నూజివీడు : మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగ గా భావించి స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన కేసులో నూజివీడు మండలం అన్నవరం గ్రా మానికి చెందిన ఏడుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కేవీ స త్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అ న్నవరంలో ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి సమయంలో సంచరిస్తున్న ముదినేపల్లి చిగురుకోటకు చెందిన మతిస్థిమితం లేని సంధి బెంజి మన్(46)ను దొంగగా భావించి గ్రామస్తులు పలువురు స్తంభానికి కట్టివేసి చితకబాదారు.
ఈ ఘటనలో బెంజిమన్ మరణించాడు. దీని పై కేసు నమోదైంది. దర్యాప్తు సందర్భంగా గ్రామానికి చెందిన ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో పోలిశెట్టి సీతారామయ్య, లేళ్ల గోపాలరావు, యాదల వెంకటేశ్వరరావు, పాటిమీద ప్రసాదరావు, దున్నపోతుల శ్రీనివాసరావు, మొలుగుమాటి కృష్ణమోహన్, మట్టా రామకృష్ణలను బుధవారం ఉదయం అన్నవరంలో అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్బసాని అవినాష్‌ను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు.
ఈ కేసులో మరికొంతమంది నిందితులున్నారని, వారిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుడు బీ టెక్ చదివాడని, విజయవాడలోని ఓ ప్రైవేటు మందుల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా పనిచేశాడన్నారు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారన్నా రు. ఇ తని తండ్రి కూడా విజయవాడలోని అదే కంపెనీలో ఏజీఎంగా పనిచేశాడన్నారు. బెంజిమన్ మతిస్థిమితం లేకపోవడంతో ఊళ్ల వెంట తిరుగుతాడని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. అన్నవరం వాసులు తొందరపాటుతో దొంగ గా భావించి కొట్టడంతోచనిపోయాడన్నారు.
ఎవరినీ కొట్టవద్దు
రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గ్రామస్తులు ఎక్కడైనా పట్టుకుంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలే గానీ కొట్టవద్దని సీఐ సత్యనారాయణ సూచించారు. చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతులలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
బెంజిమన్ హత్య కేసులో ఏడుగురి అరెస్టు
Published Thu, Jul 17 2014 1:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement