కొన్ని సినిమాలు ఏకపక్షంగా పాజిటివ్ టాక్‌తో బీభత్సమైన వసూళ్లు రాబడతాయి. కానీ కొన్ని మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ భారీగానే కలెక్షన్స్ సాధిస్తాయి. గుంటూరు కారం సినిమా ఈ కోవలోకే వస్తుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
థియేటర్‌లో సినిమా చూసిన జక్కన్న
మొదటివారంలో ఈ సినిమా రూ.212 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి పండగను మహేశ్ బాగానే వాడేసుకున్నాడు. తాజాగా ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి వీక్షించాడు. ఏఎమ్‌బీ థియేటర్‌లో కీరవాణితో కలిసి సినిమా చూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లేచి నిలబడ్డాడు.. వెళ్లిపోయాడా?
అందులో జక్కన్న లేచి నిలబడగా కీరవాణి సీటులోనే కూర్చున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'కీరవాణి ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఏదో తేడాగా ఉంది? కొంపదీసి నిద్రపోయాడా? థమన్ సంగీతానికి నిద్రొచ్చేసినట్లుంది..', 'జక్కన్న రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడా?', 'సినిమా పూర్తిగా చూడకుండానే లేచి వెళ్లపోయినట్లున్నాడు' అని సెటైర్లు వేస్తున్నారు.
Video #GunturKaaram #SSRajamouli 👍 pic.twitter.com/nkaUnwaKWv
— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) January 20, 2024
చదవండి: గుండెపై పచ్చబొట్టు.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన నటి!
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
Comments
Please login to add a commentAdd a comment