Information and Communication Technology
-
ఆవిష్కరణల్లో తెలంగాణ అ‘ద్వితీయం’!
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీ టివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి.. ‘గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ)’ స్కోర్‌ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ గురువారం ఆవిష్కరించారు. పెర్ఫార్మర్స్‌లో టాప్ ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించగా.. ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య–పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్‌ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్‌తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. ఇక కేటగిరీల వారీగా చూస్తే.. పెర్ఫార్మర్స్ కేటగిరీలో 15.24 స్కోర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఎనేబులర్స్ కేటగిరీలో 20.08 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లతో మెరుగైన పనితీరు స్టార్టప్‌లకు తెలంగాణ నిలయంగా మారుతోంది. ‘ఇన్ఫ ర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’ ప్రయోగ శాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7% నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది. స్టార్టప్‌ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘నాలెడ్జ్ డిఫ్యూజన్’ అంశంలో మాత్రం తెలంగాణ పనితీరును మెరుగుపర్చు కోలేక పోయింది. పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో ముందంజలో ఉన్నా.. ఉత్పత్తులు, సేవల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రాష్ట్రాలు తాము సృష్టిస్తున్న పరిజ్ఞానాన్ని ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చడంపై దృష్టి సారించాలని సూచించింది. ‘3ఐ మంత్రం’తో అద్భుత ఫలితాలు: కేటీఆర్ దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో టాప్‌లో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న ‘3ఐ మంత్రం’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని రాష్ట్ర ప్రభుత్వం తన విధానంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021’లో తెలంగాణ మొత్తంగా రెండో స్థానంలో, పెర్ఫార్మర్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది’’ అని ట్వీట్ చేశారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రం తెలంగాణ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో రాష్ట్రం అగ్రగామిగా నిలవడం గర్వకారణం. సీఎం కేసీఆర్, ఐటీ–పరిశ్రమల మంత్రి కేటీఆర్ దూరదృష్టి వల్లే ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలో టాప్ స్థానంలో నిలిచింది. – బి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు -
గూగుల్ హెచ్చరిక.. ఇలా అయితే కంటెంట్ కట్!
ఇంటర్నెట్లో సెక్సువల్ కంటెంట్ అప్లోడ్ చేసే సైకోలు, కాపీపేస్ట్ రాయుళ్లు, వివాదాస్పద అంశాలు జోడించే వ్యక్తులపై గూగుల్ కొరడా ఝులిపించింది. స్థానిక చట్టాలను గౌరవించని, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇందుకు సాక్ష్యంగా ఆటోమేషన్, వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా.. అభ్యంతరక కంటెంట్‌ని పెద్ద ఎత్తున తొలగిస్తోంది. తొలగించిన కంటెంట్ 13.78 లక్షలు వరల్డ్ నంబర్ వన్ సెర్చింజన్ గూగుల్ అభ్యంతరకరమైన పోస్టులపై చర్యలు తీసుకుంటోంది. ఆటోమేషన్ ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ని గుర్తించడంతో పాటు వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఇండియాకు సంబంధించి ఏకంగా 13.78 లక్షల కంటెంట్‌ని గూగుల్ తొలగించింది. ఆటోమేషన్‌లో కొత్త ఐటీ చట్టాలను అనుసరించి వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా గూగుల్ ఇప్పటి వరకు 2,17,095 లింక్‌లను తొలగించగా ఆటోమేషన్ పద్దతిలో ఇంతకు పదితంతల సంఖ్యలో అభ్యంతరకర, వివాదాస్పద సమాచారాన్ని గూగుల్ డిలీజ్ చేసింది. ఆటోమేషన్‌లో తొలగించిన కంటెంట్ మేలో 6,34,357 ఉండగా జూన్‌లో 5,26,866గా నమోదైంది. ఇందులో ఎక్కువ భాగం చిన్నారులను లైంగికంగా వేధించడం, జుగుప్సకరమైన హింసకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు గూగుల్ తెలిపింది. వ్యక్తిగత ఫిర్యాదులు భారత ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను గూగుల్ క్రమం తప్పకుండా వెల్లడిస్తోంది. అందులో భాగంగా స్థానిక చట్టాలకు లోబడి ఇంటర్నెట్లో అభ్యంతరకర నేర పూరిత, చట్ట విరుద్ధమైన కంటెంట్ (టెక్ట్స్, వీడియో, ఫోటోలు, ఆడియో) ఉందంటూ భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్‌లో గూగుల్‌కి అందిన ఫిర్యాదులు తీసుకున్న చర్యల వివరాలు ఇలా ఉన్నాయి. - ఏప్రిల్‌లో 27,700 మంది ఫిర్యాదు చేయగా వీటికి సంబంధించి 59,350 వివిధ కంటెంట్‌లని గూగుల్ తొలగించింది, - మేలో 34,883 ఫిర్యాదులు అందగా 71,132 కంటెంట్‌పై గూగుల్ చర్యలు తీసుకుంది. - జూన్‌లో 36,265 కంప్లైంట్స్ రాగా... గూగుల్ తొలగించిన కంటెంట్ సంఖ్య 83,613కి చేరుకుంది. కాపీరైట్ గూగుల్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో చట్టపరమైన పరువు నష్టం, కాపీరైట్, నకిలీ సమాచారం తదితర కేటగిరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో కాపీరైట్, పరువు నష్టానికి సంబంధించినవే నూటికి ఎనభై శాతం ఉంటున్నాయి. తమ కంటెంట్‌ను మరెవరో పోస్టు చేశారని, తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గూగుల్‌ని వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. -
ఐటీలో వర్క్‌ఫ్రం హోంకి ఎండ్‌కార్డ్! ఎప్పుడంటే?
దిగ్గజ ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకి ఎండ్‌కార్డ్ పలికేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఏడాదిన్నరకి పైగా కొనసాగుతున్న విధానానికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇళ్ల నుంచి కాదు ఆఫీసుకు వచ్చి పని చేయండి త్వరలోనే చెప్పబోతున్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా వర్క్‌ఫ్రం హోం కామన్‌గా మారింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు అయితే వర్క్‌ఫ్రం హోంపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ఐటీ ప్రొఫెషనల్స్ ఆరోగ్యం, కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఇంటి నుంచి పనికే మద్దతు తెలిపాయి. అయితే క్రమంగా దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో ఇంటి నుంచి పనికి స్వస్తి పలికి ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులను కోరేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యాక్సినేషన్‌పైనే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటే, ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ కోరుతామంటూ విప్రో మానవ వనరుల విభాగం చీఫ్ సౌరభ్ గోవిల్ తెలిపినట్టు ‘మింట్’ పేర్కొంది. ఇటీవల జరిగిన విప్రో వార్షిక సమావేశంలో వర్క్ఫ్రంహోంపై కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక ప్రకటన చేసినట్టు మింట్ తెలిపింది. దాని ప్రకారం విప్రోకు ఇండియాలో రెండు లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మిగిలిన ఉద్యోగులకు కూడా టీకాలు ఇప్పించి ఆఫీసు నుంచి పని చేయాలని విప్రో కోరనున్నట్టు సమాచారం. ఆఫీసుకే ఓటు ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులతో దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న టీసీఎస్ కూడా వర్క్‌ఫ్రం హోంకి బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే టీసీఎస్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగే తీరు ఆధారంగానే నిర్ణయం తీసుకోనన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరు చివరి నాటికి తమ కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు టీకాలు పూర్తవుతాయని టీసీఎస్ హెచ్ఆర్ గ్లోబల్ ఛీప్ మిలింద్ తెలిపారు. 98 శాతం వర్క్‌ఫ్రం హోం ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో 98 శాతం మంది వర్క్‌ఫ్రం హోంలోనే ఉన్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి పని చేయాలని కోరే యోచనలో ఉంది ఇన్ఫోసిస్. సెప్టెంబరు ? ఇప్పటి వరకైతే టీసీఎస్, విప్రో కంపెనీలు సెప్టెంబరు చివరి వారం నాటికి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పని చేయాలని కోరాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ మేరకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ ఈ ఏడాది చివరి నాటికి కనీసం 30 శాతం మంది ఉద్యోగులను ఆఫీసుకుల రమ్మలాని పిలిచే అవకాశం ఉంది. కచ్చితంగా చెప్పలేం అయితే వర్క్‌ఫ్రం హోంకు మంగళం పాడాలా వద్దా అనే అంశంపై ఐటీ కంపెనీలు కచ్చితమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించకలేక పోతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం, కరోనా థర్డ్ వేవ్ ఇతర అంశాల ఆధారంగానే వర్క్‌ఫ్రం హోం ఎన్నాళ్లు అనేది ఆధారపడి ఉంది. -
నవకల్పనల్లో భారత్‌కు ‘టాప్’ ర్యాంకు
న్యూఢిల్లీ : నవకల్పన(ఇన్నోవేషన్)లకు సంబంధించి టాప్ 50 దేశాల జాబితాలో భారత్ తొలిసారి స్థానం దక్కించుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిల్చింది. 2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నవకల్పనల్లో టాప్ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది. వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. (ఇక వచ్చే ఏడాదే జీడీపీ ‘వెలుగు’) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు నాణ్యమైన ఆవిష్కరణలకు తోడ్పడుతున్నాయని డబ్ల్యూఐపీవో తెలిపింది. జీఐఐ టాప్ 5 దేశాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. జీఐఐ కోసం 131 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాల ప్రాతిపదికన ర్యాంకింగ్ ఇచ్చారు. (ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం) -
ఐసీటీ వేగవంతం దిశగా చర్యలు
విద్యా రంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మరింత సమర్థంగా వినియోగించడానికి, తద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి మరిన్ని చర్యలు అమల్లోకి రానున్నాయి. ఐసీటీ వినియోగం లక్ష్యంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 2500కు పైగా కళాశాలల్లో ప్రతి కళాశాలకు బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని తద్వారా దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలలను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రతి కళాశాలకు 512 కేబీపీఎస్ స్పీడ్ సామర్థ్యంతో 15 నుంచి 20 బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా 419పైగా యూనివర్సిటీలకు 1 జీబీపీఎస్ వేగం ఉన్న ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా ఈ పథకం కింద గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వారి అకడమిక్ అవసరాలను తీర్చేలా ఈ-బుక్స్, ఈ-జర్నల్స్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.