pelted stones
-
వందేభారత్‌పై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీరట్ నుండి మోదీనగర్‌కు వస్తుండగా ఈ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో అక్టోబర్ 22, 27 తేదీల్లో, నవంబర్ 22, 27 తేదీల్లో ఇదేవిధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నెలలో సిక్రి కలాన్- సోనా ఎన్క్లేవ్ కాలనీ సమీపంలో, నవంబర్‌లో హనుమాన్పురి- శ్రీనగర్ కాలనీ సమీపంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు.ఘజియాబాద్ పోలీసులు ఈ నాలుగు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వందేభారత్‌పై రాళ్లు రువ్వుతున్న ఘటనలు అటు రైల్వే యంత్రాంగాన్ని, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం -
మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన సమయంలో మహాబోధి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి బీహార్‌లోని గయకు వెళుతోంది.ఈ రాళ్లదాడిలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి యమునా బ్రిడ్జి సమీపంలో ఈ రాళ్లదాడి జరిగింది. మిర్జాపూర్ స్టేషన్లో రైలును నిలిపివేసి, గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందించారు. అలాగే దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ రైలుపై రాళ్లు రువ్విన ఐదుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్టు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (మహాసముంద్) ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సింగ్ ధాకడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రైలు విశాఖపట్నం నుండి దుర్గ్‌కు తిరిగి వస్తుండగా బాగ్బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. రైలు దుర్గ్ నుండి ట్రయల్ రన్ కోసం బయలుదేరిందని, రాయ్‌పూర్ గుండా మహాసముంద్ చేరుకుందని ధాకడ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే -
నవజాత శిశువు మాయం : రణరంగంగా ఆసుపత్రి
సాక్షి, పట్నా: బిహార్‌లో ఆసుపత్రులలో వరుసగా వివాదాస్పద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇస్లాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు కనిపించకుండా పోయిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నలందాకు చెందిన ఇస్లాంపూర్ వాసులు తమ బంధువును ప్రసవం కోసం ఆసుపత్రికి తీసు కొచ్చారు. గత రాత్రి ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు కనిపించకుండా పోవడంతో బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక మహిళ తమ బిడ్డను అపహరించుకుపోయిందని ఆరోపిస్తున్నఆందోళనకు దిగడంతో ఘర్షణకు దారితాసింది. విచక్షణ ఆసుపత్రిపై రాళ్ల దాడికి దిగారు.. ఆసపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతం రణరంగంగా మారిపోయింది. #WATCH Bihar: Relatives of a woman, who had come to Primary Health Centre in Islampur of Nalanda for delivery of her child last night, pelted stones at & vandalised the property after the child was allegedly stolen by another woman, from the hospital. pic.twitter.com/MDlSUmjNzl — ANI (@ANI) June 29, 2019 -
‘ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి’
సాక్షి, విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. శనివారం డీజీపీకి కలిసిన నేతలు..తిరుపతిలో పరిస్థితులను అదుపుచేయని ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై టీడీపీ భౌతిక దాడులు చేస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలను రక్షించండి అని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మీడియాకు చెప్పి మరీ టీడీపీ సభ్యులు అమిత్ షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మోదీ దిష్టిబొమ్మలు దగ్థం చేసినా కేసులు పెట్టడంలేదని వాపోయారు. తిరుపతి ఘటనపై డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. అమిత్ షా మీద రాళ్ల దాడి జరిగిందని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. కానీ అక్కడ రాళ్ల దాడి జరుగలేదని, కాన్వాయ్‌లో ఏడో వాహనం స్లోగా ఉన్నప్పుడు కర్రలతో మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు పెట్టామని, ఒకరిని అరెస్ట్ కూడా చేశామని డీజీపీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. -
అమిత్ షాపై దాడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతికి కొండ దిగుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. అరుపులు, కేకలు, తోపులాటలతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమిత్ షా కారును అడ్డుకోబోయిన ఆందోళనకారుల యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు అమిత్ షా కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశరెడ్డి ధ్వజమెత్తగా.. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై నిరసన పేరుతో దాడి చేయడాన్ని వివిధ వర్గాల ప్రముఖులు త్రీవంగా ఖండిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అమిత్ షా.. శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి తిరుపతికి ప్రయాణమయ్యారు. అమిత్ షా రాక గురించి తెలుసుకున్న టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడు దంపూరు భాస్కర్ యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, స్థానిక ఎమ్మెల్యే అల్లుడు బీఎల్ సంజయ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుణశేఖర్ నాయుడు తదితరులు పార్టీ కార్యకర్తలతో ఉదయం 11గంటలకు పెద్దఎత్తున అలిపిరి గరుడ సర్కిల్‌కు చేరుకున్నారు. అమిత్ షా కాన్వాయ్ రాగానే ‘గో బ్యాక్..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆయన క్వానాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అమిత్ షా కారు గరుడ సర్కిల్ దాటి వెళ్లిపోయింది. అలిపిరి వద్ద అమిత్‌షా కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలను అదుపుచేస్తున్న పోలీసులు కాన్వాయ్‌లోని ఓ కారును చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు.. కారు వెనుక అద్దాలపై కట్టెలు, రాళ్లతో దాడిచేసి పగులగొట్టారు. దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అడ్డుపడ్డారు. బీజేపీ నాయకులను వెళ్లమని చెప్పి టీడీపీ ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా స్వల్పంగా తోపులాట జరిగింది. ఆందోళనకారులను రోప్ పార్టీ బలంగా వెనక్కి నెట్టడంతో సింగంశెట్టి సుబ్బరామయ్య, గుణశేఖర్‌నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సుబ్బు, రవి, ఆనంద్‌గౌడ్‌లనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అరెస్టుచేసి అలిపిరి స్టేషన్‌కు తరలించారు. ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు ఈ సంఘటన జరిగిన గంట తరువాత తిరుపతి బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, చంద్రారెడ్డి, వరప్రసాద్, కోలా ఆనంద్‌లు ఎస్పీ అభిషేక్ మొహంతిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు కూడా ఎస్పీని కలిసి తమ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడిచేశారని ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల కేసులూ నమోదు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రిదే బాధ్యత రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోంది. అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. సీఎం ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. రౌడీలు, గూండాల్లా వ్యవహరించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటే సరిపోదు.. తాడిచెట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. తులసి మొక్కకున్న పవిత్రత దానికి ఉండదు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన జాతీయ పార్టీ నేతను అవమానించడం, తెలుగు ప్రజలపై ఉన్న మంచి అభిప్రాయాన్ని దెబ్బతీయడమే. ఈ దాడికి సీఎం బాధ్యత వహించాలి. – భానుప్రకాశ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ
విశాఖపట్నం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఖండించారు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేదిలా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, శాంతి భద్రతలు కాపాడాల్సినది టీడీపీయేనని, అలాంటి పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం బాగోలేదని వ్యాఖ్యానించారు. ఈ విధమైన అరాచకానికి పాల్పడడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దానికి దర్పణం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కంభంపాటి డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్ నినాదాలు చేస్తూ..అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేసిన సంగతి తెల్సిందే. -
షారుక్‌ఖాన్ కారుపై రాళ్ల దాడి
అహ్మదాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అహ్మదాబాద్ సమీపంలో ‘రయీస్’ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. దాడి సమయంలో షారూక్ కారులో లేరు. ‘జై శ్రీరాం, షారూక్ హై హై’ అంటూ కొందరు కారు వద్ద నినాదాలు చేశారని, సినిమా లోకేషన్‌కు దగ్గర్లోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 1980లలో అహ్మదాబాద్ అండర్‌వరల్డ్ డాన్ అబ్దుల్ లతీఫ్ షేక్ జీవితం ఆధారంగా ‘రయీస్’ సినిమా తెరకెక్కుతోంది. -
శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి
చండీగఢ్: ఢిల్లీ- చండీగఢ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హర్యానాలోని రతధనా-సోనీపేట రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న రైలుపై రాళ్లతో దాడి జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయన్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైళ్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమీప గ్రామాల్లో అధికారులు ప్రచారం చేయించారు. -
సంప్రదాయాన్ని ధిక్కరించాడని..
పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం పెద్దవూర మండలం బాసోనిబావి తండాలో జరిగింది. పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బాసోనిబావితండాలో గిరిజనులు పవిత్రంగా భావించే హోలీమాత (కాముడి) పండగను వారం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. గతంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ పండగను ఈ సారి పది సంవత్సరాలకు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రంతా తండావాసులు నిద్రాహారాలు మాని గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి వేకువజామున కాముడిని దహనం చేశారు. దీనిని చూడటానికి పరిసర తండాలైన కోమటికుంటతండా, నంభాపురంల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాముడిని దహనం చేస్తున్న సమయంలో కోమటికుంట తండాకు చెందిన బాణావత్ బాలు కూడా వచ్చాడు. ఎవరైనా కాముడి దహనాన్ని చూడొచ్చు కానీ బూడిదను ముట్టుకోవడం, నోట్లో వేసుకోవడం గానీ చేయరాదనేది సంప్రదాయం. కాముడిని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను గ్రామ పెద్ద అయిన మదిగేరియా మొదటగా తీసుకుని బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్న తరువాత గ్రామ పెద్దలు, అనంతరం తండావాసులు దానిని తీసుకుంటారు. కేకే తండాకు చెందిన బాలు పవిత్రమైన కాముడి బూడిదను ఎవరూ తీసుకోకముందే దానితో బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్నాడు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం ఇది తండాకు అరిష్టం. దీంతో బాలును తండాకు చెందిన గిరిజనులు పట్టుకుని చితక బాదారు. కోపంలో అతనిని ఏమైనా చేసారేమోనని తండాకు చెందిన గ్రామపెద్ద ఒకరు అతన్ని తీసుకుని వెళ్లి ఇంట్లో తాళం వేసి నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హాలియా సీఐ శివశంకర్, పెద్దవూర, హాలియా, సాగర్ ఎస్ఐలు ఇండ్ల వెంకటయ్య, బోజ్యానాయక్, రజినీకర్లు తమ సిబ్బందితో చేరుకున్నారు. ఇంటిలో బంధించిన బాలును స్టేషన్‌కు తరలించే క్రమంలో తండావాసులు అతన్ని తీసుకుపోవద్దని, తమకు అప్పగించాలని అతడిని అంతం చేస్తామని పోలీసులను అడ్డుకుని రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దవూర ఏఎస్ఐ తాడిపర్తి శేషుబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్‌రెడ్డి, మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సాగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంప్రదాయానికి భంగం కలిగించిన బాలుపై కేసు నమోదు చేశామని, అదేవిధంగా అక్కడికి వెళ్లిన పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కల్గించినందుకు తండావాసులపై కూడా కేసులు పెట్టి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు.