ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీరట్ నుండి మోదీనగర్‌కు వస్తుండగా ఈ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో అక్టోబర్ 22, 27 తేదీల్లో, నవంబర్ 22, 27 తేదీల్లో ఇదేవిధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నెలలో సిక్రి కలాన్- సోనా ఎన్‌క్లేవ్ కాలనీ సమీపంలో, నవంబర్‌లో హనుమాన్‌పురి- శ్రీనగర్ కాలనీ సమీపంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు.
ఘజియాబాద్ పోలీసులు ఈ నాలుగు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వందేభారత్‌పై రాళ్లు రువ్వుతున్న ఘటనలు అటు రైల్వే యంత్రాంగాన్ని, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం
Comments
Please login to add a commentAdd a comment