I&B Ministry Blocks 7 Indian YouTube Channels And 1 Pakistan YouTube Channel - Sakshi
Sakshi News home page

కేంద్రం సీరియస్‌.. యూట్యూబ్‌ ఛానల్స్‌పై నిషేధం

Published Thu, Aug 18 2022 12:39 PM | Last Updated on Thu, Aug 18 2022 2:38 PM

Indian Government Has YouTube To Block Access Eight Channels - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్‌ చేసినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్‌ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్‌ పాకిస్తాన్‌కు చెందినది. 

ఇదిలా ఉండగా.. కేంద్రం అంతకు ముందు కూడా 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్‌ను బ్లాక్‌ చేసింది. ఇక, గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది. ఇక, ఈ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 

తాజాగా బ్లాక్‌ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్‌.. దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఛానల్స్‌ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తత్కాల్‌ టికెట్స్‌పై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement