విశాఖపట్నం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు
విశాఖపట్నం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఖండించారు.
విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేదిలా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, శాంతి భద్రతలు కాపాడాల్సినది టీడీపీయేనని, అలాంటి పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం బాగోలేదని వ్యాఖ్యానించారు.
ఈ విధమైన అరాచకానికి పాల్పడడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దానికి దర్పణం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కంభంపాటి డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్ నినాదాలు చేస్తూ..అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment