వర్మతో నాకు విభేదాల్లేవు | RGV, Big B to reunite for 'Sarkar 3' Mumbai | Sakshi
Sakshi News home page

వర్మతో నాకు విభేదాల్లేవు

Published Fri, May 27 2016 6:59 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

వర్మతో నాకు విభేదాల్లేవు - Sakshi

వర్మతో నాకు విభేదాల్లేవు

ముంబై:బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ రామ్ గోపాల్ వర్మతో కలిసి సర్కార్-3 సినిమాను తీయనున్నారు. తమ కుటుంబ స్నేహితుడు  ఈ సినిమాను నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని  అమితాబ్ బచ్చన్ విలేకరులతో అన్నారు.

ప్రస్తుతం బిగ్ బీ టీఈ3ఎన్ సినిమాలో నటిస్తున్నారు. ముంబైలోని క్రైం డ్రామాను కథాంశంగా తీసుకుని సర్కార్-3 సినిమా నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. వర్మతో విభేదాలున్నాయన్న ప్రశ్నను అమితాబ్ ఖండించారు. వర్మ తనకు మంచి స్నేహితుడని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement