ఒక రాత్రిలో జరిగే కథ
ఒక రాత్రిలో జరిగే కథ
Published Fri, Nov 1 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
‘‘సమాజంలో మనకు ఎప్పుడో ఒకప్పుడు తారసపడే పాత్రలతో ఈ సినిమా చేశాను. ఒక రాత్రిలో జరిగే కథ ఇది’’ అని దర్శకుడు శివనాగరెడ్డి చెప్పారు. సింహా, అశోక్, కార్తిక్ ముఖ్యతారలుగా రేర్ డన్ పిక్చర్స్ పతాకంపై సతీష్‌రెడ్డి నిర్మిస్తున్న ‘చార్లి’ చిత్రం లోగోని ‘మధుర’ శ్రీధర్, ప్రచార చిత్రాలను మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘టైటిల్ కొత్తగా ఉంది.
ట్రైలర్‌లో క్యూరియాసిటీ కనిపిస్తోంది’’ అని అభినందించారు. ఈ నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. గూగుల్ సంస్థలో ఉద్యోగం చేసే తనకు హీరోగా తొలి సినిమా అని సింహా చెప్పారు. మారుతి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇది విజయవంతమై, దర్శక, నిర్మాతలకు మరో సినిమా చేసే శక్తినివ్వాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అశోక్, ఎఫ్.ఎం.బాబాయ్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ ఎస్.ఎస్, కెమెరా: వరప్రసాద్.
Advertisement
Advertisement