గూగుల్‌ హెచ్చరిక.. ఇలా అయితే కంటెంట్‌ కట్‌! | Google Removed Huge Content Based On Personal Complaints | Sakshi
Sakshi News home page

గూగుల్‌కి ఫిర్యాదుల వెల్లువ.. కొరడా ఝులిపించిన టెక్‌ దిగ్గజం

Published Fri, Jul 30 2021 1:22 PM | Last Updated on Fri, Jul 30 2021 2:42 PM

Google Removed Huge Content Based On Personal Complaints - Sakshi

ఇంటర్నెట్‌లో సెక్సువల్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసే సైకోలు, కాపీపేస్ట్‌ రాయుళ్లు, వివాదాస్పద అంశాలు జోడించే వ్యక్తులపై గూగుల్‌ కొరడా ఝులిపించింది. స్థానిక చట్టాలను గౌరవించని, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇందుకు సాక్ష్యంగా ఆటోమేషన్‌, వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా.. అభ్యంతరక కంటెంట్‌ని పెద్ద ఎత్తున తొలగిస్తోంది.

తొలగించిన కంటెంట్‌ 13.78 లక్షలు
వరల్డ్‌ నంబర్‌ వన్‌ సెర్చింజన్‌ గూగుల్‌ అభ్యంతరకరమైన పోస్టులపై చర్యలు తీసుకుంటోంది. ఆటోమేషన్‌ ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ని గుర్తించడంతో పాటు వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఇండియాకు సంబంధించి ఏకంగా 13.78 లక్షల కంటెంట్‌ని గూగుల్‌ తొలగించింది.

ఆటోమేషన్‌లో
కొత్త ఐటీ చట్టాలను అనుసరించి వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా గూగుల్‌ ఇప్పటి వరకు 2,17,095 లింక్‌లను తొలగించగా ఆటోమేషన్‌ పద్దతిలో ఇంతకు పదితంతల సంఖ్యలో అభ్యంతరకర, వివాదాస్పద సమాచారాన్ని గూగుల్‌ డిలీజ్‌ చేసింది. ఆటోమేషన్‌లో తొలగించిన కంటెంట్‌ మేలో 6,34,357 ఉండగా జూన్‌లో 5,26,866గా నమోదైంది. ఇందులో ఎక్కువ భాగం చిన్నారులను లైంగికంగా వేధించడం, జుగుప్సకరమైన హింసకు సంబంధించిన కంటెంట్‌ ఉన్నట్టు గూగుల్‌ తెలిపింది.

వ్యక్తిగత ఫిర్యాదులు
భారత ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను గూగుల్‌ క్రమం తప్పకుండా వెల్లడిస్తోంది. అందులో భాగంగా స్థానిక చట్టాలకు లోబడి ఇంటర్నెట్‌లో అ‍భ్యంతరకర నేర పూరిత, చట్ట విరుద్ధమైన కంటెంట్‌ (టెక్ట్స్‌, వీడియో, ఫోటోలు, ఆడియో) ఉందంటూ భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌లో గూగుల్‌కి  అందిన ఫిర్యాదులు తీసుకున్న చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.

- ఏప్రిల్‌లో 27,700 మంది  ఫిర్యాదు చేయగా  వీటికి సంబంధించి 59,350 వివిధ కంటెంట్‌లని గూగుల్‌ తొలగించింది, 
- మేలో 34,883 ఫిర్యాదులు అందగా 71,132  కంటెంట్‌పై గూగుల్‌ చర్యలు తీసుకుంది.
- జూన్‌లో 36,265 కంప్లైంట్స్‌ రాగా... గూగుల్‌ తొలగించిన కంటెంట్‌ సంఖ్య 83,613​కి చేరుకుంది.

కాపీరైట్‌
గూగుల్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో చట్టపరమైన పరువు నష్టం, కాపీరైట్‌, నకిలీ సమాచారం తదితర కేటగిరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో కాపీరైట్‌, పరువు నష్టానికి సంబంధించినవే నూటికి ఎనభై శాతం ఉంటున్నాయి. తమ కంటెంట్‌ను మరెవరో పోస్టు చేశారని, తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గూగుల్‌ని వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement