దిగ్గజ ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకి ఎండ్‌కార్డ్ పలికేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఏడాదిన్నరకి పైగా కొనసాగుతున్న విధానానికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇళ్ల నుంచి కాదు ఆఫీసుకు వచ్చి పని చేయండి త్వరలోనే చెప్పబోతున్నాయి.
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా వర్క్‌ఫ్రం హోం కామన్‌గా మారింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు అయితే వర్క్‌ఫ్రం హోంపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ఐటీ ప్రొఫెషనల్స్ ఆరోగ్యం, కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఇంటి నుంచి పనికే మద్దతు తెలిపాయి. అయితే క్రమంగా దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో ఇంటి నుంచి పనికి స్వస్తి పలికి ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులను కోరేందుకు సిద్ధమవుతున్నాయి.
వ్యాక్సినేషన్‌పైనే
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటే, ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ కోరుతామంటూ విప్రో మానవ వనరుల విభాగం చీఫ్ సౌరభ్ గోవిల్ తెలిపినట్టు ‘మింట్’ పేర్కొంది. ఇటీవల జరిగిన విప్రో వార్షిక సమావేశంలో వర్క్‌ఫ్రంహోంపై కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక ప్రకటన చేసినట్టు మింట్ తెలిపింది. దాని ప్రకారం విప్రోకు ఇండియాలో రెండు లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మిగిలిన ఉద్యోగులకు కూడా టీకాలు ఇప్పించి ఆఫీసు నుంచి పని చేయాలని విప్రో కోరనున్నట్టు సమాచారం.
ఆఫీసుకే ఓటు
ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులతో దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న టీసీఎస్ కూడా వర్క్‌ఫ్రం హోంకి బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే టీసీఎస్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగే తీరు ఆధారంగానే నిర్ణయం తీసుకోనన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరు చివరి నాటికి తమ కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు టీకాలు పూర్తవుతాయని టీసీఎస్ హెచ్‌ఆర్ గ్లోబల్ ఛీప్ మిలింద్ తెలిపారు.
98 శాతం వర్క్‌ఫ్రం హోం
ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో 98 శాతం మంది వర్క్‌ఫ్రం హోంలోనే ఉన్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి పని చేయాలని కోరే యోచనలో ఉంది ఇన్ఫోసిస్.
సెప్టెంబరు ?
ఇప్పటి వరకైతే టీసీఎస్, విప్రో కంపెనీలు సెప్టెంబరు చివరి వారం నాటికి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పని చేయాలని కోరాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ మేరకు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ ఈ ఏడాది చివరి నాటికి కనీసం 30 శాతం మంది ఉద్యోగులను ఆఫీసుకుల రమ్మలాని పిలిచే అవకాశం ఉంది.
కచ్చితంగా చెప్పలేం
అయితే వర్క్‌ఫ్రం హోంకు మంగళం పాడాలా వద్దా అనే అంశంపై ఐటీ కంపెనీలు కచ్చితమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించకలేక పోతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం, కరోనా థర్డ్ వేవ్ ఇతర అంశాల ఆధారంగానే వర్క్‌ఫ్రం హోం ఎన్నాళ్లు అనేది ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment