Sindhuja
-
పీజీ డాక్టర్ సింధుజ అనుమానాస్పద మృతి
మైసూరు: కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలోని కొళ్లేగాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పీజీ చేస్తున్న డాక్టర్ సింధుజ (28) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని చైన్నెకి చెందిన వెంకటాచలం అనే వ్యక్తి కుమార్తె సింధుజ. తమిళనాడులో ఎంబీబీఎస్ పూర్తి చేసి తరువాత పరీక్షలు రాసి పీజీ అనస్తీషియా (మత్తు) కోర్సుకు అర్హత సాధించింది. గత 8 నెలల నుంచి కొళ్లేగాల ప్రభుత్వ ఉప విభాగం ఆస్పత్రిలో చదువుకుంటూ, శ్రీమహాదేశ్వర కాలేజీ రోడ్డులో అద్దె ఇంటిలో నివసిస్తోంది. డ్యూటీకి రాకపోవడంతో.. సింధుజ శుక్రవారం ఆస్పత్రికి విధులకు రాలేదని, దీంతో మరో డాక్టర్ లోకేశ్వరి ఆమెకు కాల్ చేసినా స్పందన రాలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆస్పత్రి సిబ్బంది ఒకరికి చూసి రమ్మని ఆమె ఇంటికి పంపారు. తలుపు కొట్టినా ఎలాంటి సమాధానం రాకపోడంతో కిటికీలో నుంచి చూడగా సింధుజ నేలపైన బోర్లా పడి ఉంది. పక్కనే సిరెంజి, చాకు కనిపించాయి. పోలీసులు వచ్చి తలుపులు తీసి వెళ్లి చూడగా సింధుజ చనిపోయి పడివుంది. విషపూరిత ఔషధాలను తీసుకుని చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
పెళ్లై.. రెండు నెలలు కాలేదు.. అంతలోనే..
భద్రాద్రి: రెండు నెలల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు చెట్టును ఢీకొని నవ వధువు మృతి చెందింది. భర్త, అత్త, మామలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం కుందారం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబడి ప్రశాంత్‌కు ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన సింధూజ(23)తో గత జూన్ 8న వివాహం జరిగింది. కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రశాంత్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి క్యాబ్ నడుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల భార్యతోపాటు తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగమణి తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి, అద్దెకు ఇల్లు తీసుకుని వచ్చాడు. మంగళవారం రాత్రి ఉల్వనూరులో ఇంటికి తాళంవేసి నలుగురూ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పాలకుర్తిరోడ్లోని కుందారం సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో సింధూజ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ప్రశాంత్, అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వివాహమై రెండు నెలలు కాకముందే.. ప్రశాంత్, సింధూజకు వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తిగా నిండలేదు. ఇక్కడ బతుకుదెరువు లేకపోడంతో హైదరాబాద్ వెళ్లి కారు క్యాబ్ నడుపుకునేందకు కుటుంబం అంతా బయల్దేరారు. అవసరమైన నిత్యావసర వస్తువులు బియ్యం, ఉప్పు, కారం, పచ్చళ్లు, కుట్టు మిషన్ వంటి సామగ్రి వెంట తీసుకెళ్తున్నారు. ప్రమాదస్థలిలో నిత్యావసర వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్న తీరు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహం జరిగిన రెండు నెలలు కాకముందే సింధూజ మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఉల్వనూరు, ముత్తగూడెం గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
సింధూజ మృతదేహం కర్నూలులో లభ్యం
కర్నూలు: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో కలుగొట్ల దగ్గర వాగులో కొట్టుకుపోయిన వైఎస్సార్ జిల్లాకి చెందిన యువతి సింధూజ (26) మృతదేహం కర్నూలులో బయటపడింది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శివశంకర్‌రెడ్డి, సింధూజలకు ఏడాది క్రితం వివాహమైంది. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా..సింధూజ గృహిణి. మిత్రుడు జిలానీ బాషాతో కలిసి వీరు ఈ నెల 25న బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. కర్నూలు దాటిన తరువాత హైవే దిగి అడ్డదారిలో పుల్లూరు, కలుగొట్ల మీదుగా ప్రయాణం సాగించారు. కలుగొట్ల శివారులోని వాగులో నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక అలాగే వెళ్లడంతో కారు మధ్యలో నిలిచిపోయింది. జిలానీ, శివశంకర్‌రెడ్డిలు కారు దిగి ఒడ్డుకు చేరుకోగా, వెనుక సీటులో నిద్రిస్తున్న సింధూజ నీటిలో కొట్టుకుపోయింది. సింధూజ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. కర్నూలు అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ నేతృత్వంలో పది మంది బృందాలుగా ఏర్పడి 2 కిలోమీటర్ల పొడవునా తుంగభద్ర నదిలో పుట్టీల ద్వారా గాలించారు. సోమవారం సాయంత్రం తుంగభద్ర నది రైల్వే బ్రిడ్జి సమీపంలో సింధూజ మృతదేహం లభించింది. -
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి
సాక్షి, నాగోలు: తెలంగాణ అమ్మాయి.. ఇంగ్లాండ్‌కు చెందిన అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో నాగోలు పీఎంఆర్ కన్వెన్షన్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి విఘ్నేశ్వర్ రెడ్డి, లత భార్యాభర్తలు. వీరు కొంతకాలం క్రితం నగరానికి వచ్చి ఎల్బీ నగర్లో నివాసముంటున్నారు. వీరి కుమార్తె సింధూజ ష్యాషన్ డిజైన్ కోర్సు చేయడానకి ఎనిమిదేళ్ల కిందట ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంజిమిన్ డేవిడ్ హాస్‌తో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. ఇరువురి తల్లిదండ్రులూ అంగీకరించటంతో వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకు వరుడి తల్లిదండ్రులు జోమే హాస్, రోబెక్ట్ హాస్‌తో పాటు వారి బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
పెళ్లికూతురి తల్లి ఎంతపని చేసింది..
సాక్షి, హైదరాబాద్ : ముహుర్త బలం గట్టిగా ఉంటేనే వివాహ బంధం కలకాలం నిలుస్తుందని నమ్మకం. అందుకే పెళ్లి ముహుర్తానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని పీటల మీద నుంచి కూతుర్ని తీసుకు వెళ్లిపోయింది ఓ తల్లి. ఈ సంఘటన పటాన్చెరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఇస్నాపూర్ కు చెందిన వెంకటేష్‌కు సింధూజ అనే యువతితో నిశ్చితార్ధం జరిగింది. మార్చి 14వ తేదీ 7 గంటల36 నిమిషాలకు పెళ్లి ముహుర్తం. ఇస్నాపూర్‌లోని పెళ్లికొడుకు నివాసంలో పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ముహుర్తానికి పెళ్లికొడుకు వెంకటేష్, పెళ్లి కూతురు సింధుజ కూడా పెళ్లిపీటలపై కూర్చొవడానికి సిద్దమయ్యారు. అంతే అక్కడ ప్రత్యక్షమైన పెళ్లికూతురు తల్లి నిర్మల ముహుర్తం దాటి పోయిందంటూ కూతుర్ని బలవంతంగా పీటలపై నుంచి లేపి, అక్కడ నుంచి తీసుకు వెళ్లిపోయింది. దీంతో చివరి నిమిషంలో పెళ్లి నిలిచిపోయింది. సినిమా ట్విస్ట్ ను తలపించేలా జరిగిన ఈ ఘటనతో పెళ్లికొడుకు బంధువులు షాక్ తిన్నారు. కాగా జిల్లాకు చెందిన పెళ్లిళ్ల పేరయ్య ఈ సంబంధం కుదిర్చినట్లు పెళ్లికొడుకు తరపు బంధువులు తెలిపారు. అయితే పెళ్లి కూతురు బీదరాలు కావడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలతో పాటు బంగారు ఉంగరాన్ని కూడా ఇచ్చామని చెబుతున్నారు. పెళ్లి కూతురు సింధూ, ఆమె తల్లి నిర్మల మాత్రమే పెళ్లికి వచ్చారన్నారు. చివరకు పెళ్లికొడుకు బంధువుల ఫిర్యాదు మేరకు పెళ్లి కూతురు తల్లి నిర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని..
-
కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
= కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు =నలుగురు దుర్మరణం =రక్తసిక్తమైన బస్టాప్ సాక్షి, విజయవాడ : విధి వారి జీవితాలతో చెలగాటం ఆడింది. అప్పటివరకు చదువుకుని ఇంకో గంటలో ఇంటికి వెళ్లడానికి బస్టాప్‌లో ఎదురు చూస్తున్న ముగ్గురు విద్యార్థినులను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. వివాహ బంధంలోకి వచ్చి మూడు నెలలు కూడా దాటని మరో వైద్యుడిని కూడా కబళించింది. డ్రైవింగ్ లెసైన్స్ కూడా లేని ఫుట్‌వేర్ కంపెనీ ఉద్యోగి నడుపుతున్న కారు బస్టాప్‌లోకి దూసుకొచ్చి నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. త్వరగా విమానాశ్రయానికి చేరాలన్న ఆదుర్దాలో బీపీ డౌన్ అయి ఒక్కసారిగా కారు అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... అది విజయవాడ రామవరప్పాడు రింగ్ సెంటర్. సాయంత్రం ఐదు కావస్తోంది. సమీపంలోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాల అప్పుడే వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్దకు వచ్చి బస్టాప్‌లో నిలుచున్నారు. పిన్నమనేని వైద్యకళాశాల కూడా అప్పుడే వదిలిపెట్టారు. అందులోని డాక్టర్లు, విద్యార్థులు కూడా బయటకు వచ్చారు. ఇలా అక్కడ కోలాహలం నెలకొంది. బస్టాప్‌లో ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు, డాక్టర్లు, ఇతర ప్రయాణికులు నిలుచుని ఉన్నారు. చాలా సురక్షిత ప్రాంతంలోనే ఉన్నా మృత్యువు వారిపైకి కారు రూపంలో దూసుకొచ్చింది. గుంపుగా బస్టాప్ వద్ద నిలుచున్నవారిని వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు. తేరుకునేసరికి 15 మందికి పైగా గాయాలతో కిందపడిపోయారు. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోతిర్మయి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన మరో పదిమందిని అక్కడే ఉన్న పోలీసులు, సమీపంలోని వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చందుశ్రీ, సింధుజ అనే మరో ఇద్దరు విద్యార్థినులు మారుతి సురేష్ అనే వైద్యుడు కన్నుమూశారు. కుటుంబాల్లో తీరని శోకం... ఊహించని దుర్ఘటనలో నలుగురు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు కాగా, మరొకరు పిన్నమనేనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ మారుతి సురే ష్. ఆయన ఏడాదిన్నర క్రితమే ఎండీ పూర్తిచేసి ఉద్యోగంలో చేరారు. మూడు నెలల క్రితమే (గత ఆగస్టులో) పెళ్లయింది. ఆయన భార్య కూడా దంత వైద్య నిపుణురాలు. ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ‘నా కుమారుడిని ఉదయమే బస్టాప్‌లో దింపా.. వెళ్లొస్తా నాన్నా అన్నాడు.. కానీ రాకుండానే వెళ్లిపోయాడు..’ అంటూ సురేష్ తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుల్లో టి.జ్యోతిర్మయి స్వస్థలం నున్న. తండ్రి శివశంకర్ ఎలక్ట్రీషియన్. దాసరి చందుశ్రీ (20) స్వస్థలం కూడా నున్న గ్రామమే. మరో విద్యార్థిని పెసల సింధూజ (20) స్వస్థలం న్యూరాజీవ్నగర్ ప్రాంతం. తండ్రి జనార్ధన్ ఆటోడ్రైవర్. మృతుల బంధువులు, ఆప్తుల రోదనలతో ప్రభుత్వాస్పత్రితో పాటు, సెంటినీ ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని వందలాది మంది ప్రభుత్వాస్పత్రి, సెంటినీ ఆస్పత్రుల వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే డీసీపీ రవిప్రకాష్ విద్యార్థినులు చికిత్స పొందుతున్న సెంటినీ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందనలు ఆస్పత్రికి చేరుకుని మృతుల బంధువులను పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షించారు.