లెజెండ్‌గా బాలకృష్ణ? | bala krishna as legend ? | Sakshi
Sakshi News home page

లెజెండ్‌గా బాలకృష్ణ?

Published Wed, Oct 2 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

లెజెండ్‌గా బాలకృష్ణ?

లెజెండ్‌గా బాలకృష్ణ?

నటునిగా భిన్నమైన పాత్రలు పోషించి, స్టార్‌గా పలు రికార్డులు సృష్టించి, హీరోగా వంద  చిత్రాలను పూర్తి చేసుకుంటూ... సినీ పరిశ్రమలోని లెజండ్స్‌లో ఒకరిగా నిలిచారు బాలకృష్ణ. అందుకే... ఆయన్ను  తెరపై కూడా ‘లెజెండ్’గా చూపించబోతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘లెజెండ్’ అనే పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
 
 ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. దానికి తగ్గట్టే ప్రతిష్టాత్మకంగా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉండొచ్చని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో... బాలకృష్ణ రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు.
 
 సినిమాకు సంబంధించిన కథా కథనాలు, పాత్ర చిత్రణ కూడా బాలయ్య పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయ్యేలా ఉంటాయని సమాచారం. ‘సింహా’ని మించే స్థాయిలో అత్యంత శక్తిమంతంగా బోయపాటి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా స్టూడియోలో జరుగుతోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. బాలయ్య చిత్రానికి దేవిశ్రీ స్వరాలందించడం ఇదే ప్రథమం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement