జిమ్లో కసరత్తులు చేస్తున్న అమితాబ్ | Big B hitting the gym for next film | Sakshi
Sakshi News home page

జిమ్లో కసరత్తులు చేస్తున్న అమితాబ్

Published Wed, May 20 2015 2:10 PM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

జిమ్లో కసరత్తులు చేస్తున్న అమితాబ్ - Sakshi

జిమ్లో కసరత్తులు చేస్తున్న అమితాబ్

తన పాత్రల కోసం ఎంత శ్రమకైనా ఓర్చే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు జిమ్కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. రాబోయే సినిమా కోసమే ఆయనిలా కష్టపడుతున్నారు. 72 ఏళ్ల వయసులో ఉన్న బిగ్ బీ.. తన శరీరం షేపును మార్చుకోవాల్సి ఉంటుందని,  అందుకే జిమ్కు వెళ్తున్నానని చెబుతున్నారు. వర్కవుట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయని, తన శరీర ఆకారంలో మార్పు మూడు నెలల తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు.

ఉన్నట్టుండి తాను రోజూ ఎందుకు జిమ్కు వెళ్తున్నానని చాలామంది అడుగుతున్నారని,  తన రాబోయే సినిమాలో చేయబోయే పాత్రే ఏకైక కారణమని అమితాబ్ తెలిపారు. తనకు ఏదో ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల చికిత్సలో ఉన్నానేమోనని,  అందుకే వ్యాయామానికి వెళ్తున్నానని చాలామంది అనుకున్నారంటూ బిగ్ బీ తన బ్లాగులో రాశారు. అయితే ప్రస్తుతానికి తాను ఎలాంటి చికిత్సా తీసుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement