
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 3,599 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 9 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో నలుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
ప్రస్తుతం 59 మంది ఐసొలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆదివారం 2,016 మంది కరోనా టీకా తీసుకున్నారు. వారిలో 1,523 మంది బూస్టర్ డోస్ టీకా తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.57 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల్లో మాత్రం 21,010 డోసులు ఉండగా, హైదరాబాద్ రాష్ట్ర టీకా నిల్వ కేంద్రంలో 9.36 లక్షలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment