
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 3,650 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరిందన్నారు. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ