగా నిర్వహణకు ఏపీ సర్కార్ సిద్ధమవటంలేదు. లక్షలాదిమంది విద్యార్థులను ప్రభుత్వం గందరగోళంలో పడేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనుంది. 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన పరీక్షను నిర్వహించి.. అదే నెల 28వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు. -
'ఇంటర్నేషనల్ హబ్‌గా విశాఖ'
విశాఖ: విశాఖ జిల్లాలో త్వరలోనే ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ టాజిస్టిక్ హబ్‌గా కార్యరూపం దాల్చనుందని ఎంపీ కె. హరిబాబు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఐఎం కోసం కేంద్రం రూ.900కోట్ల ప్రతిపాదనలకు సిద్ధం చేస్తోందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలు ప్రకారమే కేంద్రం సహాయం చేస్తుందని హరిబాబు తెలిపారు. త్వరలో రాజమండ్రిలో రాత్రిపూట విమానాలు దిగేలా చర్యలు చేపడుతామని ఎంపీ హరిబాబు చెప్పారు. -
హరి ఫైర్
ఎంపీ హరిబాబును విస్మరించిన హోం మంత్రి ఆగ్రహంతో కార్యక్రమం నుంచి వెనుదిరిగిన ఎంపీ సముదాయించిన మంత్రులు సభా ముఖంగా ఎంపీ, డీజీపీ ఫైర్ బహిర్గతమైన బీజేపీ, టీడీపీ విభేదాలు విశాఖపట్నం: నివురుగప్పిన నిప్పులా ఉన్న బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు మంగళవారం బహిర్గతమయ్యాయి. రాష్ట్ర హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం నగరంలో పర్యటించారు. ఈ పర్యటన నాయకుల మధ్య పెద్ద రగడకు దారితీసింది. తన విషయంలో ప్రొటోకాల్ విస్మరించారంటూ బీజేపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాక్షాత్తూ హోమ్ మంత్రి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎంపీ పోలీసు శాఖపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై డీజీపీ రాముడు అంతే ఘాటుగా ప్రతి స్పందించారు. ఈ సంఘటన చర్చనీయాంశమైంది. మహిళల రక్షణ కోసం ‘అభయం’ మెబైల్ అప్లికేషన్, ‘ఐ క్లిక్’ పరికరాన్ని ప్రారంభించడానికి పోలీసులురాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జెవి రాముడుతో పాటు జిల్లా ఎంపీ కంబంపాటి హరిబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. సీఎంఆర్ షాపింగ్‌మాల్‌లో ఐ క్లిక్‌ను ఏర్పాటు చేశారు. దాని ప్రారంభానికి నిర్దేశిత సమయానికే ఎంపీ హరిబాబు అక్కడకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన హోం మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు లోపలికి వెళ్లి ఐక్లిక్ను ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎంపీ హరిబాబు,ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులను పట్టించుకోలేదు. దీంతో హరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రజా ప్రతినిధిని గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ దుయ్యబట్టారు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ రాముడు ఆయనను వారించారు. అప్పటికే బయలుదేరేందుకు కారులోకి వెళ్లిపోయిన హోం మంత్రి విషయం తెలుసుకుని కారు దిగివచ్చి ఎంపీ హరిబాబును మన్నించమని అడిగారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా చేయలేదన్నారు. సీఎంఆర్‌లో ప్రొటోకాల్ రగడ సద్దుమణిగిందనుకున్నప్పటికీ ఎంపీ హరిబాబు తన ఆగ్రహాన్ని ఎఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన అభయం యాప్ ఆవిష్కరణలోనూ కొనసాగించారు. తన ప్రసంగంలో పోలీసు శాఖపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలీసు వ్యవస్థలో ఇటీవల వస్తున్న మార్పులు, వారి బలహీనలతలు ప్రశాంత నగరంలో అసాంఘిక శక్తులు పెరగడానికి కారణమవుతున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఐటి, పర్యాటక రాజధానిగా విశాఖ మారబోతోందని, ఫార్మా కంపెనీలు వస్తున్నాయని కానీ ఇక్కడ నేరాలు పెరుగుతుంటే పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులు సక్రమంగా, సమర్ధవంతంగా పనిచేస్తే ఇలాంటి అప్లికేషన్ల అవసరం ఉండదని, వీటిని వాడే అవసరం రాకుండా పోలీసు వ్యవస్ధ ఉండాలని అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పోలీసులను సున్నితంగా హె చ్చరించారు. ఆరు నెల ల్లో మూడు హత్యలు జరిగినా ఇన్నాళ్లూ నగరంలో సీపీ, అధికారులు లేరని తప్పించుకున్నామని, ఇక అది కుదరదన్నారు. అనంతరం డీజీపీ రాముడు మాట్లాడుతూ ఎంపీ వ్యాఖ్యలను ఖండిం చారు. పోలీసులు ఎంత సమర్ధవంతంగా పనిచేసినా నేరాలు పూర్తిగా రూపుమాపడం సాధ్యం కాదన్నారు. ఎక్కడైనా అలాంటివి జరిగినట్లు తెలిస్తే ఎంపీ హరిబాబు తెలపాలని సభా ముఖంగా అడిగారు. దీంతో ఎంపీ కాస్త ఇబ్బంది పడ్డారు. సభ అనంతరం సర్కూట్ హౌస్‌లో తనను కలిసిన విలేకరుల వద్ద హోమంత్రి ప్రొటోకాల్ రగడపై విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు, స్ధానిక ప్రజాప్రతినిధులు ఈ అంశంపై శ్రద్ధ వహించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను పిలిచి పనిగట్టుకుని విస్మరించడంతో ఇది టీడీపీ ప్రజాప్రతినిధుల నిర్వాకంగానే వారు భావిస్తున్నట్లు వారి ఆగ్రహంలో కనిపించింది. -
వికేంద్రీకరణ జరగాలి
రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్నీ జిల్లాగాఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సూచించారు. అమలాపురంకేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పడాలన్నారు. అమలాపురంలో సోమవారం జరిగిన ‘మోదీ వందరోజుల పాలన సభ’లో ఆయనప్రసంగించారు. అంతకుమందు పుల్లేటికుర్రులో పార్టీ జెండా స్థూపాన్ని, 100 రోజుల అభివృద్ధి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అమలాపురం రూరల్ : రాష్ట్రంలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని హరిబాబు సూచించారు. అమలాపురం కేంద్రంగా కోనసీమను ప్రత్యేక జిల్లా చేయాలన్నారు. కత్తిపూడి నుంచి కృష్ణాజిల్లా పామర్రు వరకు గల జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. కాకినాడ- పాండిచ్చేరి బకింగ్‌హాం కాలువను అభివృద్ధి చేసి జలరవాణా పెంచాలన్నదే తన లక్ష్యమన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలమైన శక్తిగా పటిష్టం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వందరోజుల పాలనను ప్రపంచ దేశాలే కీర్తిస్తున్నాయన్నారు. పార్టీని కార్యకర్తలు బలోపేతం చేయాలన్నారు. శాసన సభాపక్ష నాయకుడు పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 2019 నాటికి అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలు వ్యవసాయంతోపాటు చేపలు, రొయ్యల ఉత్పత్తి ద్వారా వేలాది కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయని, ఈ రెండు జిల్లాల్లో జల, రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ ఆదాయం మరింత పెరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి నివేదించానన్నారు. మరో కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు టీడీపీ నాయకులు స్థానిక బీజేపీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో బీజేపీ నాయకులు కీలకంగా వ్యవహరించి పార్టీని ప్రజలకు చేరువచేయాలన్నారు. 100రోజులలో ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలను నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు వివరించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో కూడా దేశాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో ఉన్నారన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని, మళ్లీ అదే తరహాలో మోదీ నాయకత్వంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, పైడా కృష్ణమోహన్, సురేష్‌రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీ రాణి, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్వీ నాయుడు, ముదునూరి రంగరాజు, బసవా చినబాబు, నల్లా పవన్, యల్లమిల్లి కొండ, పాలూరి సత్యానందం, బసవా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిన ఆల్డా చైర్మన్ దొరబాబు రాష్ట్ర ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆపార్టీలో చేరారు. మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ గంగరాజు, పార్టీ నాయకులు సోము వీర్రాజు తదితరులు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతోపాటు నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల డీఎల్‌డీఏ చైర్మన్లు సురేష్‌రెడ్డి, దాసరి గంగాధరరావు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కుడుపూడి సూర్యనారాయణతోపాటు అల్లవరం మాజీ ఎంపీపీ మల్లాడి యామినీ పద్మప్రియ, మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లాడి హనుమంతరావుతోపాటు పలువురు బీజేపీలో చేరారు. -
హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రా అభివృద్ధా?
సాక్షి, విశాఖపట్నం:‘హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేస్తామంటే జరిగేపని కాదు.. హైదరాబాద్ ఇడ్లీలు తిని, అక్కడి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం తప్ప! ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా.. ఆ ఛాయలేం కనిపించట్లేద’ని విశాఖ ఎంపీ కంభంపాటి హరి బాబు ఆక్షేపించారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. -
బీజేపీలో లుకలుకలు
బొబ్బిలి : నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలయ్యూయి. కేంద్రంలో ఒంటిచేత్తో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయూల్సిన నాయకులు అంతర్గత విభేదాలతో రోడెక్కుతున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు పార్టీలోని ఒక వర్గానికి నచ్చకపోవడంతో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ఆ పార్టీ జిల్లా నాయకులకు తెలిసినా.. సరిదిద్దడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.బొబ్బిలిలో బీజేపీని పూర్వం నుం చి నడిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయి తే ఇటీవల పట్టణానికి చెందిన కొంతమంది ఇతర పార్టీ ల నాయకులు బీజేపీలో చేరడంతో వారికే ప్రాధాన్యమివ్వడంతో విభేదాలు పొడచూపాయి. ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ పెద్దింటి జగన్మోహన్రావు ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. విశాఖ ఎంపీ హరిబాబుతో సాన్నిహిత్యం ఉండడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికే పూర్వం నుంచి ఉన్నవారంతా పెద్దిం టి నాయకత్వంలో ముందుకు వచ్చి పని చేయడం మొ దలు పెట్టారు. అయితే బీజేపీలో బొబ్బిలి మున్సిపాలి టీకి కౌన్సిలరుగా పోటీ చేసిన మువ్వల శ్రీనివాసరావు మరో వర్గంతో కార్యక్రమాలు చేయడంతో విభేదాలు రాజుకున్నాయి. ఇటీవల పెద్దింటి పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, రైల్వే, పోస్టల్ శాఖల సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అధినాయకత్వం, మంత్రులకు దృష్టికి తీసుకువెళ్తున్నారు.ఇవి నచ్చని ము వ్వల ఇటీవల ఆయనతో బాహాటంగానే వాదనకు దిగా రు. దీంతో వీరి మధ్య విభేదాలు మరింత రాజుకున్నా రుు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నాయకులు టీడీపీకి సహకరించింది అంతంత మాత్రమే. పె ద్దింటి విశాఖ ఎంపీకి మద్దతుగా ప్రచారం చేస్తే, ము వ్వల బృందం నెల్లిమర్ల వెళ్లి అక్కడ నాయకుల తరఫున ప్రచారం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు అంతగా ప్రాధాన్యమివ్వలేదని, పట్టించుకోలేదని, జెండాలు ఇచ్చినా.. ఎక్కడ కట్టడం లేదంటూ వారిలో వారే కుమ్మలాటలాడుకున్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే ఆది వారం పట్టణంలోని వెలమవారి వీధిలో మువ్వల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పెద్దింటితో పాటు ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు డాక్టరు రెడ్డి సత్యారావుతో పాటు నాయకులు ఎవరూ హాజరుకాలేదు. సీమాంధ్ర కమిటీ అధ్యక్షుడు పాకల పాటి సన్యాసిరాజుతో పాటు జిల్లా నాయకత్వం ఇక్కడకు వచ్చిన అనుకున్నంత స్థాయిలో ప్రారంభోత్సవ వేడుక జరగకపోవడంతో జిల్లా నాయ కత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతంత మాత్రంగా ఉన్న పార్టీలోనే ఒకరిని ఒకరు కలుపుకొని వెళ్లలేని పరిస్థితి ఉంటే మరి రాబోయే కాలంలో పార్టీ పరిస్థితి ఏమిటన్న పరిస్థితి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా నాయకులు స్పందించి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ రెండు కమిటీల ఏర్పాటు ఎట్టకేలకు గురువారం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా డాక్టర్ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. అలాగే సీమాంధ్ర ప్రాంత బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్న జి.కిషన్‌రెడ్డి ఇకనుంచీ కొత్త రాష్ట్రం తెలంగాణకు అధ్యక్షునిగా కొనసాగుతారు. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదలైంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందగానే రెండు కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ జాప్యం జరుగుతూ వచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి రెండు కమిటీలను ఏర్పాటు చేస్తారని భావించినా అలాటి పరిస్థితి లేకపోవడంతో పార్టీ జాతీయనాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి పార్లమెంటులో బిల్లుకు పూర్వమే ఉభయప్రాంతాల నాయకులు ముఖాలు చూసుకునే పరిస్థితి లేకపోయింది. ప్రాంతాలవారీగా పార్టీ నేతలు విడిపోయి వాదనలకు దిగారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఎవరి పంతం వారు నెగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని ఖాతరు చేయకుండానే సీమాంధ్ర నేతలు ఢిల్లీలో జాతీయ నాయకత్వానికి నివేదికలు అందజేశారు. బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. వాటిని ఖాతరు చేయవద్దంటూ కిషన్‌రెడ్డి ఏకంగా ఢిల్లీలోనే నిరాహారదీక్ష చేపట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని పలువురు తప్పుబట్టారు. ఆయనపై ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు బహిరంగంగానే విమర్శలకూ దిగారు. దీంతో వెంకయ్యనాయుడు సాక్షాత్తూ పార్టీ కార్యాలయంలోనే ఒంటరి కావడంతో సీమాంధ్రనేతలు ఆ ఛాయలకే రాకుండా పోయారు. దీంతో పరిస్థితిని గమనించిన జాతీయ నాయకత్వం రెండు శాఖలకు వేర్వేరుగా అధ్యక్షుల్ని ప్రకటించి తన కర్తవ్యాన్ని పూర్తిచేసింది. ఈ మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అధ్యక్షునిగా హరిబాబును బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నియమించారు. వాస్తవానికి సోము వీర్రాజు అధ్యక్ష పదవికి పోటీపడినా జాతీయ నాయకత్వం హరిబాబుకే ప్రాధాన్యమిచ్చింది. కాగా, ఇది పదవి కాదని, బాధ్యత మాత్రమేనని హరిబాబు వ్యాఖ్యానించారు. పార్టీ సీమాంధ్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సీమాంధ్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.