ఐసీటీ వేగవంతం దిశగా చర్యలు
విద్యా రంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మరింత సమర్థంగా వినియోగించడానికి, తద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి మరిన్ని చర్యలు అమల్లోకి రానున్నాయి. ఐసీటీ వినియోగం లక్ష్యంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 2500కు పైగా కళాశాలల్లో ప్రతి కళాశాలకు బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని తద్వారా దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలలను అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
ప్రతి కళాశాలకు 512 కేబీపీఎస్ స్పీడ్ సామర్థ్యంతో 15 నుంచి 20 బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా 419పైగా యూనివర్సిటీలకు 1 జీబీపీఎస్ వేగం ఉన్న ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా ఈ పథకం కింద గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వారి అకడమిక్ అవసరాలను తీర్చేలా ఈ-బుక్స్, ఈ-జర్నల్స్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.