'పవన్ కల్యాణ్ మాటల్లో వాస్తవం లేదు'
'పవన్ కల్యాణ్ మాటల్లో వాస్తవం లేదు'
Published Sun, Sep 11 2016 2:58 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
ఢిల్లీ : జనసేన అధినేత, సినీ హీరో పవన్కల్యాణ్ మాటల్లో వాస్తవం లేదని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పొట్టలో పొడవలేదని...పొట్ట నింపుతోందన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్తో యువత కడుపు నింపుతామని చెప్పారు. ప్రత్యేక ఆంధ్రా ఉద్యమానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని హరిబాబు విమర్శించారు. మరో నేత కావూరి సాంబశివరావు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు మించి ఏపీకి సాయం చేసిందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లు రాబోతున్నాయని కావూరి తెలిపారు.
Advertisement
Advertisement